S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2017 - 00:05

న్యూఢిల్లీ, జనవరి 15: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రభుత్వం తప్పక గౌరవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నాటి నుంచి జరిగిన పరిణామాల్లో ఆర్‌బిఐలో కేంద్రం జోక్యం పెరిగిపోయిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్ యునైటెడ్ ఫోరమ్..

01/16/2017 - 00:04

న్యూఢిల్లీ, జనవరి 15: కొత్త సంవత్సరంలోనూ విదేశీ మదుపరుల తీరు మారడం లేదు. దేశీయ మార్కెట్ల నుంచి నిరుడు విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల తొలి పదిహేను రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ల నుంచి 3,809 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

01/16/2017 - 02:19

పుణే, జనవరి 15: టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా వనే్డల్లోనూ బోణీ చేసింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ విజయంతో శుభారంభం చేశాడు. అంతేగాక, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, కెరీర్‌లో 27వ సెంచరీ సాధించాడు.

01/15/2017 - 23:58

ఇండోర్, జనవరి 15: రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పార్థీవ్ పటేల్ నాయకత్వంలోని గుజరాత్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో పటిష్టమైన డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని 5 వికెట్ల తేడాతో ఓడించి, మొట్టమొదటిసారి రంజీ విజేతగా నిలిచింది. 41 పర్యాయాలు రంజీ ట్రోఫీని సాధించి, మరో టైటిల్‌పై కనే్నసిన ముంబయిని ఓడించడంలో పార్థీవ్ పటేల్ కీలక పాత్ర పోషించడం విశేషం.

01/15/2017 - 23:57

మెల్బోర్న్, జనవరి 15: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. 2005 జనవరి తర్వాత ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను పాక్ ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్‌లోనూ ఓడించలేకపోయింది. సుమారు 11 సంవత్సరాల విరామం తర్వాత పాక్ తొలిసారి ఆసీస్ గడ్డపై ఓ విజయాన్ని నమోదు చేసింది.

01/15/2017 - 23:57

పుణే, జనవరి 15: కోహ్లీ, జాదవ్ ఐదో వికెట్‌కు 200 పరుగులు జోడించి, వనే్డల్లో ఐదో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని అందించారు. జింబాబ్వేపై జెపి డుమినీ, డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) అజేయంగా 256 పరుగులు పార్ట్‌నర్‌షిప్‌ను అందించి, ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు.

01/16/2017 - 02:14

మెల్బోర్న్, జనవరి 15: ఈ ఏడాది మొదటి టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆధిపత్య పోరాటానికి పేరొందిన స్టార్లు సిద్ధంగా ఉన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో నొవాక్ జొకోవిచ్, ఏంజెలిక్ కెర్బర్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతుండగా, ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్ వంటి మేటి స్టార్లు టైటిల్‌పై కనే్నశారు.

01/15/2017 - 23:52

వరంగల్, జనవరి 15: తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలలో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా విమాన సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో రాష్ట్రంలో హైద్రాబాద్ తరువాత పెద్దనగరంగా పేరున్న వరంగల్‌లో విమానాశ్రయ పునరుద్ధరణ, ప్రజలకు విమానయోగం తప్పనిసరిగా లభించనుంది.

01/15/2017 - 23:51

గూడూరు, జనవరి 15: బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమి లేదన్నారు.

01/15/2017 - 23:50

గూడూరు, జనవరి 15: గూడూరు మండలం మచ్చర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల దేవునిగుట్టపై ప్రతి ఏడాది జరిగే మల్లిఖార్జున స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. గత 43 సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ రోజున శ్రీమల్లిఖార్జున స్వామి జాతర ప్రారంభం అవుతుంది. శుక్రవారం సాయంత్రం శోభయాత్ర, ఊరేగింపుగా స్వామిని వారిని దేవునిగుట్టకు చేర్చారు.

Pages