S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 01:50

హిందూపురం రూరల్, మే 17 : కరవుతో సతమతమవుతున్న పాడి రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు తెలిపాన్నారు. మంగళవారం స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పాడి రైతులకు సబ్సిడీ కింద దాణా పంపిణీ చేశారు.

05/18/2016 - 01:50

బ్రహ్మసముద్రం, మే 17: మండల పరిధిలోని పిల్లలపల్లి గ్రామంలో సో మవారం అర్ధరాత్రి సమయంలో వడ్డె మంజమ్మ(19)ను భర్త వడ్డె రాజన్న హత్య చేసి ఘటన చోటు చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు మారెక్క, అంజినప్ప, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుమ్మఘట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన మారెక్క, అంజినప్ప దంపతులకు నలుగురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు.

05/18/2016 - 01:49

తనకల్లు, మే 17: మండలంలోని కోక్కంటి క్రాస్ అమడగూరు రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆదినారాయణ(35) మృతి చెందారు. ఆదినారాయణ మండలంలోని కోటపల్లిలో వున్న తమ అత్తగారి ఇంటికి వచ్చి తిరిగి తన స్వగ్రామమైన కర్ణాటక రాష్ట్రం పాళ్యంకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

05/18/2016 - 01:49

కంబదూరు, మే 17 : మండల పరిధిలోని అండేపల్లి గ్రామంలో తల్లి మందలించినందుకు బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎరుకల తిమ్మక్క కుమారుడు ఎరుకల గణేష్ (14) తల్లి మందలించినందుకు అభం, శుభం తెలియని చిన్నారి గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ తోటలో చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.

05/18/2016 - 01:48

బత్తలపల్లి, మే 17: మండలంలోని డి.చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో గల పత్యాపురం గ్రామంలో మంగళవారం గొర్రెల కాపరి కృష్ణానాయక్(55) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. తమకు చెందిన గొర్రెలను మేపుకోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళగా గత రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

05/18/2016 - 01:48

హిందూపురం టౌన్, మే 17 : నిత్యావసర ధరలతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కొనాలన్నా, తిన్నాలన్నా అల్లాడుతున్నారు. వర్షాభావానికి తోడు కూరగాయల సాగు విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతుండటం, తీవ్రమైన ఎండలు నమోదవుతుండటంతో ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు, వ్యాపారులు అంటున్నారు.

05/18/2016 - 01:46

కాకినాడ రూరల్, మే 17: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటుకు నోటు భయం పట్టుకుందని, అందుకే తెలంగాణా ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంపై నోరు మెదపడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.

05/18/2016 - 01:46

కాకినాడ, మే 17: డిఎస్‌సి -2014 జిల్లా టాపర్‌గా స్థానిక శ్రీ వివేకానంద విద్యాసంస్థల ప్రిన్సిపాల్ డిఎ రాజశేఖర్ నిలిచారు. స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ విభాగంలో 153 మార్కులు సాధించి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. దీని ద్వారా ఓపెన్ కేటగిరీలో ఈ విభాగానికి సంబంధించి ఉన్న ఒకే ఒక్క పోస్టును రాజశేఖర్ కైవశం చేసుకున్నారు.

05/18/2016 - 01:45

కాకినాడ, మే 17: జిల్లాలో ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని, నీటి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు మంగళవారం కాకినాడ నగరంలోని జడ్పీ సమావేశ హాలులో జరిగాయి.

05/18/2016 - 01:45

రాజమహేంద్రవరం, మే 17: జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు - చెట్టు పథకంపై నీటి సంఘాలకు దిశ నిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ స్థానిక చెరుకూరి కళ్యాణమండపంలో నీరు - చెట్టు సదస్సు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి నీటి సంఘాలకు దిశ నిర్దేశం చేయనున్నారు.

Pages