S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/31/2017 - 00:08

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పువ్వు పంటకు మార్కెట్ ఫీజు మినహాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం జీఓ జారీ చేశారు. పొద్దుతిరుగుడు పువ్వుకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభిస్తుందని, దీనిపై మార్కెట్ ఫీజు ఉండదని ఈ జీఓలో స్పష్టం చేశారు.

03/31/2017 - 00:07

గాజువాక, మార్చి 30: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) మూడవ యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం సింహాద్రిలో 1,2,4 యూనిట్లు కలిపి 1500 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి.

03/31/2017 - 00:07

చిత్రం..న్యూఢిల్లీలో గురువారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొంటున్న
ప్రముఖ పారిశ్రామికవేత్త బివిఆర్.మోహన్‌రెడ్డి

03/31/2017 - 00:04

న్యూఢిల్లీ, మార్చి 30: భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించి దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థగా అవతరించబోతున్న వొడాఫోన్, ఐడియా సెల్యులార్ విలీన సంస్థ పట్ల ప్రత్యేకంగా వ్యవహరించేది ఏమీ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఆదాయం, చందాదారులు, స్పెక్ట్రమ్ పరిమితులకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న నియమ నిబంధనలకు ఈ సంస్థ కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

03/31/2017 - 00:03

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-్ఫబ్రవరి మధ్య కాలంలో 3,100కు పైగా కొత్త విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు(ఎఫ్‌పిఐ)లు మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబి వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. విదేశీ పెట్టుబడులకు మన దేశం ఇప్పటికీ ఆకర్షణీయమైనదిగా ఉందనడానికి ఇదే సంకేతమని నిపుణులు అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం(2015-16)మొత్తంమీద 2,900 ఎఫ్‌పిఐలకు మాత్రమే సెబినుంచి ఆమోదం లభించింది.

03/31/2017 - 00:03

హైదరాబాద్, మార్చి 30: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు వేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు సూచించారు. ‘వ్యవసాయ మార్కెట్ సమస్యలు-పరిష్కారాల అవగాహన’పై వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) తెలంగాణ శాఖ గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

03/30/2017 - 06:29

వచ్చే నెల 1 నుంచి బిఎస్-4 నిబంధనలు పాటించని వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిషేధం
దేశవ్యాప్తంగా ఇంకా అమ్ముడుకాని బిఎస్-3 ప్రమాణాల వాహనాలు 8 లక్షల పైమాటే
అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో తీవ్ర ఆందోళనలో వాహన తయారీదారులు
రూ. 15-20 వేల కోట్ల నష్టమంటున్న ఆటో పరిశ్రమ నిపుణులు

03/30/2017 - 06:25

న్యూఢిల్లీ, మార్చి 29: వివిధ సంక్షేమ పథకాల్లో నగదు బదిలీ (డిబిటి) అమలుతో ప్రభుత్వానికి 34,000 కోట్ల రూపాయల ఆదా జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఆధార్ నమోదుతో అవినీతికి అడ్డుకట్ట పడిందని, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు పారదర్శకంగా మారిందని ఇక్కడ జరిగిన అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక కార్యదర్శి అశోక్ లావస చెప్పారు.

03/30/2017 - 06:24

ముంబయి, మార్చి 29: బ్యాంకులు వరుసగా ఈ వారం రోజులు పని చేయాలన్న ఆదేశంపట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొంత మెత్తబడింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 (శనివారం)న పనిచేయక్కర్లేదని బుధవారం చెప్పింది. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే మొదలవుతుంది కాబట్టి ఆ రోజును వార్షిక వ్యాపార లావాదేవీల ముగింపు దినంగా బ్యాంకులు పాటిస్తాయి. రోజువారి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించవు.

03/30/2017 - 06:23

ముంబయి, మార్చి 29: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. తమ ఖాతాదారులకు గొప్ప ఆఫర్ ఇచ్చింది. ఖాతాలో ఎప్పుడూ 20 వేల నుంచి 25 వేల రూపాయలకు తగ్గకుండా నగదు నిల్వ ఉంచే ఖాతాదారులకు ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తామని ప్రకటించింది. అదికూడా వారి గత రుణ చరిత్ర చూడకుండానే అని బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు.

Pages