S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 01:36

నిడదవోలు, మే 17: స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్రపత్ర గ్రహీత, నీలాపు వెంకటరెడ్డి (97) మంగళవారం నిడదవోలులో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన దేశం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చిన్న వయసులోనే స్వాతంత్య్ర పోరాటంలో నేను సైతం అంటూ జైలుకు వెళ్లారు.

05/18/2016 - 01:36

పాలకొల్లు, మే 17: తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీగా నిలిచిందని, గెలిస్తే ప్రజలకు ఏమీ చేయాలో వాటిని చేసిందని, ఓడినప్పుడు ప్రజల తీర్పును గౌరవించి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష బాధ్యత వహించి ప్రజల అవసరాల కోసం పోరాటం చేస్తూ వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.

05/18/2016 - 01:35

ఏలూరు, మే 17 : మూగజీవాల వ్యర్ధాలను మినీ లారీల ద్వారా గుడివాడ నుంచి వీరమ్మకుంట తరలిస్తుండగా పెదపాడు పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి 11 మంది నిందితులను అరెస్టుచేసి నాలుగు మినీ లారీలను సీజ్ చేసినట్లు ఏలూరు డిఎస్‌పి గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు.

05/18/2016 - 01:34

గోపాలపురం, మే 17: ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యులు సకాలంలో మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాలని జిల్లా ప్రభుత్వాసుపత్రి సేవల సమన్వయ అధికారి శంకరరావు అన్నారు. మంగళవారం ఆయన గోపాలపురం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, మందులు, వివిధ విభాగాల రికార్డులను పరిశీలించారు.

05/18/2016 - 01:34

మొగల్తూరు, మే 17: మొగల్తూరు-కెపి పాలెం గ్రామాల మధ్యగల వెస్ట్‌కుక్కల్ డ్రెయిన్ నుండి సైపాన్‌లోకి ఒడుగు జాతికి చెందిన చేపలు చనిపోయి పంట కాలువలోకి కొట్టుకు వచ్చాయి. ఈ చేపలు చాలా అరుదుగా ఉంటాయని, చప్ప నీటితో ఈ చేపలు బతుకుతాయని పలువురు మత్య్సకారులు తెలిపారు.

05/18/2016 - 01:33

తాడేపల్లిగూడెం, మే 17: మహిళలు ఆర్థిక స్వయం సమృద్దిని సాధించాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. రూరల్ మండలం కృష్ణాయపాలెంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రెడ్డి వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు.

05/18/2016 - 01:03

హైదరాబాద్, మే 17: రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిలంలో రంగారెడ్డి జిల్లా విద్యా శాఖపై ఆయన రాష్ట్ర మంత్రి పి.మహేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

05/18/2016 - 01:03

హైదరాబాద్, మే 17: గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. నగరాభివృద్ధికి చెందిన పలు అంశాలపై ఈ నెల 14వ తేదీన అధ్యయనం నిమిత్తం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే! పర్యటనలో భాగంగా మేయర్ మంగళవారం ఫ్రాన్స్‌లోని బోర్డె నగరాన్ని సందర్శించి, అక్కడి మేయర్‌ను మర్యాదపూర్వకంగా కల్సుకుని పలు అంశాలపై చర్చించారు.

05/18/2016 - 01:02

హైదరాబాద్, మే 17: కరవు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌పి సింగ్ ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో డ్వామా, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు.

05/18/2016 - 01:01

కాచిగూడ, మే 17: ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన ‘అరుణాచల రమణీయము’ గ్రంథావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కాసుఖేల రాఘవేంద్ర విశే్వశ్వరరావు పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు.

Pages