S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

05/09/2016 - 23:37

ఏప్రిల్ 22న నేపాల్‌లో ఒక సంఘటన జరిగింది. అక్కడి ప్రధానమంత్రిని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు కలిశారు. వారు ఇలా కోరారు.‘‘గత పదిహేను సంవత్సరాగా నేపాల్‌లో అంతర్యుద్ధం నడిచింది. అప్పుడు ఎందరిపైనో అప్పటి ప్రభుత్వాలు కేసులు పెట్టాయి. వాటినన్నింటిని ఇప్పుడు మీరు రద్దు చేయాలి,’’ అని. అందుకు నేపాల్ ప్రధాని అంగీకరించారు. ఎందుకంటే నేపాల్‌లో ఇప్పుడు వెనకటి హిందూ రాజ్యాంగం లేదు.

05/09/2016 - 07:24

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వీలుకాదని మొదట పరోక్ష సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రత్యక్షంగా చెప్పడం మొదలుపెట్టింది. ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈమేరకు ఇచ్చిన లిఖిత పూర్వక వివరణ ఒకటి ఈనెల 4వ తేదీన వెలుగులోకి రావడం ఇందుకు తాజా దృష్టాంతం. వాస్తవానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నది ఇప్పుడు కొత్తగా తేలిన విషయం కాదు.

05/08/2016 - 00:36

పాలకుల నెత్తికి బొప్పి కడితేనే వ్యవస్థలో లోపాలు బయటపడతాయి. ప్రజల ఈతి బాధలు తెలిసివస్తాయి. అయినా చేతుల్ని దులుపుకునే పాలకులు త పాలనకు తామే మురిసిపోతుంటారు. రాజ్యసభ సభ్యుడైన ఎంఎ ఖాన్‌కు హైదరాబాద్‌లోని ఓ పేరు మోసిన ఆసుపత్రి ముక్కుపిండి డబ్బులు కట్టమంటే కాని, కార్పొరేట్ వైద్యవిధాన ఘనత తెలిసిరాలేదు.

05/07/2016 - 06:28

ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలంగా మార్చే రెండు ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ తరుణంలో ఒక పాత జ్ఞాపకం..

05/05/2016 - 06:44

న్యాయవ్యవస్థ-జ్యుడిషియరీ-మంత్రివర్గాల-ఎగ్జిక్యూటివ్-అధికార పరిధిలోకి చొచ్చుకొని వస్తోందన్నది ప్రభుత్వ నిర్వాహక రాజకీయ వేత్తలు చేస్తున్న ఆరోపణ. మంత్రివర్గాలు న్యాయ వ్యవస్థకు అన్యాయం చేస్తున్నాయన్నది ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులు ఇటీవల మోపిన అభియోగం. ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వారు ప్రాధాన్యం ఇవ్వని వౌలిక సమస్య ఒకటుంది.

05/04/2016 - 06:58

కొద్ది రోజుల క్రితం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘సంఘ్ ముక్త్ భారత్’ అంటూ సరికొత్త నినాదాన్ని మొదలుపెట్టారు. నిజానికి 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. దీనే్న కొద్దిగా మార్చి ‘సంఘ్ ముక్త్ భారత్’ అంటూ ముందుకెళ్లాలని నితీశ్ అభిలాష!

05/03/2016 - 00:45

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సర్వోచ్ఛమైనది లోక్‌సభ- దానిపై పాక్ ఉగ్రవాదుల దాడికి వెనుక అఫ్జల్‌గురు ఉన్నాడు. అతగాడిపై సుదీర్ఘకాలంపాటు విచారణ జరిగింది. చివరికి నేరస్థుడని రుజువైన తర్వాత ఉరితీశారు. మరి ఇలాంటి సుదీర్ఘ ప్రకియ చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాల్లో కాని అరేబియా, పాకిస్తాన్ వంటి మతరాజ్య దేశాల్లో కాని జరగదు.

05/02/2016 - 04:20

అధికారం లభించే అవకాశాన్ని 2014లో కొద్దిలో కోల్పోయిన వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే 2019లో అవకాశం లభించవచ్చునని ఒక దశలో అనిపించింది. కాని ఇటీవలి పరిణామాలను గమనించిన మీదట, అటువంటి అవకాశం సందేహాస్పదమవుతున్నది. అందుకు ఆయన ప్రత్యర్థి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్పరితనం కన్నా, జగన్ అపరిపక్వ ధోరణులు కారణమవుతున్నాయని చెప్పాలి.

05/01/2016 - 06:39

పేదలందరికి ఆధునిక వైద్యసేవలు..2 అంటూ ఏప్రిల్ 19న తన జన్మదిన కానుకగా చంద్రబాబు 275 సంచార్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రారంభిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. కాని దశాబ్దం క్రితం వరకు రాష్ట్రం బాబు పాలన కిందనే సాగిందనేది మరచిపోయాడు.

04/29/2016 - 23:43

అగస్త్యుడు ఒక భారతీయ ఋషి. ఈయన సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి అక్కడ భారతీయ సంస్కృతిని ప్రచారం చేశాడు. ఆయన పేరు తర్వాతి కాలంలో రోమన్ చక్రవర్తులు పెట్టుకున్నారు. అగస్టీన్ పేరుమీద ఆగస్టు నెల ఏర్పడింది! దేశ విదేశాలలో అగస్టా వంటి సంస్థలు ఏర్పడ్డాయి. మెకానికా ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అగస్టా ఛాపర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. దీని కేంద్ర కార్యాలయం ఇటలీలో ఉంది. ఎ.కె.

Pages