S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 01:22

తమిళనాడులో జయలలితమ్మ లేదు గానీ, ఆమె 2013 నుంచీ మొదలుపెట్టి అమలు చేస్తున్న అమ్మ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. శుచిగా పుష్టికరంగా అతి స్వల్ప ధరలకే వండి వడ్డించే సాంబార్ సాదం తైర్ సాదం, ఇడ్లీ, వడై, సాంబర్‌ల లాంటి ఆహార పదార్థాలు పేదలకి లభిస్తున్నాయి.

03/23/2017 - 22:46

ఓ ఐడియా జీవితానే్న
మార్చేస్తుంది..
ఓ వ్యాపార సంస్థ నినాదం ఇది...
అది నిజమేనని అనిపిస్తుంది తెనాలి కుర్రాడి జీవితాన్ని గమనిస్తే...
ఎందుకంటే అతడికి వచ్చిన ఓ ఆలోచన ఇప్పుడు 70 కుటుంబాల జీవితానే్న మార్చేసింది మరి! ఆ ఆలోచన వచ్చిన వ్యక్తిపేరు షేక్ అబ్దుల్ ముజీబ్. తెనాలికి చెందిన సామాజిక కార్యకర్త. అతడేం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్ఫూర్తిపొందాల్సిందే.

03/23/2017 - 00:50

స్మో కింగ్ అనేది నేడు ప్రపంచ సమస్యగా మారిపోయింది. సరదాగా చేసుకునే ఈ అలవాటు శరీరంలో స్లోపాయిజన్‌గా పనిచేస్తుందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జరిపిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 187 దేశాలలో అంటువ్యాధి వలే ప్రబలిన ఈ ధూమపానంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ పలు విషయాలను వెల్లడించిం ది. గుండెజబ్బు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న స్మోకింగ్ మహిళల్లో క్రమేణ విస్తరిస్తుంది.

03/22/2017 - 04:27

ఒంగోలు, మార్చి 21: చిత్తూరు, నెల్లూరు,ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి యండపల్లి శ్రీనివాసులు ఘనవిజయం సాధించారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

03/22/2017 - 04:26

ఒంగోలు అర్బన్, మార్చి 21 : తెలుగు రాష్ట్రాల్లో 2019 నాటికి అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ బలమైన క్రియాశీలకంగా ఎదగనున్నట్లు జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి వెల్లడించారు.

03/22/2017 - 04:26

మార్కాపురం టౌన్, మార్చి 21: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసి త్యాగధనులైన నిర్వాసితుల కుటుంబాలకు ఆర్‌ఆర్‌ప్యాకేజీని వర్తింపచేయాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, వైఎస్‌ఆర్‌సిపిలతోపాటు వెలుగొండ ప్రాజెక్టు సాధన కమిటీ, వెలుగొండ నిర్వాసితుల సంఘం మంగళవారం చేపట్టిన పట్టణ బంద్ పాక్షికంగా జరిగింది.

03/22/2017 - 04:24

మదనపల్లె, మార్చి 21: తొలగించిన గ్రూపుపేరుతో స్థానిక ఎస్‌బిఐ బ్యాంకులో రూ.5లక్షలు రుణం తీసుకుని స్వాహాచేసిన మదనపల్లె మున్సిపల్ మెప్మా (సంఘమిత్ర) ఆర్‌పి పుష్పలతను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మెప్మా పిడి నాగపద్మజ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 17న శనివారం ‘మెప్మా ఆర్పీ చేతివాటం - రూ.5లక్షలు స్వాహా’ అనే కథనం ఆంధ్రభూమిలో వెలువడిన విషయం పాఠకులకు విధితమే.

03/22/2017 - 04:22

కడప,మార్చి 21: రెండవ భద్రాద్రిగా పేరు గాంచిన ఒంటిమిట్ట శ్రీకోదండరామచంద్రుడి కల్యాణ మహోత్సవానికి శ్రీరామనామంతో లిఖించిన బియ్యపు తలంబ్రాలు ఒంటిమిట్టకు చేరుకున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టిడిపి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.బి.సాంబశివరావు, టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు, ఓఎస్‌డి ముక్తేశ్వరరావు, మరో జెఏఓ పోల భాస్కర్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

03/22/2017 - 04:20

అనంతపురం, మార్చి 21: పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో వైకాపా అభ్యర్థి దూసుకుపోతున్నాడు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మంగళవారం రాత్రి వరకూ కొనసాగింది. పట్ట్భద్రుల ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఎన్‌జిఒ సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆధిక్యతలో కొనసాగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

03/22/2017 - 04:18

విజయనగరం (్ఫర్టు), మార్చి 21: పట్టణంలో మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్, పన్ను వసూళ్ల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ఆర్.సోమన్నారాయణ రాకతో ఆస్తిపన్ను వసూలు ఊపందుకుంది. పట్టణంలో ఆస్తిపన్ను వసూలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పన్ను వసూళ్లలో అలసత్వం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించడంతో ఉద్యోగులలో చలనం వచ్చింది.

Pages