S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/23/2017 - 01:12

విశాఖపట్నం, ఏప్రిల్ 22: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూతనంగా నిర్మించిన 120 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇంధన ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం ఆయన ప్లాంట్‌ను సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. వాటిపై ఉన్నతాధికారులతో చర్చించారు.

04/23/2017 - 01:10

విశాఖపట్నం, ఏప్రిల్ 22: స్టార్టప్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతోందని, రానున్న రోజుల్లో విశాఖలో పెద్ద ఎత్తున ఫిన్‌టెక్ వాలీలో అంకుర సంస్థల ఏర్పాటుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరి వెల్లడించారు. గీతం యూనివర్శిటీలో శనివారం జరిగిన క్రిప్టో కరెన్సీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.

04/23/2017 - 01:06

భీమవరం, ఏప్రిల్ 22: భానుడి భగభగలతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చేపలు, రొయ్యల చెరువులు సాగుచేసే రైతాంగం బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే రొయ్య రైతులను వివిధ రకాల వైరస్ పీడ వెంటాడుతుండగా, తాజాగా అధిక ఉష్ణోగ్రత శాపంలా మారింది. చేపల చెరువులు సాగుచేసేవారి పరిస్థితి కూడా ఇదేవిధంగా కనిపిస్తోంది.

04/23/2017 - 01:03

శనివారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ 30 వేల రూపాయలకు చేరింది. 99.9 స్వచ్ఛత కలిగన 10 గ్రాముల పసిడి వెల 200 రూపాయలు పెరిగి 30,000 రూపాయలను తాకింది. మరోవైపు కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గి 41,700 రూపాయల వద్ద స్థిరపడింది.

04/23/2017 - 01:01

లండన్, ఏప్రిల్ 22: కాలుష్య కాసారంగా మారిన విద్యుదుత్పాదక రంగాన్ని పర్యావరణ సహితంగా మార్చే దిశగా బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 135 ఏళ్ల తర్వాత తొలిసారిగా థర్మల్ విద్యుదుత్పత్తిని పూర్తిగా ఒకరోజు నిలిపివేసింది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి లేకుండానే తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోగలిగింది.

04/22/2017 - 01:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఎమ్‌టి లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా ఎస్ గిరీశ్ కుమార్‌ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఐదేళ్లకుగాను ఈ నియామకం జరగగా, శుక్రవారం ఈయన బాధ్యతలు చేపట్టారు.

04/22/2017 - 01:44

శుక్రవారం చెన్నైలో జరిగిన ఆటోఎక్స్‌పోలో దేశీయ ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయన అశోక్ లేలాండ్ వివిధ రకాల శ్రేణుల్లో బస్సులను ప్రదర్శించింది. మార్కెట్‌లో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిచ్చే దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త బస్సులు, ట్రక్కులను ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ పేర్కొంది

04/22/2017 - 01:43

మైనింగ్ ఎక్విప్‌మెంట్ తయారీదారైన కోబెల్కో.. శుక్రవారం ఓ కొత్త తరం ఎక్స్‌కవేటర్‌ను హైదరాబాద్‌లో మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ ఎక్స్‌కవేటర్ ఎస్‌కె220 ఎక్స్‌డి/ ఎస్‌కె220ఎక్స్‌డిఎల్‌సి అనే రెండు మోడల్స్‌ల్లో లభి స్తుంది. 20 శాతం ఇంధన పొదుపుతోపాటు ఎక్కువ సామర్ధ్యంతో పనిచేస్తాయని సంస్థ తెలిపింది

04/22/2017 - 01:38

చెన్నై, ఏప్రిల్ 21: బిఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై సుప్రీం కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో 10 వేలకుపైగా వాహనాలు తమవద్దే ఉండిపోయాయని అశోక్ లేలాండ్ శుక్రవారం వాపోయింది. వాతావరణంలో ప్రమాదకర స్థాయికి చేరిన కర్బన ఉద్గారాల నియంత్రణలో భాగంగా కాలుష్యకారక బిఎస్-3 వాహనాల అమ్మకాలు, వాటి రిజిస్ట్రేషన్లను గత నెలాఖర్లో అత్యున్నత న్యాయస్థానం నిషేధించినది తెలిసిందే.

04/22/2017 - 01:36

విశాఖపట్నం, ఏప్రిల్ 21: విదేశీ పెట్టుబడులకు నవ్యాంధ్రలో పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుడు రష్యాలో పర్యటించిన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చేసిన విజ్ఞప్తికి రష్యా సానుకూలంగా స్పందించింది. దీంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం విశాఖ చేరుకున్న బృందానికి మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

Pages