S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2017 - 04:37

మచిలీపట్నం, జనవరి 13: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

01/14/2017 - 04:36

మచిలీపట్నం, జనవరి 13: కోడి కూత.. కోత ముక్క.. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కోడి పందాలకు కృష్ణాజిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అధికార తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి యేటా జిల్లాలో ఆధునిక హంగులతో నిర్వహిస్తున్న కోడి పందాలకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన బరులన్నీ కళకళలాడుతున్నాయి. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బరుల వద్ద కోట్లలో పందాలు జరుగుతున్నాయి.

01/14/2017 - 04:35

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 13: బందరు నియోజకవర్గంలో శుక్రవారం భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెల్లవారుఝామునే పలు ప్రాంతాలలో భోగి మంటలు వేశారు.

01/14/2017 - 04:34

మైలవరం, జనవరి 13: ద్వారకా తిరుమలకు దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం గోదాదేవి కల్యాణం కన్నుల పండువగా సాగింది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా మాదిరిగానే స్వామివారి అమ్మవారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువఝామున స్వామివారి ప్రత్యేక సేవలో భక్తులు పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు.

01/14/2017 - 04:32

భీమవరం, జనవరి 13: సాంప్రదాయ కోడి పందాలు ఈ ఏడాది కొత్త తరహాలో జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కొత్త రూ.2000, రూ.500 నోట్లతో కోడి పందాలు జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. పందాలు ప్రారంభంలోనే నిర్వాహకులు పాత రూ.1000, రూ.500 నోట్లు చెల్లవని చాలా స్పష్టంగా ప్రకటించారు. శుక్రవారం సంక్రాంతి కోడి పందాలు చాలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

01/14/2017 - 04:30

గార్ల, జనవరి 13: తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారం చేపట్టిన టిఅర్‌ఎస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిన మేలేమిటో స్వష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

01/14/2017 - 04:28

యడ్లపాడు, జనవరి 13: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంతో ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విభేదాలకు తావిచ్చి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వవద్దని కోరారు.

01/14/2017 - 04:26

సామర్లకోట, జనవరి 13: గతంలో ఎన్నడూ లేనివిధంగా సామర్లకోట మండల పరిధిలోని జి మేడపాడు సమీపంలో సంక్రాంతి పురస్కరించుకుని వరాహాల పందాలు (పందులు) శుక్రవారం ఉదయం జోరుగా నిర్వహించారు. మండలంలోని జి మేడపాడు సమీపంలోని జి కొత్తూరు రోడ్డులో ఒక చెరువు వద్ద తెల్లవారుజామున మండలంలోని పెద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన పందుల పెంపకందార్ల ఆధ్వర్యంలో జోరుగా వరాహాల పందాలు నిర్వహించినట్టు తెలిసింది.

01/14/2017 - 04:22

చిత్తూరు, జనవరి 12: నేటి యువత స్వామి వివేకానంద బాటలో నడవాలని జడ్పి చైర్ పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు జడ్పి సమావేశ మందిరంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు పురస్కరించుకొని ,జాతీయ యువజన దినోత్సవ వేడుకుల ఘనంగా జరిగాయి. ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలమాలు వేసి నివాళి ఆర్పించారు. ఈసందర్భంగా జడ్పి చైర్‌పర్సన్ మాట్లాడుతూ వివేకానంద స్వామి యుగపురుషుడన్నారు.

01/14/2017 - 04:20

సంగారెడ్డి టౌన్, జనవరి 13: పట్టణ శివారులోని వైకుంఠపురంలో గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలుస్తుంది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణం జరిగింది.

Pages