S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/02/2017 - 00:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వచ్చే ఏడాది దేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదు కాగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) ద్వితీయ వార్షిక సమావేశంలో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ వౌలిక రంగ ప్రాజెక్టుల కోసం 2 బిలియన్ డాలర్ల నిధుల సాయాన్ని ఎన్‌డిబి నుంచి కోరారు.

04/02/2017 - 00:39

గాజువాక, ఏప్రిల్ 1: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి శనివారం అంతరాయం వాటిల్లింది. విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద నిర్మించిన సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ)లో ఒకేసారి రెండు యూనిటల్లో సాంకేతి లోపం సమస్య తలెత్తింది. దీంతో 1,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయంది.

04/02/2017 - 00:39

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలెపర్స్ అసోసియేషన్ (ట్రెడా) నూతన అధ్యక్షుడిగా పి రవీందర్ రావు ఎన్నికయ్యారు. శనివారం నాడిక్కడ ఒక హోటల్‌లో జరిగిన అసోసియేషన్ 21వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రెండేళ్లపాటు కొనసాగే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ట్రెడా వెల్లడించింది.

04/02/2017 - 00:38

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జా యింట్ వెంచర్ ప్రాజెక్టుల విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు శనివారం ఏర్పాటైన మం త్రివర్గ ఉపసంఘం చర్చించింది. డెవలపర్స్ నుండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడం, ప్లాట్లు, విల్లాలు కొన్న కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

04/01/2017 - 00:57

న్యూఢిల్లీ, మార్చి 31: బిఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై ఏప్రిల్ 1 నుంచి సుప్రీం కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా గడచిన రెండు రోజుల్లో పెద్ద ఎత్తున వాహన విక్రయాలు జరిగాయి. నిషేధిత వాహనాల్లో ద్విచక్ర వాహనాల సంఖ్యే అధికంగా ఉండటంతో నష్టాలను తగ్గించుకోవడం కోసం ఆయా టూవీలర్ తయారీదారులు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఫలితంగా దిగివచ్చిన ధరలకు కస్టమర్లు విశేషంగా స్పందించారు.

04/01/2017 - 00:55

న్యూఢిల్లీ, మార్చి 31: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలనాత్మక 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. తమ ప్రైమ్ ఆఫర్‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. నిజానికి ఉచిత 4జి సేవలతో కూడిన ఈ ప్రైమ్ ఆఫర్ గడువు శుక్రవారం (మార్చి 31)తోనే ముగియాల్సి ఉంది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఈ ఆఫర్ నమోదుకు వినియోగదారుల నుంచి స్పందన రావడంతో 15 రోజులు పొడిగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

04/01/2017 - 00:54

హైదరాబాద్/విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), మార్చి 31: పాల ధరలు పెరిగాయ. శనివారం నుంచి విజయ, విశాఖ డెయిరీ పాల ఉత్పత్తులు మరింత ప్రియమయ్యాయ. విజయ బ్రాండ్ పాల ధరను లీటరుకు రూపాయి పెంచగా, పాల సేకరణ ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నిర్ణయించింది.

04/01/2017 - 00:53

హైదరాబాద్/కొత్తగూడెం, మార్చి 31: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలను కల్పించనందుకు నిరసనగా ఏప్రిల్ 15 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సమ్మె నోటీసును సింగరేణి యాజమాన్యానికి అందించినట్లు తెలిపారు.

04/01/2017 - 00:52

కాకినాడ, మార్చి 31: తూర్పు గోదావరి జిల్లాలో మద్యం టెండర్ల ద్వారా ఎక్సైజ్ శాఖకు 39 కోట్ల 66 లక్షల రూపాయల ఆదాయం లభించింది. 2017-19 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 545 మద్యం దుకాణాలకు 6,549 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతిలో వ్యాపారులకు దుకాణాలు కేటాయించారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరం జి కనె్వన్షన్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు.

04/01/2017 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 31: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కౌన్సిల్.. శుక్రవారం ఐదు నిబంధనలను ఆమోదించింది. రేట్లపై మే నెలలో చర్చించనుంది. జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గట్టిగా ప్రయత్నిస్తున్నది తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభ, లోక్‌సభల్లోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, మెజారిటీ రాష్ట్రాల మద్దతు కూడా లభించింది.

Pages