S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/29/2017 - 00:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో భారత జిడిపి వృద్ధిరేటు తిరిగి 8 శాతాన్ని అందుకుంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వచ్చే దశాబ్దకాలంలో పేదరికం వేగంగా తగ్గుముఖం పడుతుందని చెప్పింది. ఇక ప్రత్యేక కోర్టులు బలోపేతం కావాలని, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం జరగాలంది. నల్లధనం, అవినీతి నిర్మూలనలో భాగంగా సమర్థవంతమైన పన్నుల విధానాన్ని అమలు పరుస్తున్నామంది.

04/29/2017 - 00:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అగ్రో-కెమికల్ దిగ్గజం యుపిఎల్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 741.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 191.94 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి మూడింతలకుపైగా పెరిగినట్లైంది.

04/29/2017 - 00:34

కర్నూలు, ఏప్రిల్ 28: రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నవ్యాంధ్ర ఇంధన వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కర్నూలులో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంతో మాట్లాడుతూ ప్రస్తుతం కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల పరిసర ప్రాంతాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు.

04/29/2017 - 00:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటు నిర్ణయంలో ఎలాంటి ఆశ్చర్యాలకు తావుండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త పన్నుల విధానంలో అందే ప్రయోజనాలను వినియోగదారులకు అందివ్వాలని, లాభాలుగా మార్చుకోరాదని దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలను కోరారు. శుక్రవారం ఇక్కడ సిఐఐ వార్షిక సదస్సులో అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.

04/29/2017 - 00:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: హెరిటేజ్ ఫుడ్స్ ఉత్తర భారతంలోకి అడుగిడింది. 2022 నాటికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ముందుకెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్.. ఈ క్రమంలోనే ఉత్తరాది మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నడిపిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన మార్కెట్‌ను కలిగి ఉన్నది తెలిసిందే.

04/29/2017 - 00:31

హైదరాబాద్, ఏప్రిల్ 28: కొత్తగా రెండు ప్లాస్టిక్ తయారీ పార్కులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్ ప్రాంతంలో 170 ఎకరాలలో ప్రత్యేక ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

04/28/2017 - 00:51

ముంబయి, ఏప్రిల్ 27: అంతార్జతీయ సానుకూల సంకేతాల కారణంగా గత మూడు రోజులుగా జోరు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం కళ్లెం పడింది.

04/28/2017 - 00:50

కర్నూలు, ఏప్రిల్ 27: ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్కు పనులు కర్నూలు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పనులు జరుగుతున్న తీరుపై రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు.

04/28/2017 - 00:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్ పెరోల్‌ను సుప్రీం కోర్టు జూన్ 19వ తేదీ వరకు పొడిగించింది. అయితే జూన్ 15వ తేదీలోగా డిపాజిటర్లకు 1,500 కోట్ల రూపాయలు చెల్లించకపోతే మరోసారి జైలుకు పంపుతామని సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వు మేరకు సుబ్రతా రాయ్ గురువారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు.

04/28/2017 - 00:46

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఖాయిలా పడిన పరిశ్రమలకు శుభవార్త. రాష్ట్రంలో అనేక కారణాల వల్ల ఖాయిలాపడిన పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ జీవో 26ను జారీ చేసింది. ఈ క్లినిక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్ధగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్ధ ద్వారా హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.

Pages