S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/28/2017 - 00:45

విశాఖపట్నం, ఏప్రిల్ 27: అరకు కాఫీ రుచులు విశ్వవిద్యాలయాల విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జిసిసి బ్రాండ్‌తో కూడిన అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లను యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీ, మిలీనియం సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా ఎయులోనూ, మరికొన్ని విద్యాసంస్థలకు అందుబాటులో ఉండేలా విశాఖ ఉషోదయ జంక్షన్ వద్ద అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటయ్యాయి.

04/28/2017 - 00:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆటో దిగ్గజం మారుతి సుజుకి గత ఆర్థిక సంవత్సరం నికర లాభాలు ఏకంగా 36.6 శాతం పెరిగి రూ. 7,511 కోట్లకు చేరుకున్నాయి. కాగా, నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు 15.8 శాతం పెరిగాయి. మారుతి సుజుకి గురువారం తన చివరి త్రైమాసికం ఫలితాలతో పాటుగా వార్షిక ఫలితాలను ప్రకటించింది. 2015-16లో కంపెనీ నికర లాభం రూ.5,497.2 కోట్లుగా ఉంది. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ అమ్మకాలు రూ.

04/28/2017 - 00:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఉద్యోగ భవిష్య నిధి(ఇపిఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఇపిఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునే చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. దాన్ని కార్యాలయంలో అందచేసి విత్‌డ్రా చేసుకోవచ్చని ఇపిఎఫ్‌ఓ వెల్లడించింది.

04/28/2017 - 00:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటియం తమ ఖాతాదారుల కోసం ‘డిజిటల్ గోల్డ్’ పేరుతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారం క్రయ విక్రయాలు జరిపేలా ఖాతాదారులకు వీలు కల్పించే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఎంఎంటిసి-పిఎఎంపితో పేటియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

04/28/2017 - 00:39

గచ్చిబౌలి, ఏప్రిల్ 27: ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని, దేశంలో వినియోగించే 20 శాతం మందులు ఇక్కడ నుండే ఉత్పత్తి అవుతున్నాయని ఐటి శాఖ మంత్రి కె.తారక రామరావు తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురు వారం ఆయన ఇండియన్ ఫార్మా ఎక్స్‌పో-2017ను ప్రారంభించారు. ఈ సంర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఫార్మా మార్కెట్‌లో ప్రపంచ వ్యాప్తం గా భారత్ 3వ స్థానంలో ఉందని చెప్పారు.

04/27/2017 - 05:35

తాత్కాలిక మెరుపులు చూసి ఏ సంస్థలోపడితే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా, నమ్మదగినవి అనిపించిన సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలి.
- బిఎస్‌ఇ సిఇఒ ఆశిష్ చౌహాన్

04/27/2017 - 05:33

అనంతపురం, ఏప్రిల్ 26: సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించుకుంటూ విద్యుదుత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పవన్ విద్యుత్ (విండ్ పవర్), సౌర విద్యుత్ (సోలార్ పవర్) ఉత్పత్తికి పెద్దపీట వేశారు. ఈ క్రమంలో జిల్లాలో భారీ సంఖ్యలో విండ్ పవర్ ప్రాజెక్టులు (గాలి మరలు), సోలార్ పవర్ ప్రాజెక్టులు (ప్యానెల్స్) ఏర్పాటు చేస్తున్నారు.

04/27/2017 - 05:31

ముంబయి, ఏప్రిల్ 26: మార్కెట్ నియంత్రిత వ్యవస్థ సెబీ.. బుధవారం బ్రోకర్లకు, క్లియరింగ్ సభ్యులకు కలిపి ఒకే లైసెన్సును ఇవ్వాలని నిర్ణయించింది. సెబీ బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లతోపాటు కమాడిటీ డెరివేటివ్‌లలో నిర్వహణకు ఈ లైసెన్సు అనుమతిస్తుంది.

04/27/2017 - 05:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధంగా పనిచేస్తున్న ఎస్‌బిఐ కార్డ్.. బుధవారం ఇంధన సర్‌చార్జీని 2.5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో ఎస్‌బిఐ కార్డ్‌కున్న 40 లక్షలకుపైగా కస్టమర్లు లబ్ధి పొందనున్నారు.

04/27/2017 - 05:25

యాక్సిస్ బ్యాంక్

Pages