S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/21/2017 - 02:16

న్యూయార్క్, జూన్ 20: కాశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తొలగించి చర్చలకు మార్గాన్ని సుగమం చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి చేపట్టింది. ఈ రెండు దేశాలను చర్చలకు రప్పించేందుకు తానే స్వయంగా కృషి చేస్తున్నానని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. ‘పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మూడుసార్లు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో రెండుసార్లు నేను చర్చలు జరిపాను’అని ఆయన తెలిపారు.

06/21/2017 - 01:37

న్యూయార్క్, జూన్ 20: విశ్వంలో భూమిని పోలిన గ్రహాల అనే్వషణను నిరంతరం సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తాజాగా మలో 200 కొత్త గ్రహాలను కనుగొంది. వీటిలో పది గ్రహాల పరిమాణం, వాటిలోని వాతావరణం జీవానుకూలంగా ఉందని, అచ్చం ఇవి భూమి స్వరూపానే్న కలిగి ఉన్నాయని నాసా వెల్లడించింది. గత కొనే్నళ్లుగా జీవానుకూల గ్రహాల అనే్వషణను సాగిస్తున్న కెప్లర్ టెలీస్కోప్ ఈ సుదూర కొత్త గ్రహాల ఉనికిని కనుగొంది.

06/21/2017 - 00:05

యునైటెడ్ నేషన్స్, జూన్ 20: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) న్యాయమూర్తిగా దల్వీర్ భండారీని భారత్ మళ్లీ నియమించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా నియమించడానికి 2012 ఏప్రిల్‌లో ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌లో భండారీ ఎన్నికయ్యారు. యునైటెడ్ నేషన్స్ ప్రధాన అంగంగా ఉన్న ఐసిజె నెదర్లాండ్ రాజధాని హేగ్ నుంచి పనిచేస్తోంది. ఆయన పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగియనుంది.

06/21/2017 - 00:03

యునైటెడ్ నేషన్స్, జూన్ 20: ఐరాస అనుబంధం సంస్థ యునిసెఫ్ యువ గుడ్‌విల్ (సౌహార్ధ) రాయబారిగా 19 ఏళ్ల సిరియా శరణార్థి ముజూన్ అల్‌మెల్లెహాన్‌ను నియమించారు. యునిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ ఫొర్సైత్ మాట్లాడుతూ సంస్థ సౌహార్థ రాయబారిగా నియమితుడైన తొలి శరణార్థి అని స్పష్టం చేశారు. జోర్డాన్‌లోని జాట్రి శరణార్థ శిబిరంలో ఆమె ఉంటోందని వెల్లడించారు.

06/20/2017 - 02:30

న్యూయార్క్, జూన్ 19: మూడో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించటానికి ప్రపంచ దేశాలు అన్నీ సంసిద్ధమయ్యాయి. ప్రధాన వేదిక అయిన ఐక్యరాజ్యసమితి ముఖ్య కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం తనకు ఎంతో గౌరవమని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

06/19/2017 - 23:53

లాహోర్, జూన్ 19: ముంబయి దాడుల వ్యూహకర్త, కీలక నిందితుడు సరుూద్ హఫీజ్ గృహ నిర్బంధం కేసు తీర్పును సోమవారం లాహోర్ హైకోర్టు వచ్చే నెల మూడుకు వాయిదా వేసింది. పాకిస్తాన్‌లో జిహాద్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారన్న అభియోగం పై సరుూద్ హఫీజ్, అతని అనుచరులు నలుగురిపై లాహోర్ హైకోర్టు గృహ నిర్బంధాన్ని విధించింది.

06/19/2017 - 23:52

లండన్, జూన్ 19: ఉగ్రదాడులు బ్రిటన్ రాజధాని లండన్‌ను వణికిస్తున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి ఒక మసీదు వద్ద రంజాన్ ప్రార్థనలు ముగించుకుని వస్తున్న జనంపైకి వ్యాన్ దూసుకురావడంతో ఒక వ్యక్తి మరణించగా, పదిమంది గాయపడ్డారు. లండన్ నగరానికి ఉత్తరాన ఉన్న సెవెన్ సిస్టిర్స్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. వెంటనే ఫిన్స్‌బరీ పార్క్‌లో ఉన్న మరో మసీదు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

06/19/2017 - 02:52

న్యూయార్క్, జూన్ 18: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ నెల 26న జరగబోయే శిఖరాగ్ర భేటీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలను తొక్కించగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. హెచ్1బి వీసాలుసహా అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ శిఖరాగ్ర భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరిందని నిపుణులు భావిస్తున్నారు.

06/19/2017 - 02:35

లిస్బన్, జూన్ 18:మధ్య పోర్చుగల్‌లో అడవుల్లో శనివారం రాత్రి నుంచి రగులుకున్న మంటల్లో 62మంది సజీవ దహనమయ్యారు. ప్రతి వేసవిలోనూ ఈ అట్లాంటిక్ తీర ప్రాంత దేశంలోని అడవుల్లో మంటలు సహజమే. అయితే ఇంత భీకర స్థాయిలో గతంలో ఎప్పుడూ మంటలు వ్యాపించ లేదని, ఇంత మంది మరణించడమూ జరుగలేదని ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు.

06/18/2017 - 03:19

యొకోసుకా, జూన్ 17: జపాన్‌లోని పసిఫిక్ కోస్ట్‌లో యుఎస్ ఫిడ్జ్‌గెరాల్డ్ నౌక, ఫిలిప్పీన్స్‌కు చెం దిన కంటైనర్ షిప్పు ఢీకొన్న ప్రమాదంలో అమెరికాకు చెందిన ఏడుగురు నావీ సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఒక కమాండర్ గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మిలటరీ నౌక, కంటైనర్ షిప్పు ఢీకొన్నాయని వారన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే విమానాలు, బోట్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు.

Pages