S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

10/20/2017 - 23:04

సుమారు మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్న ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎట్టకేలకు అధ్యక్ష పదవి చేపట్టడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే ‘పట్ట్భాషేకం’ జరగబోతున్నట్టు ఆయన మాతృమూర్తి, పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించడంతో ఈ విషయమై నెలకొన్న అస్పష్టతకు తెరపడినట్టు అయింది.

10/18/2017 - 21:29

వైశ్యులను నిందిస్తూ కంచ ఐలయ్య అనే విద్వేషకారుడు వ్రాసిన పుస్తకాన్ని నిషేధించడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించకపోవడం విస్మయకర విపరిణామం! ఆ పుస్తకాన్ని నిషేధించడంవల్ల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం వాటిల్లగలదన్నది సర్వోన్నత న్యాయ నిర్థారణ! సర్వోన్నత న్యాయస్థానం తీర్పు దేశ ప్రజలకు శిరోధార్యం. అందువల్ల ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అన్న ఐలయ్య పుస్తకం చెలామణిలో ఉంటుంది.

10/18/2017 - 00:15

చిన్న పిల్లలకు వివాహాలు చేసే చెడు సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగిన భారతీయ సమాజంలో వాటిని నిలిపివేసేందుకు స్వాతంత్య్రం రాక ముందే బాల్య వివాహాల నిరోధక చట్టం -1929 అమలులోకి వచ్చింది. పెళ్లికూతురును, పెళ్లికొడుకుని పెద్దవారు ఎత్తుకుని నిల్చుంటే వారిద్దరి మధ్య వివాహాలు జరిగే పరిస్థితి ఉండేది. బాల్య వివాహాలను నేరంగా పరిగణించారు. దీనినే శారదా చట్టం అని పిలిచేవారు.

10/17/2017 - 00:03

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ పాదయాత్రలకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఇదొక అహింసామార్గం. జన చైతన్యానికి తోడ్పడింది. గాంధీ శిష్యుడు వినోబాభావే తన పవనార్ ఆశ్రమం నుండి బయలుదేరి కాలి నడకతోనే సందేశం వినిపించేవాడు. ఎన్నికల సమయంలో విమానంలో యాత్ర, బస్సు యాత్రలకన్నా పాదయాత్రలు ఎక్కువ ప్రఖ్యాతిగా ఉంటాయని రాజకీయవేత్తల నమ్మకం.

10/16/2017 - 00:59

రష్యా విప్లవం విజయవంతమైన తర్వాత గ్రామాల్లో భూసమస్య ముందుకు వచ్చింది. అప్పటిదాకా భూస్వాముల చేతుల్లోగల వేలాది ఎకరాల భూమి వ్యవసాయదారుల పరమైంది. అలా వచ్చిన భూముల్ని ఎలా సాగుచేయాలో, ఎలా పరిష్కరించుకోవాలో వ్యవసాయదారులకు అర్థం కాలేదు. దానికి విప్లవ పోరాట అనుభవంతో వున్న రైతులంతా సమానంగా పంచుకోవాలనే ఆలోచన చేసారు. గ్రామాలవారీగా భూకంపం ప్రారంభమైంది.

10/15/2017 - 00:53

యుద్ధానికి బయలుదేరడానికి ముందే అసలు మన శత్రువు ఎవరో నిర్ధారించుకోవాలి. అలాకాకుండా గుడ్డిగా వెళితే పరాజయం మాట అటుంచి పరాభవం తప్పదు. నీడలతో యుద్ధం చేస్తే అది వీరత్వం అనిపించుకోదు. బాకులు, కత్తులతో కాకుండా బంతిపూల యుద్ధం చేసే వారిని చరిత్ర గుర్తించదు. స్వపక్షంలోనే విపక్షాలు. అస్మదీయులెవరో తెలియదు. తస్మదీయులెవరో అసలే తెలియదు.

10/14/2017 - 00:40

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షాకు చెందిన కంపెనీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయంటూ వచ్చిన వార్తలు ఇప్పటివరకు సైద్ధాంతికత, పటుత్వం గురించి ఘనంగా చెప్పుకునే బిజెపి అధినాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేస్తున్నాయి.

10/13/2017 - 00:49

ఒక వ్యక్తి చేపలు అమ్మే దుకాణంపెట్టి ఇక్కడ తాజాచేపలు అమ్మబడును అనే బోర్డు బయట తగిలించాడు. మరుసటి రోజు ఓ పెద్దాయన వచ్చి నీవు ‘ఇచ్చట’ కాకపోతే ‘అచ్చట’ అమ్ముతున్నావా? దుకాణం ఇక్కడే ఉన్నప్పుడు బోర్డులో ‘ఇచ్చట’ ఎందుకు? అనగానే రంగుతో ‘ఇచ్చట‘ చెరిపేశాడు. రెండురోజులకు ఇంకో వ్యక్తి వచ్చి ‘నీవు తాజా చేపలు’ కాకపోతే నిన్నటివి, మొన్నటివి అమ్మితే కొనుక్కోవడానికి మేమేమైనా తెలివి తక్కువ వాళ్లమా!

10/11/2017 - 19:42

అంతర్గత అత్యవసర పరిస్థితి- ఇంటర్నల్ ఎమర్జెన్సీ- అమలులో ఉండిన నాటి మాట! విపక్ష రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఎమర్జెన్సీ వ్యతిరేకులు తదితరులు కారాగృహ నిర్బంధవాసం చేస్తుండిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం క్రీస్తుశకం 1975వ 1976వ సంవత్సరాలలో నలబయి రెండవ రాజ్యాంగ సవరణకు పూనుకొని ఉంది.

10/11/2017 - 00:34

మహాత్మాగాంధీ హత్య జరిగి 69 ఏళ్ల తర్వాత కూడా కుట్ర వెనుక అనుమానాలు నివృత్తికాలేదు. మహాత్మాగాంధీ హత్యపై మరోమారు సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. చరిత్రపుటల్లో సంచలనంగా నిలిచిన ఈ కేసులో 12 మంది కుట్రదారులపై విచారణ జరిగింది.

Pages