S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/19/2016 - 13:39

విజయవాడ: 14వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని, ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం త్వరలో చట్టబద్దత కల్పిస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి సోమవారం విజయవాడలో చెప్పారు. చట్టబద్దత విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్యాకేజీ వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైల్వేజోన్‌పై త్వరలో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు.

09/19/2016 - 13:27

విశాఖ: కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 21 నాటికి అల్పపీడనమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

09/19/2016 - 13:19

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తోంది. కాపులతో 11 కులాలను బీసీలో చేర్చడంపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. వివిధ సంఘాలకు చెందిన నాయకులు తమ అభ్యంతరాలతో పాటు, సమస్యలను బీసీ కమిషన్ దృష్టికి తీసుకువస్తున్నారు. కాపు సంఘం నేతలు పెద్ద ఎత్తున వినతులను అందజేశారు.

09/19/2016 - 13:15

ఏలూరు: 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మరణించగా, మరొక విద్యార్థి కి గాయాలయ్యాయి. పెదవేగి మండలానికి చెందిన సుమంత్ ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలకు బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో మరొక విద్యార్థి సుమన్ బైకు ఎక్కాడు. వీరు బైకుపై వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. వీరిని ఆస్పత్రికి తరలించగా సుమంత్ మరణించాడని వైద్యులు తెలిపారు.

09/19/2016 - 13:10

చిత్తూరు: రామకుప్పం మండలం నంద్యాల తండాలోకి సోమవారం ఉదయం ప్రవేశించిన ఏనుగులు క్యాబేజీ, వరి, టమాట పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. గ్రామస్థులు వేసుకున్న కంచెను పడేసి ఏనుగుల గుంపు గ్రామంలోకి చొరబడింది. ఏనుగులు ఎప్పుడు ఇళ్ల మీద పడతాయోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

09/19/2016 - 12:49

విజయవాడ: ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావని, ఆర్థిక స్థితి మెరుగైతేనే ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి సుజనాచౌదరి సోమవారం విలేకరులతో అన్నారు. ప్యాకేజీకి కేంద్రం త్వరలోనే చట్టబద్ధత కల్పించనున్నట్లు, ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ప్యాకేజీ ద్వారా ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు.

09/19/2016 - 12:39

కాకినాడ : రాజమహేంద్రవరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో నంబర్‌వన్‌ న్యూస్‌ ఛానల్‌ యజమాని సాయిసుధాకర్‌ నాయుడును సీఐడీ అధికారులు సోమవారం విచారిస్తున్నారు. తునిలో కాపుగర్జన అనంతరం చోటుచేసుకున్నరత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దహనం, పోలీస్‌స్టేషన్లలో విధ్వంసం ఘటనలపై సాయి సుధాకర్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

09/19/2016 - 12:35

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆధునిక సాంకేతిక విధానం ద్వారా పోలవరం వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పోలవరం పనులపై జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారు సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

09/19/2016 - 12:30

కడప : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తెదేపా విజయానికి దోహదపడతాయన్నారు. రాజంపేటలోని పలు ప్రాంతాలను ఆయన సోమవారం ఉదయం తనిఖీ చేశారు. రాజంపేటలో అపరిశుభ్రత తాండవిస్తుండటంపై మంత్రి తీవ్రంగా స్పందించారు.

09/19/2016 - 11:22

విజయవాడ : యువత తెలివితేటలు పెంచుకుంటే స్వయం ఉపాధి పొందవచ్చని, వారు ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గన్నవరం సమీపంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో బ్యాంకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి సోమవారం ప్రారంభించారు.

Pages