S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2017 - 03:31

మహబూబ్‌నగర్, జనవరి 13: కర్వెన రిజర్వాయర్ నుండే నారాయణపేట నియోజకవర్గంతో పాటు ఇటీవల వికారాబాద్ జిల్లాలో కలిసిన కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.

01/14/2017 - 03:29

వరంగల్, జనవరి 13: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారే తప్ప ఇవన్నీ ఇచ్చేందుకు అవకాశం ఉన్న రాజ్యాధికారం గురించి ఆలోచించటం లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇతరుల ఓట్లు ఎలా ఉన్నా బిసిల ఓట్లు బిసి అభ్యర్థులకు వేసుకుంటే విజయం తథ్యమని, అధికారం తప్పదనే విషయాన్ని గమనించాలని సూచించారు.

01/14/2017 - 03:26

సిద్దిపేట, జనవరి 13: మల్లన్నసాగర్‌లో నకిలీ పట్టాలు, పాస్‌బుక్కులు సృష్టించి కోట్లాది రూపాయలు పరిహారం కాజేయాలని పథకం పన్నిన మాయగాళ్లు, వారికి సహకరించిన రెవిన్యూ సిబ్బంది పాత్రపై దర్యాప్తునకు సైబర్ టీం రంగంలోకి దిగింది. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. సిపి శివకుమార్ నేతృత్వంలో సైబర్‌క్రైం ప్రత్యేక బృందంతో పాటు మరో టీమ్‌ను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది.

01/14/2017 - 03:24

సంగారెడ్డి, జనవరి 13: రైతులు పండించిన కందులకు నాణ్యమైన మద్దతు ధరను ప్రకటించి మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఆగ్రహించిన మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు మొత్తం 16 మంది అధికారులకు చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

01/14/2017 - 03:23

హైదరాబాద్, జనవరి 13:తెలంగాణ రవాణాశాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రమాదరహిత రాష్ట్రంగా రూపొందిస్తామని రోడ్డు రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు భద్రత లోగోను, రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

01/14/2017 - 03:21

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆది దంపతులకు రావణ వాహన సేవ నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ఆశీనులను చేశారు.

01/14/2017 - 03:20

నల్లగొండ, జనవరి 13: ఖైదీ నెంబర్ 150 సినిమాను థియేటర్‌లో అక్రమంగా సెల్‌ఫోన్‌తో వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టి విక్రయిస్తున్న ఇరువురిని అరెస్టు చేసినట్లుగా నల్లగొండ డిఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈకేసు వివరాలను వెల్లడించారు.

01/14/2017 - 03:19

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ నగరశివారులోని పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 28 ప్రైవేట్ బస్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

01/14/2017 - 03:09

విజయవాడ, జనవరి 13: కుటుంబం సంతోషంగా వుండాలంటే, అందులోని సభ్యులు ఆరోగ్యంగా వుండాలి, ఆరోగ్యంగా వుండాలంటే పోషక విలువలున్న పదార్ధాలు తినాలి. ఇదే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వికాసం-సమాజ వికాసం పేరుతో నాలుగో విడత జన్మభూమిని ఇటీవలే నిర్వహించారు.

01/14/2017 - 03:07

విజయవాడ, జనవరి 13: వెలగపూడి సచివాలయం వద్ద హెలిపాడ్ నిర్మాణానికి వివిధ శాఖలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో నేలపాడులో ప్రత్యామ్నాయంగా హెలిపాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వెలగపూడి సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తుండటంతో సిఎం కార్యాలయం ఉండే బ్లాక్-1కు సమీపంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు.

Pages