S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2017 - 04:18

కాల్వశ్రీరాంపూర్, జనవరి 13: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పుచప్పుళ్లతో పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ముదిరాజ్ స ంఘం నాయకులతోపాటు అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఈటల

01/14/2017 - 04:16

షాబాద్, జనవరి 13: దళిత గిరిజనుల హక్కులను కాపాడేందుకు పోరాటంలో భాగంగా ఈనెల 10 నుంచి బస్సుయాత్ర ప్రారంభించినట్లు దళిత గిరిజన హక్కు పోరాట సమితి కన్వీనర్ నక్కల జంగయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రం లో ఆయన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నేరవేర్చేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

01/14/2017 - 04:15

హైదరాబాద్, జనవరి 13: మహానగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. శనివారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో గాలిపటాల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలీ స్టేడియం, నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాల్లో పలు ప్రైవేటు, స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్ నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

01/14/2017 - 04:13

హైదరాబాద్, జనవరి 13: భాగ్యనగరం అంటేనే హెరిటెజ్ సిటీ.. నగర చారిత్రక వైభవానికి ప్రతీకలుగా నిలిచిన చారిత్రక కట్టడాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులొస్తుంటారు. కానీ నగరవాసులు అనేక మంది ప్రతిరోజు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, ఎల్‌బి స్టేడియం, భారీ జాతీయ పతాకం, నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా, అప్పర్‌ట్యాంక్‌బండ్‌పై నుంచి సాగర తీరాన్ని తిలకిస్తూ ఎంతో అనుభూతిని పొందుతుంటారు.

01/14/2017 - 04:10

హైదరాబాద్, జనవరి 13: దేశవ్యాప్తంగా 500 నగరాల్లో కొనసాగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ సాధించుకునేందుకు జిహెచ్‌ఎంసి సంక్రాంతి పండుగను కూడా ఎంతో చాకచక్యంగా సద్వినియోగం చేసుకుంటుంది. స్వచ్ఛతపై నగరవాసుల్లో అవగాహనను పెంపొందించటం, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గురించి తెలియజేసేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

01/14/2017 - 04:08

జీడిమెట్ల, జనవరి 13: తనను ఎక్కడ హత్య చేస్తాడో అనే భయంతో పథకం వేసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం పేట్‌బషీరాబాద్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి శ్రీనివాస్ రావు, సిఐ డివి రంగారెడ్డి వివరాలను వెల్లడించారు.

01/14/2017 - 04:07

హైదరాబాద్, చాదర్‌ఘాట్, జనవరి 13: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీబస్టేషన్‌లతో పాటు నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల వాసులు తెల్లావారుజాము నుంచే తమ ఊర్లకు వెళ్లేందుకు బారులుతీరారు.

01/14/2017 - 04:06

హైదరాబాద్, జనవరి 13: మహానగర వాసులకు ప్రతిరోజు వౌలిక వసతులు, పౌరసేవలందించే ముఖ్యమైన శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి అని భావిస్తోంది సర్కారు. ఇందుకు గాను ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు పలు సార్లు సమీక్షలు నిర్వహించారు.

01/14/2017 - 04:06

సికిందరాబాద్, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో మహిళలు, చిన్నారుల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం నగరం సగానికిపైగా ఖాళీ అవుతుందంటే సంక్రాంతి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయాణికుల రద్దీని తెలుసుకోవచ్చు.

01/14/2017 - 04:01

సంక్రాంతి వెలుగులతో తెలుగు రాష్ట్రాలు కొంగొత్త అందాలు సంతరించుకున్నాయ. ముంగిట్లో గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొమ్మదాసరుల అతిశయోక్తులతో పండుగవేళ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయ..

సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లకు శుభాకాంక్షలు.
- ఎడిటర్

పండుగ సందర్భంగా శనివారం మా కార్యాలయానికి సెలవు. ఆదివారం సంచిక వెలువడదు.

Pages