S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/07/2016 - 08:21

విజయవాడ, ఫిబ్రవరి 6: గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ నేతలు చొక్కాలు చించుకుంటూ మరింత లోతుగా విశే్లషణలు చేయటం సరికాదంటూ రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ అన్నారు. అక్కడ స్థిరపడ్డ ఆంధ్రులను ప్రశాంత వాతావరణంలో వారి మానాన వారిని బతకనిస్తే చాలంటూ హితవు చెప్పారు.

02/07/2016 - 08:21

విజయవాడ: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ప.గో జిల్లాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రతి ఏటా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ పుష్కలంగా సాగునీరందించే ప్రకాశం బ్యారేజి ప్రస్తుత రబీ సీజన్‌లో సాగుకు చుక్క నీరందించే పరిస్థితి లేకపోయినా కనీసం తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితి కన్పించడం లేదు.

02/07/2016 - 08:17

విజయవాడ, ఫిబ్రవరి 6: గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఒరగబెట్టిన బొత్స సత్యనారాయణ, వి.హనుమంతరావు, వట్టి వసంతకుమార్ వంటివారు నేడు కాపులకు రిజర్వేషన్ల విషయంపై రంకెలు వేస్తుండటం శోచనీయమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు.

02/07/2016 - 08:14

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: హుదూద్ తుపాను విశాఖ నౌకాదళాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. తుపాను ధాటికి నేవీకి చెందిన సుమారు 50 వేల చెట్లు, వృక్షాలు నేలకొరిగాయి. వీటి స్థానే లక్ష మొక్కలను నాటాలని తూర్పు నౌకాదళం అధికారి సతీష్ సోనీ నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేసి, కేవలం ఒకే ఒక్క మొక్కను ప్రముఖుల చేతుల మీదుగా నాటించాలని భావించారు.

02/07/2016 - 06:57

ప్రత్తిపాడు/ రాజమహేంద్రవరం/ కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష రెండోరోజు మరింత సెగ పుట్టించింది. ఆందోళనలు ఉధృతం కాకుండా ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికను అనుసరిస్తుంటే, డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ ప్రకటిస్తున్నారు.

02/07/2016 - 06:44

విశాఖపట్నం: తుని కాపు గర్జనలో చోటుచేసుకున్న విధ్వంసం, ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష తదితర అంశాలపై సిఎం చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. అతి సున్నితమైన అంశంలో ప్రభుత్వం అభాసుపాలయ్యే వరకూ రావడం వెనుక తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజిక వర్గం వైఫల్యమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

02/06/2016 - 18:36

హైదరాబాద్-కాపులకు బీసీలుగా రిజర్వేషన్లు కల్పిస్తామని, అయితే దానికి కొన్ని విధానాలున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చాకకూడా ముద్రగడ ఆమరదీక్ష కొనసాగించడం సరికాదని ఆయన అన్నారు.

02/06/2016 - 16:39

అనంతపురం-ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్-2016 షెడ్యూల్ ఖరారైంది. అనంతపురం జెఎన్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించే ఈసెట్ షెడ్యూల్ వివరాలను చైర్మన్ సర్కార్, ఈసెట్ కన్వీనర్ భానుమూర్తి శనివారం విలేకరులకు వివరించారు. ఈనెల 17నుండి మార్చి 28వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఏప్రిల్ 30నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, మే 9న ఏపీలోని 7 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

02/06/2016 - 15:56

శ్రీలంక-్భరత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ అయ్యారు. శుక్రవారం కొలంబో చేరుకున్న సుష్మాస్వరాజ్ శనివారం ఉదయం సిరిసేనతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఉన్న బాంధవ్యాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, భవిష్యత్ అవసరాలను వీరిద్దరూ చర్చించుకున్నారు.

02/06/2016 - 15:52

కిర్లంపూడి-కాపులను బీసీలుగా గుర్తిస్తూ జీవో విడుదల చేయాలని నిన్న ఆరమణదీక్ష ప్రారంభించిన మాజీమంత్రి ముద్రగడ వైద్యపరీక్షలకు నిరాకరించారు. ఇవాళ ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న వైద్యులతో ఆయన మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగుందని, వైద్య పరీక్షలు అవసరం లేదని చెప్పారు. దీంతో పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యబృందం వెనుదిరిగింది.

Pages