S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2016 - 07:25

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు చెందిన మెన్స్‌వేర్ బ్రాండ్.. పీటర్ ఇంగ్లాండ్ స్టోర్లలో ఇక ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ దుస్తులు అమ్మనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి చేనేత కార్మికులతో కలిసి కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, డెవలప్‌మెంట్ కమిషనర్ హాండ్లూమ్స్, పీటర్ ఇంగ్లాండ్ ఈ ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ కలెక్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

11/29/2016 - 07:24

ముంబయి, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ చివర్లో కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33.83 పాయింట్లు పుంజుకుని 26,350.17 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.60 పాయింట్లు పెరిగి 8,126.90 వద్ద నిలిచింది. టెలికామ్, పవర్, రియల్టీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

11/29/2016 - 07:23

కాకినాడ, నవంబర్ 28: ఆరేళ్ల క్రితం నాటి అందరి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రికార్డులను బయటకు తీసి, ఇప్పుడు చేస్తున్న డిపాజిట్లతో పోల్చి లెక్కలు కడతామని విశాఖ జోన్-2 ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సి ఓంకారేశ్వర్ స్పష్టం చేశారు.

11/29/2016 - 07:18

కోల్‌కతా, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోకపోతే అధికార పీఠంనుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపేందుకు ఆయన నివాసం ఎదుటే నిరసన ప్రదర్శన నిర్వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.

11/29/2016 - 07:16

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్య ప్రజల ఉసురు పోసుకుంటున్నారని వామపక్షాలు ఆరోపించాయి. జన ఆక్రోశ్ దివస్‌లో భాగంగా సిపిఎం, సిపిఐలతో సహా ఏడు వామపక్షాల నేతలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశంలో అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని మోదీ సృష్టించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

11/29/2016 - 07:15

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను పెంపొందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇప్పటికే దేశంలో నగదు అన్నదే లేదని ఎద్దేవా చేశారు. 86 శాతం పెద్దనోట్ల రద్దు కారణంగా ఎవరి దగ్గరా చిల్లిగవ్వ కూడా లేకుండా పోయిందని, నగదు రహిత భారతానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏమిటని ఆయన అన్నారు.

11/29/2016 - 07:15

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఇపిఎఫ్‌ఓ ప్రకటించింది. జనవరి 15లోగా యాభై లక్షల మంది పెన్షనర్లు తమ జీవన సర్ట్ఫికెట్‌ను సమర్పించవచ్చునంటూ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇపిఎఫ్‌ఓ అధికారి తెలిపారు.

11/29/2016 - 07:08

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతగా ప్రగతి సాధించినప్పటికీ సమాజంలో ఇంకా అనేక మూఢాచారాలు కొనసాగుతున్నాయి. జంతుబలుల్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఏనాడో చట్టం చేసింది. ఈ చట్టంపై అధికారులు ఎలాంటి ప్రచారం చేయడం లేదు. జాతరలు, గ్రామదేవతల పండుగల సందర్భంగా మూగజీవాలను పెద్దఎత్తున బలి ఇస్తున్నారు. సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థలు, జీవకారుణ్య సంఘాల వారు జంతుబలుల నిషేధానికి ఉద్యమించాల్సి ఉంది.

11/29/2016 - 07:07

దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ‘పెద్దనోట్ల రద్దు’ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో అధికారికంగా ఒక ప్రకటన చేస్తే బాగుండేదన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘నోట్ల రద్దు’ నిర్ణయంపై ప్రధాని తనకు తానుగా ఉభయ సభల్లో వివరణ ఇచ్చి ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టమయ్యేది.

11/29/2016 - 07:05

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు యువతలోనే ఉన్నాయి. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు- అన్న వివేకానందుడి మాటలు విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యం. అయితే, టెక్నాలజీని తమ చదువు, కెరీర్ కోసం కాకుండా కేవలం కాలక్షేపానికి వినియోగిస్తూ ఎందరో విద్యార్థులు తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్లపై విపరీతమైన వ్యామోహమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

Pages