S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/16/2017 - 00:26

‘ఓ తప్పుడు విధానాన్ని పదే పదే ప్రచారం చేస్తూ పోతే ఒప్పుగా మారుతుందనే’ది గోబెల్స్ తత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రచారానే్న సాగిస్తున్నాయి. విద్యా విధానంలో ఈ వింత ధోరణి మరీ ఎక్కువైంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సిఎం చంద్రబాబు అనుసరించిన విధానాలే విద్యా రంగానికి ఉరితాడుగా బిగుస్తున్నాయి.

01/14/2017 - 00:32

‘మహాభారతం’ విరాట పర్వంలోని ఉత్తర కుమారుడికి, నేటి రాజకీయ భారతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తేడా కనిపించడం లేదు. ప్రగల్భాలు పలకడంలో యువనేత రాహుల్ ఉత్తర కుమారుడిని మించిన వాడని ఇప్పటికే జాతిజనులు తెలుసుకున్నారు. ఉత్తర గోగ్రహణం సమయంలో కౌరవ సేనలు విరాటుని రాజ్యంపై దండెత్తినపుడు- వారిని నిరోధిస్తానంటూ బృహన్నల ముందు ఉత్తర కుమారుడు పలికిన బీరాలు అన్నీ ఇన్నీ కావు.

01/13/2017 - 02:13

‘క్రయిమ్ అండ్ పనిష్‌మెంట్’, ‘బ్రదర్స్ కర్మజోవ్’, ‘ఇడియట్’ వంటి గొప్ప నవలల్ని చదివినవారు ‘దోస్తోయేవ్ స్కీ’ని ఏనాటికీ మరచిపోలేరు. ఆ మహారచయిత ఓ సందర్భంలో అంటాడు- ‘ఒక సమాజంలో నాగరికత ఎంత ఉందనేది అక్కడి చెరసాలలోకి అడుగుపెడితే తెలుస్తుంది’అని. నిజానికి రచయిత దోస్తోయేవ్ స్కీ కూడా రష్యాలోని ఆనాటి జార్ ప్రభువుల ఆగ్రహానికి గురై జైలు జీవితాన్ని రుచిచూసిన వాడే.

01/12/2017 - 07:04

‘పదుగురాడు మాట పాటియై ధర చెల్లు’- అన్నది మహాకవి మాట! ‘పదుగురు’ అని అంటే ఎక్కువ మంది. ఆంగ్లభాషలో దీనే్న ‘మెజారిటీ’ అంటున్నారు. ఎక్కువ మంది మంచిగా ఆలోచిస్తారన్నది, మంచిగా ప్రవర్తిస్తారన్నది మహాకవి విశ్వాసం. అందుకే ‘జనవాక్యంతు కర్తవ్యం’- ప్రజాభిప్రాయాన్ని పాటించి పనిచేయడం పాలకుల బాధ్యత అన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి వేలాది ఏళ్లుగా మన దేశంలో విస్తరించి ఉంది!

01/11/2017 - 07:07

మోదీ కూడా మనది సహకార సమాఖ్య వ్యవస్థ అని తాను అధికారానికి వచ్చినప్పటి నుంచీ అంటున్నారు. దీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఈ మాటలోని విలువేమిటో అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే. అందువల్ల నల్లధనం-అవినీతికి సంబంధించిన తదనంతర చర్యల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు ఒక ప్రజాస్వామిక ప్రక్రియ మాత్రమేగాక, ఆ చర్యల అమలుకు ఆచరణాత్మక అవసరం అవుతున్నది. ఆచరణాత్మక ఏమిటి? దాని అవసరం ఏ విధంగా?

01/10/2017 - 01:35

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గ్రామాలు స్వ యం సమృద్ధంగా ఉండేవి. ప్రతి ఇంటి ముందు చింత చెట్టు, పెరట్లో కూరగాయలు, పొలంలో వడ్లు, కందులు పం డేవి. ఎవరి ఇంట్లో చూసినా పాడిపశువులు ఉండేవి. కులవృత్తులు బలంగా ఉండటంతో కుండలు, బుట్టలు, తట్టలు, బట్టలు, కట్టెలు అన్నీ ‘వస్తుమార్పిడి పద్ధతి’ (బార్టర్ సిస్టం)లో దొరుకుతూ ఉండేవి. ఉప్పు మాత్రమే జనం కొనుక్కోవలసి వచ్చేది. మామిడి, అరటి, పనస, కొబ్బరి..

01/09/2017 - 00:48

బుద్ధుడు, అశోకుడు, గాంధీ, భగత్‌సింగ్, అల్లూరి, కొమురం భీమ్, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, పూలే, పెరియార్.. రాముడు, కృష్ణుడు, జీసస్, ప్రొఫెట్.. వీరంతా ఎల్లప్పుడూ రాజకీయ నాయకులకు కవచ కుండలాలే! ఇలా రాసుకుంటూపోతే ఈ జాబితాకు అంతం లేదు. అవసరానికో, రాజకీయానికో, ఓట్లను రాబట్టుకోవడానికో వీరి పేర్లను వాడుకోని దినం లేదు. ఒకప్పుడు వీరంతా జాతీయ నాయకులు, దేశీయవాదులే. ఇప్పుడంతా తారుమారే!

01/08/2017 - 07:51

మంత్రి నారాయణ వంటి ‘కార్పొరేట్’ పొలిటీషియన్లు, జనం ఆలోచనలతో పనిలేకుండా నిర్ణయాలు తీ సుకునే ఐఎఎస్‌లు ఉంటే ఎపి సిఎం చంద్రబాబుకు వేరే విపక్షం అక్కర్లేదు. వారు చాలు.. బాబును మళ్లీ విపక్షం వైపు చేర్చడానికి!

01/06/2017 - 23:49

కులం, మతం ఆధారంగా ఓట్లు దండుకోవడం కుదరదని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఎన్నికల సంస్కరణలో కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగంలోని వౌలిక విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ కులమతాల పేరిట ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హులని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

01/05/2017 - 23:59

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఎంతగా దూసుకుపోతున్నప్పటికీ భారత్ సహా అనేక దేశాల్లో పేదరికం, ఆకలి సమస్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. అంతర్జాతీయ ఆహా ర విధాన పరిశోధనా సంస్థ ( ఐఎఫ్‌పిఆర్‌ఐ) భారత్‌తో పాటు 118 దేశాల్లో ప్రజలకు ఆహార లభ్యత, ఆకలి సమస్యలను పరిశీలించి, ‘ప్రపంచ ఆహారలేమి సూచీ’ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్- జి.హెచ్.ఐ)ని గత ఏడాది అక్టోబర్‌లో రూపొందించారు.

Pages