S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2017 - 23:49

వర్ధన్నపేట, జనవరి 15 : ప్రతి ఏటా కాకతీయుల పాలన నుండి నిర్వహిస్తున్న ఐనవొలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా భక్త జనంతో ఐనవోలు కిటకిటలాడింది. మకర సంక్రాంతి పర్వదినాన మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్త జనసందోహంతో నిండిపోయింది. మమ్మేలు మల్లన్న అంటూ డప్పుల మోతతో డమరుక నాదాలు శివసత్తుల పూనాకాలతో ఐనవోలు మారుమోగింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడం ఆనవాయితిగా మారడంతో ఈ ఏటా కూడా అది కోనసాగింది.

01/15/2017 - 23:48

వేములవాడ,జనవరి 15: పట్టణంలో సంక్రాం తి వేడుకలను శనివారం ప్రజలు ఆనంద్సోవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇళ్లముంగిళ్లల్లో రంగవల్లును అందంగా తీర్చిదిద్దారు. పట్టణ ప్రజలు ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.పిండి వంటలు చేసుకొని బందుమిత్రులతో కలసి పండుగ సంబరాలను జరుపుకున్నారు. సౌభాగ్యములిచ్చే నోము పండుగను ముత్తయిదవులు ఘనంగా జరుపుకున్నారు. నోములను నోచుకున్నారు.

01/15/2017 - 23:48

కరీంనగర్, జనవరి 15: ఇంటి వాకిళ్లల్లో విరిసిన రంగవల్లులు..వాటి నడుమ ముచ్చటగొలిపే గొబ్బెమ్మలు... ఘమఘమలాడిన పిండి వంటకాలు.. ఆకాశానా పంతగుల రెపరెపలు...హరిదాసు కీర్తనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు...బోగిపండ్లు... బొమ్మల కొలువులు... ఇలా మూడు రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలు సంక్రాంతి సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

01/15/2017 - 23:47

కరీంనగర్ టౌన్, జనవరి 15: విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14నుంచి ప్రారంభం కానున్నాయి. బాహ్యప్రపంచంలోకి అడుగిడేందుకు అవకాశం కలిగించే సమయం మరో56రోజులు మాత్రమే మిగి లి ఉండగా, ఈవిలువైన కాలాన్ని తమకు విజయసోపానాలుగా మార్చుకునేందుకు మరికొంతసేపుకష్టిస్తూ, పక్కా ప్రణాళికతోముందుకేగితే, ఉత్తీర్ణత సాధించటం పెద్ద సమస్యేమి కాకపోవచ్చు.

01/15/2017 - 23:46

సిరిసిల్ల, జనవరి 15: ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆదివారం జిల్లా కేంద్రం నుండి బయలుదేరుతున్న సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. సిరిసిల్ల జిల్లా నుండి బాలబాలికలు 32 మందితో కూడిన టీం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 16,17 తేదీలలో పాల్గొంటున్నారన్నారు.

01/15/2017 - 23:46

కరీంనగర్ టౌన్, జనవరి 15: ఉమ్మడి రాష్ట్రంలోక్రీడల నిర్వహణ కూడా చేపట్టకుండా సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ క్రీడాకారులు ఎం తో ఉజ్వల భవిష్యత్‌ను కోల్పోయారని, స్వయం పాలనకోసం ఆవిర్భవించిన కొత్తరాష్ట్రంలో క్రీడల అభివృద్దికోసం ప్రభుత్వం ప్రత్యేక కృషిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు.

01/15/2017 - 23:45

కరీంనగర్ టౌన్, జనవరి 15: నేటి సమాజంలోమనిషికి ఉండే జ్ఞానమే తరగని సంపద అని, విజ్ఞాన వికాసాన్ని పొంది, పరిపూర్ణమైన వ్యక్తిత్వ మేధస్సును వెలికితీసేందుకు పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ముదుగంటి సుధాకర్‌రెడ్డి అన్నారు.గురువారం నగరంలోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్,సైన్స్ కళాశాలలోనిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

01/15/2017 - 23:44

ఆదిలాబాద్,జనవరి 15: తెలంగాణలో ఉన్నత ప్రమాణాలతో కూడిన గురుకులాలలను వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మంత్రి జైనథ్ మండలంలోని మాంగుర్ల, గిమ్మ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సంధర్భంగా జైనథ్‌లో రూ.20 లక్షల వ్యయంతో అదనపు గదుల ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

01/15/2017 - 23:43

కడెం, జనవరి 15: నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుండి ఆయకట్టు పరిధిలో గల రబీ పంటల కోసం ఆదివారం కడెం ప్రాజెక్టు ఈ ఈ వెంకటేశ్వర్‌రావు, ప్రజాప్రతినిధులు జలాశయం నుండి ప్రధానకాలువ అయిన ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

01/15/2017 - 23:43

తలమడుగు, జనవరి 15: మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం మండలంలోని ఉమ్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కోసాయి గ్రామం నుండి రైల్వే ట్రాక్ సమీపంలో గల హనుమాన్ ఆలయం వరకు రూ.15 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Pages