S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 02:16

న్యాయప్రవీణులు నిప్పులు కక్కుతున్నారు. ట్విట్టర్ మాలోకం మండిపడుతున్నది. ఎకసెక్కాలు ఆడీ ఆడీ సోషల్ మీడియాకు శోష వచ్చేస్తున్నది. పత్రికలు చదివే, చానెళ్లు చూసే, ట్వీటే, బ్లాగే ప్రతివాడి దృష్టిలో ఇవాళ జస్టిస్ దీపక్ మిశ్రా పాపాల భైరవుడు.

12/03/2016 - 02:04

కొచ్చి, డిసెంబర్ 2: నౌకాదళంలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని, అయితే సామర్థ్యంపై దాని ప్రభావం ఎంతమాత్రం లేదని సదరన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఎ.ఆర్.కావే స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావికా దళాలు సన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

12/03/2016 - 01:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో విచారణలు మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశివ్వాలని కోరుతూ బిజెపి అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

12/03/2016 - 01:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నినాదాలతో శుక్రవారం లోక్‌సభ దద్దరిల్లిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందటూ ప్రతిపక్షాలు ఈరోజు లోక్‌సభను స్తంభింపజేశారు.

12/03/2016 - 01:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రతిపక్షం సైన్యాన్ని వివాదంలోకి లాగటం ద్వారా రాజకీయం చేస్తోందని సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం రాజ్యసభలో ఆరోపించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ రామ్రావ్ భామ్రే ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే 19 చోట్ల శాంతి భద్రతలు, టోల్ గేట్ల నిర్వహణాశిక్షణ చేపట్టిందని వివరించారు.

12/03/2016 - 01:49

కోల్‌కతా/ న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు పెద్ద దుమారానికి తెరలేపింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యను ‘సైనిక కుట్ర’గా అభివర్ణించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైన్యం మోహరింపును నిరసిస్తూ గురువారం రాత్రంతా రాష్ట్ర సచివాలయమైన ‘నబన్నా’లోనే గడిపారు. మరోవైపు, సైనిక కుట్రంటూ మమత చేసిన ఆరోపణలను కేంద్రం శుక్రవారం తీవ్రంగా ఖండించింది.

12/03/2016 - 01:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఎలాంటి విముఖత లేనట్లుగా కనిపిస్తోంది.

12/03/2016 - 01:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సమావేశానికి తొలిసారి యువనేత రాహుల్ గాంధీ సారథ్యం వహించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్య కారణాల వలన శుక్రవారం ఈ సమావేశానికి రాలేకపోవడంతో రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

12/03/2016 - 01:42

అమృత్‌సర్, డిసెంబర్ 2: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం నుంచి ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

12/03/2016 - 01:42

దుబాయి, డిసెంబర్ 2: ప్రపంచ వ్యాప్తంగా 55 వారసత్వ ప్రదేశాలు ప్రమాదపుఅంచున ఉన్నాయని ఐరాస సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ప్రపంచంలో 1,052 వారసత్వ ప్రాంతాలున్నాయి. వీటిలో 55 వారసత్వ సంపదలను ప్రమాదపుజాబితాలో చేర్చారు. వారసత్వ ప్రదేశాల పరిరక్షణకు యునెస్కో చర్యలు చేపట్టింది. 2016 జూలై నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన యునెస్కో 40వ వార్షిక సమావేశంలో మాలి, ఉజ్‌బెకిస్తాన్‌లు వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.

Pages