S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/19/2016 - 05:06

గుంటూరు, సెప్టెంబర్ 18: దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్, నియంతృత్వ, మతోన్మాదులను ప్రభుత్వం పెంచిపోషిస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యాన గుంటూరులో హోల్‌టైమర్ నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్టస్థ్రాయి వర్క్‌షాపును ఆదివారం ఆయన ప్రారంభించారు.

09/19/2016 - 05:06

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సిబిఐ) గత పదేళ్లలో ఏడు వేల కేసులను అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తే ఇందులో 6533 కేసుల్లో కోర్టు విచారణ ముగిసింది. ఇందులో 4054 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష ఖరారైంది.

09/19/2016 - 05:05

తిరుపతి, సెప్టెంబర్ 18: వెనుకబడి కులాల జాబితాలో చేర్చాలని కోరుతున్న అన్ని వర్గాల, కులాలకు సంబంధించిన వివరాలను బహిరంగంగానే వినతుల ద్వారా స్వీకరించి విచారిస్తామని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ తెలిపారు. బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటుచేసిన విషయం పాఠకులకు విదితమే.

09/19/2016 - 05:04

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజలను టిడిపి, బిజెపిలు మోసం చేస్తున్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలో ప్యాకేజీ అనే మాట లేదని, ప్రత్యక్ష పన్నుల కింద రావాల్సిన నిధులన్నీ ప్యాకేజీ పేరిట ప్రకటించారన్నారు.

09/19/2016 - 05:03

విజయవాడ, సెప్టెంబర్ 18:రానున్న రోజుల్లో రాష్టమ్రంతటా రియల్‌టైమ్ గవర్నెన్స్ కింద డ్రోన్‌లు, నిఘా కెమెరాల పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డ్రోన్ అప్లికేషన్‌ల వినియోగంపై ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఎపి స్టేట్ ఫైబర్ నెట్‌వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

09/19/2016 - 04:53

తిరుపతి, సెప్టెంబర్ 18: కాపుల సంక్షేమం కోసం అంటూ ముద్రగడ పద్మనాభం ఏడు రోజులపాటు చేపట్టిన దీక్ష బూటకమని, దీనిపై సిబిసిఐడితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూస్తాయని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు అన్నారు. బలిజ కాపుల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడానికి సోమవారం జస్టిస్ మంజునాథ కమిషన్ తిరుపతికి రానున్న నేపథ్యంలో రామాంజనేయులు ఆదివారం తిరుపతి విచ్చేశారు.

09/19/2016 - 04:52

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: దళిత సాహిత్య వైతాళికుడు కుసుమ ధర్మన్న సాహిత్య పీఠాన్ని తెలుగు విశ్వ విద్యాలయంలో స్థాపించాలని కవులు, మేధావులు, రచయితలు ప్రతిపాదించారు. రాజమహేంద్రవరంలో ‘కుసుమాంజలి’ పేరిట కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన ఆదివారం జరిగింది.

09/19/2016 - 02:00

అనంతపురం, సెప్టెంబర్ 18: ‘బెడ్‌కు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు, నలుగురు రోగులు.. ఇంకొందరికి కటిక నేలే గతి.. తల్లితో పాటు బెడ్‌పై ఉండాల్సిన చిన్నారులు ఒంటరిగా ఇలాంటి దైన్య పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దర్శనమిస్తున్న దుస్థితి ఇది. అనంతపురం జిల్లాను డెంగ్యూ, మలేరియా వ్యాధులు వణికిస్తున్నాయి.

09/19/2016 - 01:59

నెల్లూరు, సెప్టెంబర్ 18: దేశంలోని ప్రతిఒక్కరు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం కేంద్ర మంత్రి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ప్రాంగణంలోని సెక్యురిటీ శిక్షణా కేంద్రానికి విచ్చేశారు.

09/19/2016 - 01:58

విజయవాడ, సెప్టెంబర్ 18: గత కొద్ది రోజులుగా ప్రకాశం బ్యారేజీకి పుష్కలంగా నీరు చేరుతున్నప్పటికీ, ఇటీవల మూడురోజులపాటు వరద నీటిని సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణాజిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దాదాపు లక్ష ఎకరాల్లో నేటికీ వరినాట్లు పడక పంట భూములు బీళ్లుగా మారుతున్నాయి. పట్టిసీమ పథకం ప్రారంభంతో కృష్ణా రైతాంగం ప్రస్తుత ఖరీఫ్‌పై గంపెడాశలు పెట్టుకుంది.

Pages