S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/24/2016 - 16:19

లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ‘బ్రెగ్జిట్’లో మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ తీర్పు వెలువడిన వెంటనే ఆయన భార్య సమంతా కలిసి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- ‘అక్టోబర్‌లో బ్రిటన్‌కు కొత్త ప్రధాని వస్తారు’ అని అన్నారు. ‘ప్రధాని పదవిలో ఇక మూడు నెలలు మాత్రమే ఉంటా..

06/24/2016 - 12:16

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవడమనేది ఎట్టకేలకు ఖాయమైంది. బ్రెగ్జిట్‌పై తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్నామంటూ 51.8 శాతం మంది, వ్యతిరేకంగా 48.2 శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో బ్రిటన్‌ వేరుపడటం ఖాయమైంది.

06/24/2016 - 11:29

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా? ఉండాలా అనే అంశంపై నిన్న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అర్థరాత్రి నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కాగా ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. ఉత్కంఠ రేపిన బ్రెగ్జిట్‌ ఫలితాలు నిష్క్రమణకే మొగ్గు చూపాయి. యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగాలని 1.58 కోట్ల మంది, వైదొలగాలని 1.69కోట్ల మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంకా 5 స్థానాల్లో పలితాలు వెలువడాల్సి ఉంది.

06/24/2016 - 05:43

సియోల్, జూన్ 23: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం కల్పిం చే అంశంపై గురువారం రా త్రి సియోల్‌లో జరిగిన ప్ర త్యేక ప్లీనరీ సమావేశంలో ఏకాభిప్రా యం సా ధ్యం కాలేదు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్య త్వం కల్పించడానికి వీల్లేదంటూ చైనా, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, టర్కీలు గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది.

06/24/2016 - 05:35

ఫ్రాంక్‌ఫర్ట్, జూన్ 23: జర్మనీలోని వీర్న్‌హైమ్ పట్టణంలోని ఓ మల్టీప్లెక్స్ సినిమా హాలులోకి గురువారం ముసుగు ధరించిన సాయుధ దుండగుడు ప్రవేశించి కాల్పులు జరపడంతో పలువురు గాయపడినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 50 మందిదాకా గాయపడినట్లు అనధికారిక వార్తలను బట్టి తెలుస్తోంది. కాగా, పోలీసు ఆపరేషన్‌లో భాగంగా జరిపిన భాష్పవాయు ప్రయోగంలో కనీసం 25 మంది గాయపడినట్లు స్థానిక దినపత్రిక ‘బిల్డ్’ తెలిపింది.

06/24/2016 - 03:14

లండన్, జూన్ 23: మరికొన్ని గంటల వ్యవధిలో బ్రెగ్జిట్ ఫలితం తేలబోతోంది. 28దేశాల కూటమిగా ఐరోపా యూనియన్ భవితవ్యాన్ని కూడా ఇది నిర్దేశించబోతోంది. ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా స్వతంత్య్ర దేశంగా మనుగడ సాగించాలా అన్న కీలక అంశంపై గురువారం జరిగిన పోలింగ్‌లో లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

06/24/2016 - 01:32

తాష్కంట్, జూన్ 23: అణు ఇంధన సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జి) సభ్యత్వంకోసం గట్టి ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి చైనా మద్దతును మోదీ కోరినట్లు సమాచారం. భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో మోదీ-జిన్‌పింగ్‌ల సమావేశం అత్యంత కీలకమైందని భావిస్తున్నారు.

06/24/2016 - 01:25

వాషింగ్టన్, జూన్ 23: మనవాళ్లు అన్నింటికీ ఆమెరికాను ఆదర్శంగా తీసుకుంటుంటే, అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు మాత్రం మన పార్లమెంటు సభ్యులను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మన దేశంలో చీటికి మాటికి ప్రతిపక్ష సభ్యులు ఏదో ఒక సమస్యపై పార్లమెంటులో వెల్‌లోకి దూసుకెళ్లడం, ధర్నా చేయడం పరిపాటయిపోయిన విషయం తెలిసిందే.

06/23/2016 - 17:30

తాష్కెంట్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉబ్జెకిస్థాన్‌ పర్యటనలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి మద్దతు, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

06/23/2016 - 13:07

లండన్‌: జికా వైరస్‌ లాటిన్‌ అమెరికా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ అబార్షన్లు చేయించుకునే మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోందట. గతేడాది నవంబర్‌లో ఈ వైరస్‌ను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. జికా ప్రభావిత ప్రాంతాల మహిళలు కొన్నాళ్ల పాటు గర్భం దాల్చకుండా ఉంటే మంచిదని ఇప్పటికే లాటిన్‌ అమెరికాలోని చాలా దేశాల ప్రభుత్వాలు సూచించాయి.

Pages