S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:11

గుంటూరు (పట్నంబజారు), మే 17: పార్లమెంటు సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు ఎవరిపంతాలను వారు నెగ్గించుకునేందుకు ప్రజలను విస్మరించారని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంస్థ కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. చర్చా కార్యక్రమానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆర్‌వి సింగరయ్య అధ్యక్షత వహించారు.

05/18/2016 - 02:10

రేపల్లె, మే 17: భార్యపై అనుమానంతో అతికిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్యాయత్యానికి పాల్పడిన భర్త పాల్పడిన సంఘటన పట్టణంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని 27వ వార్డుకు చెందిన మునగాల మన్మధరావు భార్య ఉషారాణి దంపతులు 15 సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవల కాలంలో తరచూ భార్య భర్యల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

05/18/2016 - 02:10

సత్తెనపల్లి, మే 17: విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నాయని చెట్టుకొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని విద్యుత్‌శాఖా అధికారులు మంగళవారం చేపట్టడంతో ఆయా ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విద్యుత్ తీగలకు అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను నరికివేయమన్నారేకానీ, ఆనరికిన కొమ్మలను ఎక్కడ వేయాలో తమకు చెప్పలేదని, అందుకనే అక్కడే వదిలేసి వెళుతున్నామని సిబ్బంది తెలిపారు.

05/18/2016 - 02:09

గుంటూరు (పట్నంబజారు), మే 17: బ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన ప్రొఫెసర్ కంచె ఐలయ్యను అరెస్ట్ చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్ శర్మ, సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం ప్రసాద్ డిమాండ్ చేశారు.

05/18/2016 - 02:08

తిరుమల, మే 17: తిరుమల్లో మంగళవారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు ముగియడం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఈరెండు రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచివుండే పరిస్థితి ఏర్పడింది.

05/18/2016 - 02:07

తిరుపతి, మే 17: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. నగరంలో ఎటుచూసినా గంగజాతర సంబరాలే కనిపించాయి. ఈనెల 10వ తేదీన చాటింపుతోప్రారంభమైన జాతర మంగళవారంతో ముగుస్తుంది. అయితే బుధవారం తెల్లవారుజామున ఆలయంలోని విశ్వరూప స్థంభానికి గంగమ్మ విశ్వరూపాన్ని పేరంటాళ్ళు చెంపనరకడంతో జాతర ముగిసినట్లు భావిస్తారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

05/18/2016 - 02:06

చిత్తూరు, మే 17: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 6.7 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్యవేడులో 45.6మి.మీ వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాక్షికంగా మామిడి, అరటి, పంటలకు నష్టం వాటిల్లింది.

05/18/2016 - 02:06

తిరుచానూరు,మే 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను తిరుచానూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు.

05/18/2016 - 02:05

శ్రీకాళహస్తి, మే 17: పట్టణంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణం జరిగింది. సాయంత్రం ధ్వజస్థంభానికి అర్చకులు అలంకారం చేసి పూజలు నిర్వహించారు. ఆ తరువాత గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈసందర్భంగా ఆలయంలోని వరదరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

05/18/2016 - 02:04

తిరుమల, మే 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం మాజీ ప్రధాని దేవెగౌడ మంగళవారం సాయంత్రం తిరుమలకు విచ్చేశారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు విచ్చేశారు. ఈసందర్భంగా పద్మావతి అతిధిగృహాల సముదాయాల్లోని పాండవం అతిధి భవనం వద్ద రిసెప్షన్ డిప్యూటీ ఇఒ హరేంద్రనాథ్, ఓఎస్‌డి లక్ష్మీనారాయణ యాదవ్ పుష్పగుచ్ఛంతో ఆయనకు సాదరస్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.

Pages