S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/05/2016 - 06:04

‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం’లో మన పాలకులు నిష్ణాతులు. పూటగడిస్తే చాలు, రేపటి సంగతి రేపు చూసుకొందాం అన్న ధోరణి మన నేతలలో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా గంగా జలాల శుద్ధి ప్రాజెక్ట్‌ను చెప్పుకోవచ్చు. ఎనబైయ్యవ దశకం మధ్యలో ప్రారంభమైన గంగాజలాల శుద్ధీకరణ నేటివరకు పూర్తి కాలేదు. ఎప్పటికీ పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు.

02/05/2016 - 05:56

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. ఊరూరా వాడవాడలా ఎయిడ్స్ నివారణకోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించి భారతదేశం నుంచి పారద్రోలాలి. ఎయిడ్స్ అనేది ఆరోగ్య సమస్యకాదు, వ్యక్తిగత సమస్య కాదు, అదొక సామాజిక సమస్య, అదొక ఆర్థిక సమస్య, అదొక నైతిక సమస్య. ఎయిడ్స్ సోకి తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలు అనాధలై బజారులో పడుతున్నారు. ప్రపంచానికి ఈ సమస్య పెనుసవాలుగా మారింది.

02/04/2016 - 05:31

ద్రావిడ భాషలు 27. అందులో అయిదు మినహాయించి మిగతావి అన్నీ కూడా గిరిజన భాషలు. ఇందులో ఎక్కువ గిరిజన భాషలు అంతరించే ప్రమాద స్థాయిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు భాషలలో అభివృద్ధిచెందిన సాహిత్యం ఉంది. అంతేకాదు వాటికి లిపులు ఉన్నాయి. కాగా మిగతా 22 భాషలకు లిపి లేదు. అవి అలిఖితంగా గిరిజన భాషలుగా ఉన్నాయి.

02/04/2016 - 05:29

ఉపాధ్యాయులంతా రెగ్యులర్‌గా స్కూలుకు వస్తారా?
ఈ ప్రశ్న నన్ను చాలా బాధపెట్టింది. ఇది దేశ స్థాయిలో ప్రభుత్వం అడగవలసిన ప్రశ్నకాదు. దేశంలో ప్రతి డిపార్ట్‌మెంటులో కూడా మంచిచెడు రెండూ ఉంటాయి. మన దేశంలో వృత్తికి అంకితమైన ఉపాధ్యా యులు లేకుంటే, తల్లితండ్రి తరువాత గురువు అనే మాటే ఈ నేలలో ఉద్భవించకపోయేది.

02/03/2016 - 06:27

విద్యాబోధన వైద్యం అనే రెండింటిని ఇంగ్లీషులో బుల్‌ప్రొఫెషన్సు అన్నారు అనగా అన్ని వృత్తులలోకి ఇవి తలమానికాల వంటివి. ఒకనాడు చదువు చెప్పడానికి వైద్యం చేయడానికి ధనం తీసుకునే వారు కాదు. ఔషధ విక్రయం కూడా పాపమని భావించేవారు. ఆరోజులు గతించాయి. వైద్యం సంగతి అలా ఉంచుదాం. విద్య విషయం ఇప్పుడు పూర్తిగా ధనంతో ముడిపడి ఉంది. ఉచితంగా చదువు చెప్పేవారివద్దకు ఎవరూ వెళ్లరు.

02/03/2016 - 06:26

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మహత్యల్లో ఇది తొమ్మిదవది. అయితే విశ్వవిద్యాలయాల్లో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగినా ఎవరూ స్పందించలేదు. కానీ రోహిత్ మృతి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక వాస్తవాలను పరిశీలిద్దాం.

02/02/2016 - 01:34

గ్రామీణ పేద యువతకు వారి బ్రతుకు ప్రగతిబాట వేసేందుకు అపురూప సంపద గ్రంథాలయం. చదువు మనిషి జీవితానికీ... జీవనానికీ వెలుగునిస్తుంది. అయితే మనిషికి రెండు రకాల విద్యను నేర్పేది మాత్రం పుస్తకమే. జీవనోపాధిని ఎలా కల్పించుకోవాలో... రెండోది ఎలా జీవించాలో... విద్యార్థుల్లో మనో వికాసాన్ని పెంపొందిస్తూ మనోబలాన్ని కూడా అందించేవి గ్రంథాలయాలు. గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన జాగృతి నేస్తాలు.

02/01/2016 - 04:45

విద్యార్థుల మనోవికాసాన్ని పెంచి, వారిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపచేసి, పది మంది కలిసి సమైక్యంగా సంతోషాన్ని పంచుకునేందుకు నిర్దేశించిన ప్రత్యేక ఉత్సవాలు, పాఠశాలలో క్రమేపీ కనుమరుగవుతున్నాయి. స్వార్థసంకుచిత భావాలకు దూరంగా కులమతాలకు అతీతంగా, భారతావనీ ప్రాచీన సంస్కృతికి ప్రతి బింబాలుగా నిలుస్తున్న ఉత్సవాలపై పాఠశాలల్లో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకుంటున్నాయి.

01/29/2016 - 23:33

సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరిలోని మహేశ్వరుడు నిరాకారుడైన ఒక మహత్తరమైన, అద్భుతమైన శక్తిగా ఉద్భవించి సృష్టి నిర్మాణానికి బ్రహ్మ, విష్ణులను అవతరింపజేసి సృష్టికార్యాన్ని ప్రారంభించినాడు. సృష్టికి మూలకర్తలైన వీరికి మాతాపితల ఆవశ్యకత కలగలేదు. అందుకే వీరికి ‘్భగవంతుడు’ అనే నామకరణం వాడుకలోకి వచ్చింది. సృష్టికార్యంలో ఎనభైనాలుగు లక్షల రకాలైన ప్రాణులను ఉద్భవింపజేశారు.

01/29/2016 - 07:41

నవాజ్‌షరీఫ్ ఎప్పుడు ప్రధానమంత్రి అయినా భారత్‌తో స్నేహ సంబంధాలకు ద్వారాలు తెరచి ఉంచుతారు. ఆయన మొదటిసారి ప్రధాని అయిన ఆరు మాసాలకు అంటే 1991 మేలో భారత పత్రికా రచయితకు యిచ్చిన ఒక ఇంటర్వ్యూలో- ‘కాశ్మీర్‌ను మినహాయిస్తే మిగిలినవన్ని చాలా చిన్న సమస్యలు. పాకిస్తాన్- ఇరాన్ దేశాలే స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నప్పుడు భారత్- పాకిస్తాన్ దేశాలమధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం సమస్యేమి కాదు.

Pages