S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/31/2017 - 22:33

నెయిల్ ఆర్ట్ చాలా పురాతన పద్ధతుల్లో ఒకటి. ఫ్యాషనబుల్‌గా మార్కెట్‌లోకి నెయిల్ ఆర్ట్ లేటెస్ట్ ట్రెండ్‌గా వచ్చేసింది. ఉంగరాలకంటే గోళ్ళపై ఆర్టే అందాన్నిస్తుంది. అంతేకాదు, ఈ నెయిల్ ఆర్ట్ సందర్భాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. గోళ్ళకు నెయిల్ పాలిష్ అనేది ఒకప్పుడు ఫ్యాషనే కానీ ఇప్పుడు నెయిల్ ఆర్ట్ మాత్రమే కనిపిస్తోంది. గోళ్ళపై వెరైటీ డిజైన్స్, చెమ్కిలు, స్టోన్స్‌తో వర్క్ చేయడం అనేది ఒక ఆర్ట్.

03/31/2017 - 22:31

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

03/30/2017 - 22:53

‘వైద్యో నారాయణో హరిః’ అన్న నానుడి ఇటువంటి వైద్యులను బట్టే ఉద్భవించి ఉం టుంది. వైద్యుడిగా ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు వీధి బాలలకు విద్యాబుద్ధులు అబ్బేలా కృషి చేస్తున్నారు డాక్టర్ గోవింద్ సింగ్ చొప్పాల. ఎడారి రాష్టమ్రైన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ‘నీమ్ కా తానా’ అనేది ఒక పట్ట ణం. ఈ పట్టణంలోని సింగివారి బస్తీ అనే ప్రాం తంలో ఆయన కపిల్ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు.

03/30/2017 - 22:47

ఏదైనా ప్రమాదం జరిగి కిందపడితే మందుగా తగిలేది తలకే. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వారి రక్షణ దృష్ట్యా హెల్మెట్ వినియోగిచాలి. హెల్మెట్లను వినియోగించి సురక్షిత ప్రయాణం చేయాలనే పోలీసులు పదే పదే చెబుతున్నా వాహనదారులు చెవికి ఎక్కడంలేదు. కొంతమంది యువకులు పరిమితికిమించి వేగంతో బైకులను దూసుకెళ్లేలా నడుపుతున్నారు.

03/30/2017 - 08:18

పార్కులకి చెట్లు, మొక్కలు, వాటికి పూలు, నియాన్ లైట్ల కాంతులు- యివన్నీ అలంకారాలే గానీ, సాయంకాలం అయ్యేసరికి, సీతాకోక చిలుకల్లాగా పడుచు జంట లు వచ్చి వాలితేనే దాని అందం. కానీ, రెం డు లక్షల చదరపు అడుగుల వైశాల్యంగల, లక్నోలోని ‘రామ మనోహర లోహియా’ పార్కులో యిప్పుడు అంతులేని వెలితి కనబడుతున్నది బోసిపోయి వుంది.

03/28/2017 - 22:17

నార లేదా పీచుతో కూడిన స్వాభావిక ఆహార పదార్థాలు మనం తీసుకునే భోజనంలో 50 శాతందాకా తప్పనిసరిగా ఉండాలి. కండరాల కదలికలకు నార లేదా పీచుతో కూడిన ఆహార పదార్థం సహాయపడుతుంది. తాజా కూరగాయలతో కూడిన సలాడ్‌లు, బచ్చలి కూర జీర్ణశక్తిని పెంచుతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు అవసరమైన పీచు పదార్థం ఆకుకూరల్లో అధికంగా ఉం టుంది.

03/28/2017 - 00:33

మధురసమ్ముల నొలుకుచు మాధవమ్ము
ప్రకృతి మోవిపై రాగాల పల్లవించె
వికృతి నశియించి నవ్యత విరిసె భువిని
చూతపల్లవాంకురముల శోభదనరి!

మొగ్గబుగ్గపై విరిసిన ముగ్ధరేఖ
వెలుగువాకగ మారెను విశ్వమందు
ప్రేమలేఖల రచియించె ప్రీతినిడుచు
తరళ తరుకన్య వలపుల పరవశించి

03/24/2017 - 21:26

ఎండలు ముదిరిపోతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలకు తాటిముంజలు దివ్యమైన ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో వ్యాపించే చికెన్‌పాక్స్ బాధితులకు ఇది చల్లటిమందు. ఐస్ ఆపిల్‌గా పిలుచుకునే తాటిముంజల్లో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటిశాతమూ ఎక్కువే. కొబ్బరికాయల తరువాత ఎక్కువ నీటిని ఇచ్చే పండ్లు ఇవి. మనిషికి కావలసిన ఖనిజ లవణాలైన ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, జింక్ వీటిలో తగినపాళ్లలో ఉంటాయి.

03/23/2017 - 22:44

వేసవిలో లభించే కమలాఫలంతో రుచి కర మైన వంటలు చేసుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి కలిగిన కమలా పండుతింటే జలుబు, దగ్గు చేస్తుందని అనుకుంటారు. కాని కమ లాపండు తినటం వల్ల దగ్గును దూరుం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనితో తొక్కల పచ్చడి, కస్టర్డ్ వంటివి చేసుకుని తింటే రుచిగా ఉంటాయ.
కస్టర్డ్

03/23/2017 - 01:20

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. మెసేజ్ పంపడం.. షేర్ చేసుకోవడమే. ప్రస్తుతం వాట్సాప్ హంగామా ఇదీ.. సాంకేతిక విప్లవం పరుగులు తీస్తున్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగం ఎక్కువైంది. చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని చిటికెలో అద్భుత దృశ్యాలను, కీలక సమాచారాన్ని, చక్కటి సందేశాలను, ఆకట్టుకునే వీడియోలను షేర్ చేసుకుంటూ ఇలా అనేక రకాలుగా యువత వాట్సాప్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు.

Pages