S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/02/2018 - 01:19

కడప, మార్చి 1: కడప నుంచి విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. ఈ విమానం విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి కడపకు చేరుకుంటుంది. తిరిగి కడప నుంచి తిరిగి 9.30 గంటలకు విజయవాడకు బయలుదేరుతుంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి కడప విమానాశ్రయం నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత హైదరాబాద్‌కు కడప నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నారు. తరువాత చెన్నైకి నడిపారు.

03/01/2018 - 00:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఎనిమిది వౌలిక సౌకర్యాల రంగాలు ఈ సంవత్సరం జనవరి నెలలో అధిక వేగవంతంగా 6.7 శాతంతో వృద్ధి చెందాయి. నిరుడు జనవరిలో ఈ రంగాలు కేవలం 3.4 శాతంతోనే వృద్ధి చెందాయి. పెట్రోలియం శుద్ధి, సిమెంట్ ఉత్పత్తి విజృంభించడంతో పాటు విద్యుత్తు, బొగ్గు ఉత్పత్తి కూడా మెరుగుపడటం వల్ల ఈ రంగాలు జనవరిలో అధిక వేగంతో వృద్ధి సాధించాయి.

03/01/2018 - 00:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 7.2 శాతం వృద్ధి రేటు సాధించింది. అంటే అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గత అయిదు త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరింది. వ్యవసాయం, మాన్యుఫాక్చరింగ్, నిర్మాణ రంగాలతో పాటు కొన్ని సేవా రంగాలు మంచి పనితీరును కనబరచడంతో మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంది.

03/01/2018 - 00:52

ముంబయి, ఫిబ్రవరి 28: అమెరికా వడ్డీ రేట్ల పెరుగుదల భయానికి తోడు, దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటం బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ రెండు అంశాల కారణంగా మదుపరులు అమ్మకాలకు ఎగబడటంతో కీలక మార్కెట్ సూచీలు పతనమయ్యాయి.

03/01/2018 - 00:50

హైదరాబాద్, ఫిబ్రవరి 28: హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్టాకరమైన సిఐఐ మానవ వనరుల సాఫల్యత అవార్డు లభించింది. సిఐఐ సిగ్నిఫికెంట్ అచీవ్‌మెంట్ అవార్డు ఆన్ హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ పేరిట ఈ వార్డును సిఐఐ తరఫున టాటా స్టీల్ లిమిటెడ్ సిఇవో ఎండి టివి నరేంద్రన్ నుంచి అపోలో హెచ్‌ఆర్ డిజిఎం సిహెచ్ సురేష్ రెడ్డి స్వీకరించారు.

03/01/2018 - 00:47

అమరావతి, ఫిబ్రవరి 28: ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి కౌశల్ యోజన (పీఎంకేవీవై), ప్రధాన మంత్రి ముద్ర (మైక్రో డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన పథకాలను సమీక్షించారు.

02/28/2018 - 15:38

ముంబై: స్టాక్‌మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230.78 పాయింట్ల నష్టంతో 34115.61 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 77.30 పాయింట్ల నష్టంతో 10477 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ మరింత క్షీణించింది. మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది.

02/28/2018 - 02:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మోసగించడంతో తాను నష్టపోయిన సొమ్ము సుమారు రెండు బిలియన్ డాలర్లు ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మంగళవారం ప్రకటించింది. అక్రమ లావాదేవీల వల్ల తాను నష్టపోయిన మొత్తం గతంలో అంచనా వేసిన దానికన్నా 204 మిలియన్ డాలర్లు పెరిగిందని పీఎన్‌బీ స్టాక్ ఎక్స్చేంజ్‌కి సమర్పించిన పత్రంలో వెల్లడించింది. మోసపోయిన సొమ్ము రూ.

02/28/2018 - 02:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: విధాన మార్పులతో పాటు సానుకూల ప్రపంచ పరిస్థితుల మద్దతు వల్ల 7-8 శాతానికి మించి వృద్ధి రేటు సాధించే శక్తి భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన ఇండియా-కొరియా బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ రానున్న 10-20 ఏళ్ల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

02/28/2018 - 02:22

విజయవాడ, ఫిబ్రవరి 27: గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు సుబాబుల్, జామాయిల్ కొనుగోలు ధరలు ఖరారు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. రైతుల నుండి పేపరుమిల్లుల యాజమాన్యాలు సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో మంగళవారం సమావేశమైంది.

Pages