S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/25/2018 - 22:03

వృథాగా
ఎవరి హృదయాన్ని
పగలగొట్టొద్దు!
అది అద్దం వంటిది
పగిలిన ప్రతి ముక్కా
నీ క్రూరత్వానే్న గుణిస్తది!
రాయి విసరడం ఎంత తేలికో
గాయం ఊరుకుంటదా?
మానినా మరకై గుర్తుపెట్టుకుంటది!
స్వీయ గాయాలే లెక్కలేనన్ని
గణించడం పూనుకుంటే
జీవితం కురచనవుతది!
నీకూ నాకూ పెద్ద తేడా ఏముంది చెప్పు?
దారులు వేరుగావచ్చు

03/25/2018 - 22:01

ఎన్ని వేల కాంతులో
నిన్ను చూసి చిన్నబోయాయ
నాలో ఎన్నో కలలు
కల్పనలుగా నిన్ను చేరుతున్నాయ
నా వౌనం మధురంగా
నిన్ను కోరుతుంది కలకాలం
నువ్వు నాతో ఉండాలని
నీ వౌనం నన్ను ఎంతగా వేధిస్తుందో
నీ తలపు నా ఎద తలపులను తడుతుంది
నా ప్రేమ నీ ప్రణయాన్ని కోరుతుంది
నీకు నాకు మధ్య ఉన్న మైళ్ల దూరాన్ని
మనసుల మధ్య ఉంచలేవుగా

03/25/2018 - 21:59

వాడి హృదయం
నే వాలిన భుజమంత ఎత్తు
వాడి చిరునవ్వు
నా కంటి చినుకులు పడ్డప్పటి
సూర్యుడంత మిణుకు!
ఆహా
వాడి మాట పది కొండల మూట
వాడేమో వాదించని నిశ్శబ్దం
అయనా వాడొక నెమ్మది జలపాతం
వాడి మీసం నన్ను చూస్తే
కోర మెలికలు తిరిగిపోతుంది
నిర్దయుడు దేముడు కూడా మంచోడే
వాడిని పాపం
హృదయం లానే చేశాడు
అయ్యో పాపం వాడో హృదయం

03/19/2018 - 00:51

ఉదయాస్తమయాల రంగులు కలసిన
పొలిమేర మీద
పరిమళ నిశ్వాసాల్లో పరవశిస్తున్న నిశ్శబ్దాన్ని
సుమగాత్రి ఎవరో రాత్రిగా మార్చింది
పగటి బాధను దిగమ్రింగి
చెరువులోని చెంగల్వ
వెనె్నల వేణువు నూదుతోంది
శీతల కిరణ సంస్పర్శకు
చేరువైన కాలదూరం
తళుకు నీలి తారళ్యంగా
మధ్యమావతిని మలపించింది...

03/19/2018 - 00:49

విశాఖపట్టణం వేదికగా సాహిత్య, సాంస్కృతిక కార్యాచరణ చేస్తున్న మొజాయక్ సాహిత్య సంస్థ తొలిసారిగా ప్రదానం చేస్తున్న మొజాయక్ సాహితీ పురస్కారానికి ప్రముఖ కథ, నవలా రచయత సయ్యద్ సలీమ్‌ను ఎంపిక చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

03/19/2018 - 00:49

ఇంతలో ఇంత అందం పోయిందా! అనుకుంది ఓ యింతి
అద్దంముందు కోతి మనసున్న మనిషి వయస్సు,
తుళ్ళిపడే వయసునుంచి,
‘గుర్తుకొస్తున్నాయ’నుకొనే వయసువరకు
మధ్యలో ఎన్ని జీవన మజిలీలో!

03/19/2018 - 00:47

విశ్వవిజేత సముద్రగుప్త
రచన: పాలంకి సత్య
వెల: రూ.100, పేజీలు: 151
ప్రతులకు: సాహిత్య నికేతన్
3-4-852, కేశవ నిలయం
బర్కత్‌పుర, హైదరాబాద్-27
040-27563236
*

03/12/2018 - 06:52

కాలం అప్పుడప్పుడు
కన్నీటి గాయాల మీంచి నడిచెళుతుంది
పగిలిన అద్దాల్లాంటి రోజుల్ని ఏరుకుంటూ
విడిపోయ వగర్చే క్షణాల్ని దోసిలిలో పట్టుకుంటూ
ఆవిరైపోయన ఆశల పొగని బుడ్డీలో దాచుకుంటూ
కాలం అప్పుడప్పుడు కన్నీటి గాయాల
మీదనుంచి నడిచెళుతుంది..
ముసుగు కప్పుకుని
తాగివాగే మైకాన్ని చీత్కరించుకుంటూ
ఎదుటివారి మీదకు చూపులను చెక్కి

03/12/2018 - 06:51

నేను మోయలేను
ఈ నిదురపట్టని రాత్రిని
ఇది భూగోళం కంటే భారమైంది!

మెలుకువ ఎంతున్నా
చీకటిని జయించలేని స్థితి
క్షణమొక పెనుభారం!

అందరూ నిద్రలో
తరిస్తుంటే...
ఆ అనీజీనెస్ అనుభవించాల్సిందే!

03/12/2018 - 06:49

ఎన్ని వింటున్నా, ఎన్ని కంటున్నా
ఏదో తెలియని అలజడి
అంతరంగాన్ని తొలిచేస్తోంది
అందుకే
ఇంకా చీకట్లోనే వున్నాననుకుంటున్నా
భవిష్యద్యుతులు
బాలభాను కిరణాల్లా
విశ్వగోళంలో జ్వలించాలని ఊహిస్తున్నా
మానవ మనుగడలో
మధురిమలెలా నింపాలని ఆలోచిస్తున్నా
కను మూసినా లోమనసులో
భావతీరాలను చేరలేకపోతున్నా
నాలోని శతకోటి భావాలు

Pages