S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2016 - 06:36

అమరావతి, నవంబర్ 28: పంచారామ క్షేత్రాల్లో అగ్రగామి అమరావతి అమరేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని హిందూ ధర్మరక్షా సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష దిపోత్సవ వేడుకల్లో గుంటూరు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు.

11/29/2016 - 05:24

వేలేరుపాడు/అశ్వారావుపేట, నవంబర్ 28: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కోయిదా గ్రామ సమీపంలో సోమవారం గోదావరిలో స్నానం చేస్తూ ఇద్దరు బాలికలు, ఒక మహిళ మృతి చెందారు. మరో మహిళ గల్లంతయ్యింది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట డ్రైవర్స్ కాలనీకి చెందిన 14మంది సోమవారం కార్తీక మాస విహార యాత్ర నిమిత్తం కోయిదా గ్రామంలోని గోదావరి తీరానికి వచ్చారు.

11/29/2016 - 05:23

విశాఖపట్నం, నవంబర్ 28: సాంకేతికపరమైన సమస్యలు అధిగమించడం, విపత్తుల నుంచి బయటపడేందుకు వీలుగా స్మార్ట్‌సిటీ విశాఖలో తొలిసారి నిర్మించనున్న భూగర్భ విద్యుదీకరణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 7న టెండర్లు తెరుస్తారు. ఆన్‌లైన్ ద్వారా టెండర్లు పిలిచి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారు.

11/29/2016 - 05:22

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారీ రిక్రూట్‌మెంట్ గ్రూప్-2 తొలి కీని ఈనెల 30వ తేదీన ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి కీపై అభ్యర్ధులకు ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి తుది కీని రూపొందిస్తారు. తుది కీ రూపొందించిన నాలుగైదు రోజుల్లో తొలి దశ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధం చేస్తున్నారు.

11/29/2016 - 05:20

కర్నూలు, నవంబర్ 28: తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్చుకునేందుకు జీరో వ్యాపారులు నయా మోసానికి పాల్పడుతున్నారు. ఇంతకాలం ఎలాంటి లెక్కా పక్కా లేకుండా వ్యాపారం చేసి పన్నుల ఎగవేత ద్వారా కూడబెట్టిన నల్ల ధనాన్ని రైతుల సహకారంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

11/29/2016 - 05:19

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తుడిచిపెట్టేలా కనిపిస్తోంది. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఉభయ సభల్లోనూ నోట్ల రద్దు కారణంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితిలో సోమవారం కూడా ఎలాంటి మార్పు రాలేదు. లోకసభ ఉదయం సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు.

11/29/2016 - 05:17

హైదరాబాద్, నవంబర్ 28: నగదు మార్పిడిలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సిబిఐ నగరంలోని పలు పోస్ట్ఫాసుల్లో తనిఖీలు చేపట్టింది. కొన్ని పోస్ట్ఫాసుల్లో నగదు మార్పిడిలో అవకతవకలు జరిగినట్టు సిబిఐ గుర్తించింది. నోట్ల మార్పిడికి సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారంటూ హిమాయత్‌నగర్ (హైదరాబాద్) పోస్ట్ఫాసు కార్యాలయ సిబ్బందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.

11/29/2016 - 05:16

న్యూఢిల్లీ/ తిరువనంతపురం, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు మూలంగా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్, ఆందోళన కార్యక్రమాల పిలుపులతో సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది.

11/29/2016 - 04:54

హైదరాబాద్, నవంబర్ 28: రబీ సాగుకు నీటి విడుదల ప్రణాళికను నీటిపారుదల శాఖ ఖరారు చేసి సోమవారం ప్రకటించింది. ప్రాజెక్టుల వారీగా సాగు చేసే ఆయకట్టు, వాటికి అవసరమైన నీటి కేటాయింపులను నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి ప్రకటించారు. ఈమేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.

11/29/2016 - 04:43

హైదరాబాద్, నవంబర్ 28: శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నుంచి నిర్వహించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు నిర్వహించుకోలేకపోయామని అన్నారు. వర్షాకాల, శీతాకాల సమావేశాలు కలిపి డిసెంబర్‌లో జరుగుతాయన్నారు. అయితే, తేదీ ఇంకా ఖరారు కాలేదని వెల్లడించారు.

Pages