S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2017 - 03:54

విశాఖపట్నం, జనవరి 13: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జరిగే కోడి పందేలకు విశాఖలోనూ ఆతిధ్యం లభించింది. నగరంతో పాటు శివారు మండలాలు, మారుమూల గ్రామాల్లో పందేల నిర్వహణకు వేదికలు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో నగర శివారులోని ఆరిలోవ, ఆనందపురం, పద్మనాభం, మండలాల్లో కోడి పందేల నిర్వహణ శుక్రవారం జోరుగా సాగింది. పందెం రాయుళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

01/14/2017 - 03:53

నాగాయలంక, జనవరి 13: స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద గల పుష్కర ఘాట్ సంక్రాంతి సంబరాలకు వేదికగా నిలిచింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దివిసీమ సంప్రదాయ రాష్ట్ర స్థాయి పడవల పోటీతో పాటు వివిధ పోటీలు శుక్రవారం నిర్వహించారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో స్వచ్ఛ నాగాయలంక, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ సంయుక్త సహకారంతో ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.

01/14/2017 - 03:51

రామచంద్రాపురం, జనవరి 13: పశువుల పండుగకు రెండోరోజుల ముందుగానే చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం అనుప్పల్లి గ్రామంలో భోగి పండుగ నాడే శుక్రవారం ఆ గ్రామస్థులు జల్లికట్టు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే పశువుల పండగనాడు ఈ జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీ. అయితే అనుప్పల్లిలో మాత్రం శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఈ పోటీలు జరిగాయి.

01/14/2017 - 03:49

చంద్రగిరి, జనవరి 13: ఇటు రాష్ట్ర పాలన, అటు పార్టీ బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తన జన్మస్థలమైన నారావారి పల్లెకు శుక్రవారం చేరుకున్నారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సిఎం చిత్తూరు జిల్లా చంద్రగిరిమండలంలోని నారావారి పల్లెకు శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు చేరుకున్నారు.

01/14/2017 - 03:46

విశాఖపట్నం, జనవరి 13: రాష్ట్రంలో విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు అందుతున్న సేవలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడచిన రెండేళ్లుగా ఎపిలోని ప్రధాన విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై ఇటీవల నిర్వహించిన సర్వేలో ఫలితాలు ఇదే అంశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు అందుతున్న సేవలపై సంవత్సరానికి రెండు సార్లు కస్టమర్ శాటిసిఫేక్షన్ ఇండెక్స్ పేరిట సర్వే నిర్వహించి ర్యాంకులు ప్రకటిస్తారు.

01/14/2017 - 03:45

విజయవాడ, జనవరి 13: విజయవాడ నగరంలో తొలిసారిగా జరుగుతున్న ఎయిర్ షోకు రోజురోజుకు ప్రజా స్పందన అనూహ్యమవుతున్నది. పున్నమి ఘాట్, భవానీ ఘాట్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో రెండోరోజైన శుక్రవారం విశేష స్పందన లభించింది. ఉదయం అరగంటసేపు, సాయంత్రం అరగంటసేపు నాలుగు ఎయిర్ క్రాప్ట్‌లు ఆకాశంలో విన్యాసాలు చేస్తూ అన్ని వయస్సులవారిని అమితంగా ఆకర్షించాయి.

01/14/2017 - 03:43

విశాఖపట్నం, జనవరి 13: రెండు తెలుగు రాష్ట్రాలను చలి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రలో పరిస్థితులు మరీ తీవ్రంగా ఉన్నాయి.

01/14/2017 - 03:41

గొలుగొండ, జనవరి 13: విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ఫ్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి.

01/14/2017 - 03:40

విశాఖపట్నం, జనవరి 13: విశాఖలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. కైలాసపురం పోర్టు క్వార్టర్స్ వద్ద శుక్రవారం ఉదయం కొబ్బరి బొండాలు నరికే కత్తితో పలువురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో పదేళ్ల బాలిక సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాలిక సుస్మిత మెడపై కత్తితో గాయపరచడంతో ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఉన్మాది కె జోగారావు పండుగ సందర్భంగా కైలాసపురంలో ఉంటున్న అత్త,మామల ఇంటికి వచ్చాడు.

01/14/2017 - 03:33

మహబూబాబాద్, జనవరి 13:ప్రజలు మీట నొక్కితే నాయకులు తయారవుతారని, అంతే తప్ప నాయకులు చెప్పినట్లుగా ప్రజలు నడుచుకోవాల్సిన అవసరం లేదని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. స్వప్రయోజనాల కోసం, కాంట్రాక్టులకోసం నాయకులు పార్టీ ఫిరాయించడాన్ని జేఎసి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

Pages