S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/10/2018 - 00:09

అనంతపురం, జూలై 9: రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ, ప్రాంతీయ పార్టీలు వివిధ రూపాల్లో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, జాతీయ, స్థానిక పార్టీలు చేపడుతున్న వివిధ కార్యక్రమాల ప్రభావంతో అనంతపురం జిల్లా రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఫలితంగా రానున్న మూడు, నాలుగు నెలల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతోంది.

07/09/2018 - 04:16

తిరుపతి, జూలై 8: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు ఈనెల 10, 24వ తేదీలలో, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు 11, 25వ తేదీలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.

07/09/2018 - 04:05

అనంతపురం, జూలై 8 : రాష్ట్రంలో వైఎస్ పాలనలో రాజన్న రాజ్యం అంటూ దోపిడీ చేశారు.. ఇప్పుడు తిరిగి రాజన్న రాజ్యం తెస్తారంట.. మళ్లీ దోపిడీకి తెర లేపుతారంట.. అంటూ రాష్ట్ర జల వనరుల శాఖ, అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంత్రి దేవినేని ఉమా ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ, జనసేన, బీజేపీపై ధ్వజమెత్తారు.

07/09/2018 - 04:04

విజయవాడ, జూలై 8: రాష్ట్ర విభజన అనంతరం 800 కి.మీల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను ఓ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి పట్ల పారిశ్రామికవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనేక సందర్భాల్లో పలువురు పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములయ్యేలా ప్రతిపాదనలు అందజేస్తున్నారు.

07/09/2018 - 04:04

విజయవాడ, జూలై 8: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతున్నలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు క్రమేణ నెరవేర్చుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ పేర్కొన్నారు.

07/09/2018 - 04:04

రాయవరం, జూలై 8: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 208వ రోజైన ఆదివారం 2500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం పసలపూడిలో బసచేసిన ప్రాంతంలో ఆదివారం ఉదయం ముందుగా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకల్లో జగన్ పాల్గొన్నారు.

07/09/2018 - 04:02

శ్రీకాకుళం, జూలై 8: రాష్ట్ర గవర్నర్ ఈవీఎల్ నరసింహన్ ఈ నెల తొమ్మిదోతేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గం మీదుగా చాన్సలర్ హోదాలో తొలిసారిగా అంబేద్కర్ వర్శిటీని సందర్శించనున్నారు. ఇక్కడ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులతో వేర్వేరుగా గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు.

07/09/2018 - 04:02

కడప : తమ పెత్తనం చలాయించేందుకు అనువైన స్థలంలోనే ‘ఉక్కు’ పరిశ్రమను ఏర్పాటు చేయించాలనే స్వార్థం, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులలో ప్రధానమై పోయింది. భూమి గుర్తింపు విషయంలో ఇక్కడి నేతలు పడుతున్న ఆరాటం, గుంజాటన చూస్తుంటే ప్రజాప్రయోజనం గాలికి వదిలి, తమ ప్రయోజనమే తమకు ముఖ్యమనే ధోరణిలో అధికారపార్టీ నేతలున్నారు.

07/09/2018 - 03:52

విజయవాడ, జూలై 8: రైతు రుణమాఫీ అనేది తాత్కాలిక ఉపశమనమే తప్ప వారి సమస్యకు శాశ్వత పరిష్కారం కాబోదని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. సకాలంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు అందిస్తూ గోదాములు, రహదారులు, మార్కెటింగ్ సదుపాయం వంటి వౌలిక సదుపాయాలపై దృష్టి సారించకుండా రుణమాఫీ అంటూపోతే ఇక బ్యాంకులే కాదు చివరకు డిపాజిట్లు కూడా మాఫీ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయని సున్నితంగా హెచ్చరించారు.

07/09/2018 - 03:48

విశాఖపట్నం, జూలై 8:ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేకే లోకేష్‌ను ఎమ్మెల్సీ చేశారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ ఎస్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీలో చేరారు.

Pages