S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/04/2017 - 01:56

విజయవాడ, సెప్టెంబర్ 3: కేంద్ర మంత్రివర్గంలో చేరిన కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అశాస్ర్తియ విభజన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ రాష్ట్రానికి కొత్త బృందం తోడ్పాటు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తిచేసిన రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్లను కూడా ముఖ్యమంత్రి అభినందించారు.
బాలిక హత్యపై సీరియస్

09/04/2017 - 01:56

భట్టిప్రోలు, సెప్టెంబర్ 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతల అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నాయని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.

09/04/2017 - 01:46

ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైంది. నా స్పందనను మాటల్లో చెప్పలేను. రక్షణ మంత్రి పదవి ఎంతో బాధ్యతతో కూడుకొన్నది. దేశ రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నానుంచి ఆశించిన లక్ష్యాలను చేరుకోవడానికి నిర్విరామంగా శ్రమిస్తా.

09/04/2017 - 00:18

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆన్‌లైన్‌లో వివిధ రకాల సరకులను రేషన్ కార్డుదారులకు సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. విలేజ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్‌లో కూడా సరకులను ఆర్డర్ ఇచ్చి పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం మినహా ఇతర సరకులు ఇవ్వడం లేదు.

09/04/2017 - 00:16

తిరుపతి, సెప్టెంబర్ 3: ఈనెల 23నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటుచేస్తామని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ గతేడాది బ్రహ్మోత్సవాల్లో గుర్తించిన పొరపాట్లను పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

09/04/2017 - 00:16

రావులపాలెం, సెప్టెంబర్ 3: గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొని, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు కాలువలో గల్లంతయ్యారు. రావులపాలెంలోని కెఎస్‌ఆర్ కాంప్లెక్స్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక అమలాపురం రోడ్డులోని ముక్తేశ్వరం ప్రధాన పంట కాలువ రేవులో నిమజ్జనం చేశారు.

09/04/2017 - 00:15

కాకినాడ, సెప్టెంబర్ 3: కాకినాడ కార్పొరేషన్ మేయర్ ఎంపిక వ్యవహారం తెలుగుదేశం అధిష్ఠానానికి కత్తిమీద సాముగా మారింది. మేయర్ పదవిని కాపు సామాజికవర్గ మహిళకే కేటాయిస్తామని అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందుగా ప్రకటించిన విషయం విదితమే.

09/04/2017 - 00:14

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి.. 80 శాతం మందికి పైగా సంతృప్తి చెందాలి.. వచ్చే ఎన్నికల్లో జనమంతా తెలుగుదేశం పార్టీకే ఓటేసాలా చూడాలని టిడిపి చీఫ్ చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు నూరిపోస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ ప్రభుత్వం ఏదో ఒక పథకాన్ని, లేదా ప్రయోజనాన్ని అందిస్తున్నప్పుడు వారంతా మన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఎందుకు ఓటేస్తారు?

09/04/2017 - 00:06

విజయవాడ, సెప్టెంబర్ 3: రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో వెలసిన 72 అడుగుల భారీ వినాయకునికి ఆదివారం రాత్రి ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే వైభవంగా నిమజ్జనం జరిగింది. ఇందుకోసం రెండు ఫైరింజన్లను వినియోగించారు. చూడముచ్చటైన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.

09/04/2017 - 00:03

హైదరాబాద్, సెప్టెంబర్ 3: వైఎస్‌ఆర్‌సిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు పి గౌతంరెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దివంగత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాలను ఉద్దేశించి ఓ టివి చానల్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గౌతంరెడ్డిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages