S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2016 - 07:51

హైదరాబాద్, నవంబర్ 28:కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో నగదు విత్‌డ్రా కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఏటిఎంలలో నగదు అందుబాటులో లేకపోవటం, ఉన్న ఏటిఎంలలో కేవలం రూ. 2వేల నోటు మాత్రమే లభ్యం కావటంతో చిల్లర సమస్య నగరవాసులను ఇంకా వెంటాడుతోంది. ముఖ్యంగా ఏటిఎంలలో ప్రతిరోజు రూ. 2వేల వరకు, అలాగే బ్యాంకు ఖాతాల నుంచి వారానికి రూ.

11/29/2016 - 07:47

వరంగల్, నవంబర్ 28: విదేశాలలో దాచిన నల్లడబ్బును దేశానికి తిరిగి రప్పించటంలో విఫలమైన ప్రధానమంత్రి మోడీ నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టే పేరుతో పెద్దనోట్లను రద్దు ద్వారా ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం కార్పొరేటు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా, సామాన్య ప్రజలకు సమస్యగా మారిందని అన్నారు.

11/29/2016 - 07:44

హైదరాబాద్, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దుతో తగ్గిన రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రమే పూడ్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రధాన మంత్రిని కలిసి అందజేసిన లేఖలోని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మీడియాకు విడుదల చేశారు.

11/29/2016 - 07:35

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్లకు 78

11/29/2016 - 07:33

హామిల్టన్, నవంబర్ 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తిని రేకిత్తిస్తున్నది. న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 313 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ అద్భుత సెంచరీతో కదంతొక్కాడు. అతని ప్రతిభతో కివీస్ మెరుగైన స్కోరును నమోదు చేయగలిగింది.

11/29/2016 - 07:33

మకావూ, నవంబర్ 28: గత వారం చైనా ఓపెన్‌లో టైటిల్‌ను సాధించి, ఆతర్వాత హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌పై కనే్నసింది.

11/29/2016 - 07:32

జాగ్రెబ్, నవంబర్ 28: డేవిస్ కప్ పురుషుల టీం టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను అర్జెంటీనా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. 1900లో మొదలైన ఈ టోర్నీని అర్జెంటీనా 3-2 తేడాతో క్రొయేషియాను ఓడించి తొలిసారి తన ఖాతాలో వేసుకుంది. కీలక మ్యాచ్‌ల్లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, ఫెడెరికో డెల్ బొనిస్ ప్రత్యర్థులను ఓడించి, అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

11/29/2016 - 07:32

న్యూఢిల్లీ, నవంబర్ 28: సుప్రీం కోర్టుకు లోధా కమిటీ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్‌పై చర్చించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) డిసెంబర్ 2న జరిగే అవకాశాలున్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డుకు చెందిన ఒక అధికారి సోమవారం పిటిఐతో మాట్లాడుతూ లోధా కమిటీ స్టేటస్ రిపోర్ట్ తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించనున్నట్టు తెలిపాడు.

11/29/2016 - 07:27

న్యూఢిల్లీ, నవంబర్ 28: బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 16 రోజుల తర్వాత సోమవారం తిరిగి తెరుచుకున్న బులియన్ మార్కెట్‌కు పెద్ద షాక్‌నిస్తూ 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,750 రూపాయలు క్షీణించింది. కేవలం ఒక్కరోజే ధర ఇంతగా దిగజారడంతో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 29,400 రూపాయలకు, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 29,250 రూపాయలకు పడిపోయాయి. వెండి ధర కూడా విపరీతంగా నష్టపోయింది.

11/29/2016 - 07:26

ముంబయి, నవంబర్ 28: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం మరో 30 పైసలు క్షీణించి 68.76 రూపాయలకు చేరింది. శుక్రవారం 68.46 రూపాయల వద్ద ముగిసినది తెలిసిందే. దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్.. రూపాయి విలువ దిగజారడానికి దారితీసింది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న సంకేతాలు..

Pages