S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 01:44

రాజమహేంద్రవరం, మే 17: ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేసిన దరిమిలా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. హోదాను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గతంలో జిల్లాకు వచ్చినపుడు ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయా లేదా అనేది సందేహమే. ప్రధానంగా కాకినాడలో హార్డ్‌వేర్ పార్కు ప్రకటించారు. పెట్రో కారిడార్‌ను శరవేగంగా పరుగులు పెట్టిస్తామన్నారు.

05/18/2016 - 01:44

రామచంద్రపురం, మే 17: ఉభయ గోదావరి జిల్లాల్లోని ఈస్ట్రన్, వెస్ట్రన్, సెంట్రల్ డెల్టా రైతుల నోట్లో మట్టి పోస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలన్నింటినీ ప్రజలకు తెలియపరచాలని, వాస్తవాలను తెలిపితే.. తప్పులు బయటపడతాయని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

05/18/2016 - 01:43

పెద్దాపురం, మే 17: పెద్దాపురం మున్సిపాలిటీకి వందేళ్లు నిండాయి. 1915లో రాష్ట్రంలో రెండవ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు మున్సిపల్ ఛైర్మన్ సింహాసనాన్ని అధిష్ఠించారు. వారి వారి సామర్ధ్యాలు, తెలివితేటలతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. మరెందరో ప్రత్యేక అధికారులు తమవంతు అభివృద్ధిలో భాగస్వామ్యం అందించారు.

05/18/2016 - 01:43

కాకినాడ సిటీ, మే17: తూర్పు గోదావరి జిల్లాలోని ఏజన్సీ ప్రాంతం చింతూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టుచేశారు. వారికి సహకరిస్తున్న మరో నలుగురు మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అరెస్టుచేసిన ఇద్దరు మావోలు, నలుగురు మిలీషియా సభ్యుల వివరాలను జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు.

05/18/2016 - 01:42

రాజమహేంద్రవరం, మే 17: కాపు కార్పొరేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రూపు రుణాలు మంజూరుచేయాలని నిర్ణయించామని కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు తెలిపారు. ఒక్కో గ్రూపునకు రూ.25 లక్షల వరకు రుణం అందిస్తామని, అందులో రూ.10 లక్షలు సబ్సిడీ ఉంటుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

05/18/2016 - 01:39

ఏలూరు, మే 17: ఎపిఎస్‌ఆర్టీసీని ప్రజలు ఆదరించే విధంగా వ్యవహరించడం ద్వారా సంస్థ బలోపేతమవుతుందని ఆర్టీసీ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆర్‌టిసి ఆర్ ఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని డిఎంలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

05/18/2016 - 01:38

ఏలూరు, మే 17 : జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరు నగరాన్ని పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పూర్తిస్థాయిలో చక్కదిద్దడానికి ప్రజాసహకారం తీసుకుంటామని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ చెప్పారు. స్థానిక డిఐజి కార్యాలయంలో మంగళవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి డిఐజి రామకృష్ణకు పుష్పగుచ్ఛం అందించి ఏలూరులో ట్రాఫిక్‌సమస్యను పరిష్కరించాలని కోరారు.

05/18/2016 - 01:38

ఏలూరు, మే 17: జిల్లాలో 2016-17 విద్యా సంవత్సరంలో 2.83 లక్షల మంది బాల బాలికలకు రెండు జతల ఉచిత ఏక రూప దుస్తులను జూన్ 11వ తేదీనే అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. స్థానిక సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో మంగళవారం స్వర్వశిక్ష అభియాన్ అధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు.

05/18/2016 - 01:37

ద్వారకాతిరుమల, మే 17: శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలకు చరాచర సృష్టికి ఆహ్వానం పలుకుతూ..మంగళవారం రాత్రి జరిగిన ధ్వజారోహణ వేడుక భక్తజనకోటికి నేత్రపర్వమైంది. వైఖానస ఆగమ యుక్తంగా సర్వాది దేవతలను స్వాగతిస్తూ లాంఛనంగా వేద మంత్రోచ్ఛరణలతో శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై అర్చకులు గరుడ పతాకాన్ని ఎగురవేశారు. ఆధ్యంతం ఈ కార్యక్రమాలు తిలకించిన భక్తజనం పరవశించింది.

05/18/2016 - 01:36

భీమవరం, మే 17: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ పథకానికి సంబంధించి సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లోని లోపాలను సరిదిద్దడానికి ఎయికామ్ కన్సల్టెన్సీ రంగంలోకి దిగింది. సంజయ్‌శర్మ ఆధ్వర్యంలోని విజయశర్మ, మెహర్ బృందం మంగళవారం భీమవరం కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావును కలిసింది. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలను అమృత్ పథకానికి ఎంపికచేశారు.

Pages