S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2016 - 06:59

‘కలలు కనండి’ అని దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం విద్యార్థులకు సలహా ఇచ్చినట్టు, ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ కలలు కనండి’ అంటూ జాతికి సందేశం ఇస్తున్నారు. డిజిటల్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు. అమెరికా, ఐరోపా దేశాల్లో జేబులో డబ్బు పెట్టుకోకుండానే మొత్తం లావాదేవీలు ఆన్‌లైన్ మీదనే సాగిపోతాయి.

11/29/2016 - 06:52

న్యాయమండలి ‘ఇవ్వని’ ఉత్తరువులను ‘హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ’ వారు చిత్తశుద్ధితో అమలు చేస్తుండడం అక్రమ నిర్మాణాల చరిత్రలో వర్తమాన ఘట్టం! అక్రమ నిర్మాణాలను సక్రమ నిర్మాణాలుగా చిత్రీకరించి వాటిని చట్టబద్ధం చేయడానికి వీలుగా ఈ ఊహాజనితమైన ఉత్తరువులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-హెచ్‌ఎమ్‌డిఎ-వారు అమలు చేస్తున్నారట!

11/29/2016 - 06:46

హైదరాబాద్, నవంబర్ 28: మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఆలస్యం చేశాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

11/29/2016 - 06:44

హైదరాబాద్, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దుపై జనం నిరసన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా సోమవారం వివిధ పార్టీలు నిర్వహించిన ‘బంద్’ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, వామపక్షాలు ఎవరికి వారే నిర్వహించడం వల్లే బంద్ విజయవంతం కాలేదు. జంట నగరాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌లో పాల్గొనలేదు. సినిమా హాళ్లు, విద్యా సంస్థలు మూత పడలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

11/29/2016 - 06:42

జనగామ టౌన్, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం భారీగా పెద్ద నోట్లు దాచుకున్న వారి పాలిట శాపంగా మారింది. తాజాగా జనగాంలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీల్లో రూ.30లక్షల విలువైన రద్దయిన పెద్ద నోట్లు పట్టుబడినట్లు జనగామ డిసిపి తేజావత్ వెంకన్న సోమవారం సాయంత్రం వెల్లడించారు. స్థానిక ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డబ్బులను తరలిస్తున్న నిందితుడితో పాటు నగదును చూపించారు.

11/29/2016 - 06:41

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏడాదిలోగా యుద్ధప్రాతిపదికన నిర్మించిన ప్రభుత్వం, పేదలకోసం ఉద్దేశించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపథకాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోందడరాం ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వాస్తవంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఇప్పటికే ఒక భవనం ఉందన్నారు.

11/29/2016 - 06:39

చింతూరు, నవంబర్ 28: నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం, పరిహారం అందించాకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సిపిఎం పాలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ డిమాండ్‌చేశారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్నవారికి పునరావాస కల్పన, పరిహారం అందజేతలో జరుగుతున్న జాప్యం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

11/29/2016 - 06:38

న్యూఢిల్లీ, నవంబర్ 28: కేంద్రం ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు థర్నాలో పాల్గొన్నారు.

11/29/2016 - 06:37

అమరావతి, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ రాష్ట్రంలో విఫలమయింది. కొన్ని విద్యాసంస్థలు మినహా మిగిలినవన్నీ యథావిధిగా పనిచేశాయి. అయితే ముందుజాగ్రత్తగా రాజకీయ పార్టీల నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

11/29/2016 - 06:36

విజయవాడ, నవంబర్ 28: రాష్టవ్య్రాప్తంగా వంద శాతం విద్యుత్, వంద శాతం గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లే నూటికి నూరుశాతం సాగునీరు రైతులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. నీరు-ప్రగతిపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages