S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/17/2016 - 21:47

స్వాతి బోండియా... ఆడుతూ పాడుతూ కాలం గడిపే ప్రాయంలో ఉన్న ఓ కాలేజీ విద్యార్థిని. ఆపదలో వున్న వారిని ఆదుకోవడమంటే వారికొక పూట భోజనం పెట్టడమో లేదా ఓ పది రూపాయలు ఇవ్వడమో కాదు.. అలా చేస్తే వారిని భిక్షాటనకు మరింతగా ప్రోత్సహించడమే అవుతుంది. అదే వారికి ఒక స్థిరమైన పనిని కల్పించినట్టయితే వారికి జీవితాన్నిచ్చినట్టవుతుంది. ఇదే స్వాతి బోండియా ఆలోచన. ఆ ఆలోచనే దాదాపు 36 కుటుంబాలకు జీవనోపాధిని కల్పించింది.

05/14/2016 - 22:45

చాలామంది మహిళల్లో నడుమునొప్పి రావడం సహజమే అయినప్పటికీ అందుకు దారితీస్తున్న కారణాలేమిటో తెలుసుకుని నివారణ చర్యలు ఆచరించాలి. ఇంటిపని ఎక్కువైతే ఆడవారిలో నడుము నొప్పి సమస్య తీవ్రమవుతుంది. పని ఒత్తిడి వల్లనే కాదు, గర్భాశయం, గర్భాశయ ద్వారం వంటి శరీర భాగాలపై ఇన్‌ఫెక్షన్ సోకినా నడుము నొప్పికి దారితీస్తుంది.

05/12/2016 - 22:06

నయనానందం కలిగించే వర్ణాలెన్నో ఉన్నప్పటికీ భారతీయ మహిళలు ప్రత్యేకించి గులాబీ రంగంటే తెగ మోజుపడుతున్నారని తాజాఅధ్యయనంలో తేలింది. సంప్రదాయ దుస్తులైనా, ఆధునిక డ్రెస్సులైనా గులాబీ రంగులో ఉంటే తమకెంతో ఇష్టమని చాలామంది మగువలను వారి మనోగతాలను సర్వే సందర్భంగా ఆవిష్కరించారు.

05/12/2016 - 22:04

అనువైన హ్యాండ్‌బ్యాగ్ సౌకర్యవంతంగానే కాదు, అతివల అందాన్ని కూడా పెంచుతుంది. మార్కెట్‌లో రకరకాల హ్యాండ్‌బ్యాగులు లభిస్తున్నా- వాటిలో అవసరానికి తగ్గట్టు అందమైన, నాణ్యమైన దానిని ఎంచుకోవడంలోనే అసలు నైపుణ్యం దాగి ఉంటుంది. హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకోవడంలో తగిన అవగాహన, మెళకువలు ఎంతో అవసరం.

05/12/2016 - 22:02

దక్షిణ ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో 69వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం బుధవారం రాత్రి కోలాహలంగా మొదలైంది.
ప్రారంభ వేడుకల సందర్భంగా వివిధ దేశాలకు చెందిన మోడల్స్ ఎర్ర తివాచీపై హొయలొలుకుతూ
ఆహూతులను అలరించారు.

05/11/2016 - 21:38

వార్తలన్నీ నిజాలు కావు.. అయితే, సంఘటనలుగా వెలుగుచూసే వార్తల్ని మాత్రం నమ్మాల్సిందే. ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది ఈ ఘటన. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో మేరీఎన్ ఫ్రాంకో అనే 70 ఏళ్ల అంధురాలు తన యింట్లో నడుస్తూ నడుస్తూ ఇటీవల కిందపడిపోయింది. వెల్లకిలా పడిపోవడంతో ఆమె మెడకీ, మోచేతికీ గట్టి దెబ్బలు తగిలాయి. 1995లో కారు ప్రమాదంలో మేరీఎన్ గాయపడటంతో వెనె్నముకకి శస్త్ర చికిత్స జరిగింది.

05/10/2016 - 22:05

అభిరుచులు అందరికీ ఉంటాయ. కొం దరు మాత్రమే ఆసక్తితో అభి రుచులను నెరవేర్చుకుంటారు. కొం తమంది చిన్నారులు పసి ప్రాయం నుంచే వారికంటూ కొన్ని అభిరుచులను ఏర్పర చుకుం టారు. ఆట వస్తువులు, బొమ్మలను సేకరిస్తూ తమ మన సును ఆనందంతో నింపేసుకుంటారు. చిరు ప్రాయంలో చేసే ఈ చిన్ని ప్రయత్నాలే అర్ధవంతమైన హాబీలుగా మారి వారి ప్రత్యేకతను చాటుకుంటాయ.

05/08/2016 - 01:06

అవునమ్మా!
నాకున్నధి నువ్విచ్చిన ఒకటే శరీరం!
దుఃఖానికి ఒకటి, ఆనందానికి ఒకటి చొప్పున
రెండు శరీరాలు ఇచ్చి వుంటే బావుండేది.
దుఃఖంతో శరీరం శుష్కించిపోయాక
అప్పుడప్పుడు దొరికిన కాసిన్ని ఆనంద క్షణాల్ని
దాచుకోవడానికైనా పనికివచ్చేది.. ఇపుడు చూడు
ఎన్ని రంగులద్దినా అతుకులబొంతగా తయారవుతోంది!

05/04/2016 - 22:28

స్వచ్ఛ్భారత్, స్వేచ్ఛ్భారత్, కుశల్‌భారత్, ఆ భారత్, రుూ భారత్- యిలా రకరకాల భారత్‌లు ఎన్నో యిక్కడ వున్నాయి. మరో క్రొత్త స్లోగన్- బేటీ ‘పఢావో’ వచ్చింది. అద్సరే, ముందు ఆడపిల్లని డీసెంట్‌గా బ్రతకనివ్వాలి కదా? అదేకదా ‘బచానా’ అంటే.

05/03/2016 - 21:24

హాజీ ఆలీ దర్గావారు మహిళను రెండవ తరగతి పౌరురాలిగా పరిగణిస్తున్నారు. దీనిపైనే నా పోరాటం అని భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ అంటున్నారు. శని శింగనాపూర్‌లో మహిళల ఆలయ ప్రవేశ విజయంతో ఆమె ముస్లిం మహిళలను హాజీ ఆలీ దర్గాలోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన తదుపరి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆలయాల్లో, దర్గాలలో మహిళల ప్రవేశంపై ఆమె చేస్తున్న పోరాటానికి ప్రతీకారదాడులు ఎదురైనా..

Pages