S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/25/2017 - 00:46

నిజామాబాద్, ఏప్రిల్ 24: పరిస్థితులు అనుకూలించి రబీ సీజన్‌లో నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిన ధాన్యం.. ప్రస్తుతం సరిహద్దులు దాటుతూ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ఈ పరిణామం స్థానిక రైస్‌మిల్లర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో ఉత్పత్తి అయిన పంటకు అనుగుణంగా ప్రభుత్వం విధించే లెవీ లక్ష్యానికి ఎక్కడ విఘాతం ఏర్పడుతుందోనని మదనపడుతున్నారు.

04/24/2017 - 07:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమాసి క ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికా నికి (జనవరి-మార్చి)గాను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమి టెడ్, దేశీయ ఐటి రంగంలో మూడో అతి పెద్ద సంస్థ అయన విప్రో తమ ఆర్థిక ఫలితా లను ఈ వారమే వెల్లడిస్తున్నాయ.

04/24/2017 - 07:33

ఎసిసి లిమిటెడ్

04/24/2017 - 07:33

ౄ మేకిన్ ఇండియా తరహాలో ఉత్పాదక రంగానికి పెద్దపీట
ౄ స్టేట్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ ఏర్పాటు
ౄ వరంగల్, మెదక్, నిజామాబాద్‌లకు విజన్ డాక్యుమెంట్
ౄ రోబోటిక్ ఆటోమేషన్ టెక్నాలజీతో డెవలెప్‌మెంట్ సెంటర్
ౄ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరింత ప్రోత్సాహం
ౄ పారిశ్రామికాభివృద్ధి కోసం తెలంగాణ సిఐఐ నివేదిక

04/24/2017 - 07:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు..

04/24/2017 - 07:32

వాషింగ్టన్, ఏప్రిల్ 23: హెచ్-1బి వీసా విధానం కఠినతరం అంశాన్ని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్నుచిన్ వద్ద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లేవనెత్తారు. భారతీయ ఐటి రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్న ఈ నిర్ణయంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జైట్లీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నది తెలిసిందే.

04/24/2017 - 07:31

భీమవరం, ఏప్రిల్ 23: ఖాతాదారులకు ఎన్నో విశిష్ఠమైన సేవలు అందిస్తున్నామని చెప్పుకుంటున్న బ్యాంకులు.. ఏప్రిల్ 1 నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో తపాలా శాఖ వైపు ప్రజలు చూస్తున్నారు. తపాలా శాఖ కూడా బ్యాంకుల తరహాలో ఎటిఎం కార్డులు అందిస్తుండటంతో ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోని వారంతా కూడా తాజా బ్యాంకుల వాతలతో మెల్లగా తపాలా ఖాతాల వైపు మళ్లుతున్నారు.

04/23/2017 - 01:16

హైదరాబాద్, ఏప్రిల్ 22: బొగ్గు గనుల్లో (కోల్ మైన్) పనిచేసే కార్మికులకు ఆధార్ సంఖ్యే పిఎఫ్ నెంబర్‌గా పరిగణించనున్నట్లు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సిఎమ్‌పిఎఫ్) కమిషనర్ బికె పాండా తెలిపారు. కోల్‌మైన్ పిఎఫ్ పెన్షనర్లు నూతన జీవన్ ప్రమాణ్ కార్యక్రమంలో భాగంగా వారి బొటన వేలి గుర్తుతో కూడిన లైఫ్ సర్ట్ఫికెట్‌ను దాఖలు చేయవచ్చని అన్నారు.

04/23/2017 - 01:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఔషధ రంగ సంస్థ దివిస్ లాబొరేటరీస్.. విశాఖపట్నంలోని తమ ఉత్పాదక కేంద్రానికి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరిక లేఖను జారీ చేసినట్లు శనివారం తెలిపింది. విశాఖలోని యూనిట్-2కు అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా (యుఎస్‌ఎఫ్‌డిఎ) విభాగం ఈ వార్నింగ్ లెటర్‌ను పంపించినట్లు దివిస్ లాబొరేటరీస్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు చెప్పింది.

04/23/2017 - 01:13

వాషింగ్టన్, ఏప్రిల్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.5 శాతానికి పెరుగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.1 శాతంగా నమోదైన నేపథ్యంలో అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, ఆర్థిక క్రమశిక్షణ, లోటు వంటివి జిడిపిని 7.5 శాతానికి పెంచడానికి దోహదపడగలవన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

Pages