S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2016 - 23:54

శివుడు త్రిపురాసురుల భార్యల చెక్కిళ్ల రచించబడిన గజాకార మకరాకార కస్తూరికా పత్రములు తుడిచిపెట్టినవాడు. జలంధరాక్షసుడి హృదయ గర్వాన్ని నాశనం చేసినవాడు. గజాసురుడి శిరోగ్రభాగాన్ని అణచివేసినవాడు. ధక్షుడి అధ్వరం అనే లేడిని చంపడంలో క్రూరమైనవాడు.

11/27/2016 - 23:53

‘‘అవ్వ పేరే ముసలమ్మ అబ్బాయిగారూ! ఇంతకుముందు మీరన్నారే.. భార్యాభర్తలు ఒకరి మనసులోకి మరొకరు పరకాయ ప్రవేశం చేయాలని. చెప్పాలంటే స్నేహం మాత్రమే చేస్తున్నామనే భ్రమలో.. మీరిప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నారు.
నా అంచనా నిజమైతే.. మీరు స్నేహమనుకుంటున్న మీ పరిచయం మున్ముందు ప్రేమగా రూపాంతరం చెంది అతి త్వరలోనే మీరూహించని మలుపులు తిరిగే అవకాశం నా కళ్లక్కట్టినట్టుగా గోచరిస్తోంది’’ అన్నాడు గౌతమ్.

11/27/2016 - 23:50

మ తలమీదం గుసుమ ప్రసాద మలిక స్థానంబుపై భూతియున్
గళసీమంబున దండనాసిక తుదన్ గంధప్రసారంబులో
పల నైవేద్యము జేర్చు నే మనుజుడా భక్తుండు నీకెపుడుం
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!

11/27/2016 - 23:27

ఆమె
రోడ్డు మధ్యలో
జడుసుకుంటూ బతికే జనం మధ్యలో
అర్ధనగ్నంగా...
అడ్డొచ్చిన గుడ్డలను పీకేస్తూ
గౌరవం ముసుగేసుకున్న మనుషుల
మీదకు విసిరేస్తోంది
విలాసంగా వికారాలను
దాచుకున్న మగాళ్లను కడిగేస్తోంది
ఆచ్ఛాదన లేని ఆ దేహం
అందరి అమ్మలాగే ఉంది

అది రాయైనా, రప్పైనా
రాటుదేలిన మాటైనా
పరికించి చూసే పురుషుల మీదకు
విసురుతూనే ఉంది

11/27/2016 - 23:25

పచ్చి పచ్చి తాటికమ్మలు
పెద్ద పెద్ద బండరాళ్లను నెత్తికెత్తుకుని
సచ్చిపుట్టిన
తాటి కమ్మల బతుకు చిత్రం నాది
గుడిసె కొనగొమ్ము మీద
గోనెసంచి కట్టుకుని
సుతిలబద్ద పట్టుకున్న అయ్య
రుషి లెక్కనే మాట్లాడుతడు
నేనేమో
గుడిసెకన్ని సక్క సక్కటి వాసాలు
వెట్టాలని అంటా
తానేమో
వంకర దాని దాపున సంకటిది
సంకటి దాని దాపున వంకరది

11/27/2016 - 23:23

ఈ రాత్రి ననె్నలా నిద్రపుచ్చుతుంది?

సౌకర్యాల లేపనం రాసుకున్న ఒంటికి
చెమట చుక్క బరువైన వాడిని
పట్టిందల్లా బంగారంగా మెరిసి
నడమంత్రంగా అందలమెక్కిన వాడిని
చుట్టూరా పచ్చనోట్ల రెపరెపల గాలులకు
ఉల్లాసంగా పరవశాల ఊయలలూగిన వాడిని

అయినా ఈ రాత్రి నేనెలా నిద్రపోవాలి?

11/27/2016 - 23:20

కథావస్తువులో వైవిధ్యం కనబరుస్తున్న కథలు వస్తూనే వున్నాయి. కాని బహు స్వల్ప సంఖ్యలో వున్నాయి. రచయితలు యింకా నేల-నీరు వదలి, గాలి-వెలుతురు- ఆకాశ అవకాశాల వయిపు అలవోకగా పరుగులు తీయలేకపోతున్నారు. భౌతికతను అధిగమించి, మానసికత- బౌద్ధికత- ఆత్మీయత వయిపు చేతులు చాచలేకపోతున్నారు.

11/27/2016 - 23:18

తెలుగు పరిమళం
పేజీలు: 74 వెల: రూ.75/-
ప్రతులకు :
వూటుకూరి కృపారాణి;
12/29/1, అశోక్‌నగర్,
కొయ్యలగూడెం, ప.గో.జిల్లా- 534312
అన్ని పుస్తకాల షాపుల్లోనూ...

11/27/2016 - 23:34

అమెరికా, న్యూజిలాండ్‌లోని ఆదిమ తెగల్లాగే హిందూ జాతి కూడా
అంతరించి పోతుందని లెఫ్టినెంట్ కల్నల్ యు.ఎన్.ముఖర్జీ నూరేళ్లకు పూర్వమే ప్రమాద ఘంటిక
మోగించాడు. దానికి స్పందించే స్వామి శ్రద్ధానంద శుద్ధి, సంగఠన్ లను మహోద్యమంగా చేపట్టి,
బలవంతంగా మతాంతరీకరణ
అయినవారిని లక్షల సంఖ్యలో హిందూ ధర్మంలోకి తిరిగి
తీసుకొచ్చాడు.

11/27/2016 - 22:55

అండర్ వరల్డ్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అండర్‌వరల్డ్ బ్లక్‌వార్స్ 3డి పేరుతో రూపొందుతున్న చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది అన్నా పోర్‌స్టర్. హాలీవుడ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ విడుదల చేస్తోంది.

Pages