S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/10/2017 - 00:22

విజయవాడ (క్రైం), అక్టోబర్ 9: ఏసిబి అధికారులకు చిక్కిన అవినీతి అనకొండ జివి రఘు కస్టడీ ముగిసింది. ఆదాయానికి మించి వందల కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో ఏపి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఎన్‌వి రఘు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ శివప్రసాద్, అతని భార్య గాయత్రిలను కొద్దిరోజుల క్రితం ఏసిబి అధికారులు అరెస్టు చేసి రిమాండుకు పంపిన విషయం తెలిసిందే.

10/10/2017 - 00:21

అమరావతి, అక్టోబర్ 9: పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు.

10/10/2017 - 00:21

గుంటూరు, అక్టోబర్ 9: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు క్యాడర్‌ను బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా పార్లమెంటు స్థానాల్లో బూత్ కమిటీలను పటిష్టం చేయాలని ఇందుకు జిల్లాల వారీగా నేతలతో సంప్రతింపులు జరిపేందుకు కార్యాచరణ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం స్థానిక రాజధాని కాన్ఫరెన్స్ హాలులో బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది.

10/10/2017 - 00:20

విజయవాడ, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ గైడ్‌ల శిక్షణకు క్యాలెండర్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సోమవారం విశాఖపట్నం వేదికగా స్టేట్ టూరిస్ట్ గైడ్ శిక్షణను ప్రారంభించింది. ఇందులో ఇరవై మందికి అవకాశం ఉండగా, వీరికి 75 రోజుల పాటు శిక్షణ అందించనున్నామని అథారిటీ సిఇఓ హిమాన్షు శుక్లా తెలిపారు. శిక్షణా కాలంలో వీరికి ఉచిత వసతి, భోజనంతోపాటు ప్రతినెల వేతనం కూడా అందిస్తామన్నారు.

10/10/2017 - 23:24

విజయవాడ (క్రైం): ఓ పాస్టర్‌ను ఆయన వద్ద పనిచేసిన యువకులు బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుపై అరెస్టయిన ముగ్గురి నిందితుల వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారి, పాస్టర్ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది.

10/10/2017 - 23:25

విజయవాడ, అక్టోబర్ 8: గత మూడేళ్లలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, మూడో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుమిత్రగా చరిత్రలో నిలిచిపోతారని టిడిపి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, హన్మంతరాయ చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనివిధంగా రైతుల కోసం రుణమాఫీ చేశారన్నారు.

10/10/2017 - 23:25

విజయవాడ, అక్టోబర్ 8: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నవ్యాంధ్రప్రదేశ్‌లో గ్రామాల రూపురేఖలను తెలుగుదేశం ప్రభుత్వం మారుస్తుంటే ప్రతిపక్షం మాత్రం అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతోందని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ‘నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలకు గండికొట్టారు. వారి నోటికాడ కూడును లాక్కున్నారు.

10/10/2017 - 23:26

విజయవాడ, అక్టోబర్ 8: మంటలు చెలరేగి సర్వం బూడిదపాలు కావటం, ఆపై ఫైరింజన్‌లు రావటమనేది పూర్వపు మాట! ప్రస్తుతం దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర అగ్నిమాపక శాఖ మంటలు చెలరేగిన తర్వాత రావటమే కాకుండా, ఆదిలోనే మంటలను ఎలా ఆర్పాలో అతి సామాన్యులకు సైతం తెలియచెప్పే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విధానాల వల్ల సానుకూల ఫలితాలు రావడంతో గతంలో కంటే అగ్నిప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి.

10/09/2017 - 02:59

రాజమహేంద్రవరం, అక్టోబర్ 8: కాపుజాతి కోసం పోరాటం సాగిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నిర్బంధించడం, వేలాది మంది పోలీసులను ఆయన ఇంటి చుట్టూ కాపలా పెట్టించడం వంటి పనులన్నీ ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్న పనని, దానికి బదులుగా ముద్రగడను అరెస్టుచేసి సెంట్రల్ జైల్లో పెట్టేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వానికి సూచిస్తున్నామని మాజీ ఎంపి జివి హర్షకుమార్ అన్నారు.

10/09/2017 - 02:58

ప్రత్తిపాడు, అక్టోబర్ 8: కాపు సోదరులు సుదూర ప్రాంతాల నుండి తనను కలిసేందుకు కిర్లంపూడికి వస్తున్నారని, వారందరినీ తన వద్దకు రావద్దని తానే ఆత్మీయ పలకరింపు పేరుతో వారిని కలుస్తుంటే అనుమతిలేదని అడ్డుకోవడం దారుణమని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. లేఖ ప్రతులను కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆదివారం విలేఖర్లకు అందించారు.

Pages