S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 01:57

రామాపురం, మే 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసమర్థత వల్లనే ఎగువనున్న గోదావరి నదిపై అక్రమంగా తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా జలదీక్ష సంఘీభావం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

05/18/2016 - 01:57

కడప,మే 17: ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణీగా నమోదు అయినప్పటి నుంచి ఆసుపత్రిలో సురక్షత ప్రసవం జరిగేంతవరకు వారికి అందాల్సిన అన్ని రకాల ఆరోగ్య, పోషణ సేవలు ప్రతి గర్భిణీకి అందేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి సత్యనారాయణ రాజును కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు.

05/18/2016 - 01:56

పెండ్లిమర్రి,మే 17: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం పెండ్లిమర్రి తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైకాపా మండల కన్వీనర్ చంద్రారెడ్డి, మండలాధ్యక్షురాలు అనూరాధ, ఉపమండలాధ్యక్షుడు వెంకటశివారెడ్డిల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది.

05/18/2016 - 01:54

అనంతపురం సిటీ, మే 17: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే క్రమంలో నూతన టెక్నాలజీని అలవరుచుకుని జిల్లా అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిఆర్‌సి సమావేశంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విఫ్ యామినీ బాలలు పాల్గొన్నారు.

05/18/2016 - 01:53

రాప్తాడు, మే 17: నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి ఊపిరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల కన్వీనర్ సాకే నారాయణస్వామి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడును తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు.

05/18/2016 - 01:53

అనంతపురం సిట, మే 17: వైద్యులు చిత్తశుద్ధితో రోగులకు సేవలను అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతలు తెలిపారు.

05/18/2016 - 01:52

అనంతపురం సిటీ, మే 17: విద్యార్థులను క్షేత్రస్థాయి నుంచే సామాజిక సేవారంగంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయాలని రాష్ట్ర పౌర సంబంధాలు సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో నీరు-చెట్టు, ఇంకుడు గుంతలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

05/18/2016 - 01:52

ధర్మవరం, మే 17: పట్టణంలోని లక్ష్మిచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భానుప్రకాష్‌లు స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పుష్ప మండపంలో వుంచి పట్టణంలో ఊరేగింపు జరిపారు.

05/18/2016 - 01:51

గుంతకల్లు, మే 17 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హనుమజ్జయంతికి సంబంధించిన పోస్టర్లను ఆలయ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఇఓ ధనుంజయ మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా పాంచాహ్నిక దీక్ష, హనుమజ్జయంతి యాగ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

05/18/2016 - 01:51

హిందూపురం టౌన్, మే 17 : పట్టణంలో ప్టాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వేరోడ్డులోని ఓ దుకాణంలో ప్లాస్టిక్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందడంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాజగోపాల్, జబ్బార్‌మియా, సుధాకర్, మహబూబ్‌బాషాలు తనిఖీలు చేపట్టారు.

Pages