S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/28/2016 - 00:35

మొహాలీ, నవంబర్ 27: ఇక్కడి పిసిఎ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ను 283 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 271 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే కేవలం 12 పరుగులు వెనుకంజలో ఉన్న భారత్ చేతిలో నాలుగు వికెట్లున్నాయి. దీనితో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించడం ఖాయంగా కనిపిస్తున్నది.

11/28/2016 - 00:31

మొహాలీ, నవంబర్ 27: భుజం గాయంతో బాధపడుతున్న భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను మెరుగైన చికిత్స కోసం టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. మొహాలీలో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు ప్రారంభానికి ముందు, నెట్స్‌లో ఆడుతున్న సమయంలో పాండ్య గాయపడ్డాడు.

11/28/2016 - 00:30

మెల్బోర్న్, నవంబర్ 27: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు మలేసియాను 4-1 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగితే, మలేసియా గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే బీరేంద్ర లాక్రా భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు.

11/28/2016 - 00:29

మొహాలీ, నవంబర్ 27: ఇంగ్లిండ్‌తో వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి మొదలయ్యే నాలుగో టెస్టుకు ఓపెనర్ లోకేష్ రాహుల్ అందుబాటులో ఉంటాడని బిసిసిఐ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఎడమ చేతికి గాయమైన కారణంగా అతను మూడో టెస్టులో ఆడడం లేదు. అయితే, వైద్య పరీక్షల అనంతరం అతను త్వరగానే కోలుకునే అవకాశాలున్నట్టు తెలిసిందని బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

11/28/2016 - 00:29

కౌలూన్, నవంబర్ 27: హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళలు, పురుషుల విభాగాల్లో జరిగిన ఫైనల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సమీర్ వర్మ తడబడ్డారు. ఆఖరి యుద్ధాన్ని జయించలేక, రజత పతకాలతో సంతృప్తి చెందారు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు వరుస సెట్లలో ఓడితే, జాతీయ చాంపియన్ సమీర్ ఒక సెట్‌ను గెల్చుకొని, మ్యాచ్‌ని మూడు సెట్ల వరకు తీసుకెళ్లాడు.

11/28/2016 - 00:29

మెల్బోర్న్, నవంబర్ 27: ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు ఆదివారం జరిగిన చివరి, మూడో టెస్టులో 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సిరీస్‌లో చెరొక విజయాన్ని సాధించిన భారత్, ఆస్ట్రేలియా మహిళలు చివరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగారు. ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆడడంతో మొదటి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

11/28/2016 - 00:28

అడెలైడ్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెలు కున్న ఆస్ట్రేలియా పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థి చేతిలో వైట్‌వాష్ వేయంచుకునే దుస్థితి నుంచి బ యటపడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు సాధించింది.

11/28/2016 - 00:28

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత బాక్సర్ వికాస్ క్రిష్ణకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అవార్డు లభించనుంది. వచ్చేనెల 20న జరిగే వార్షిక సమావేశంలో ‘ఉత్తమ బాక్సర్’ అవార్డును బహూకరిస్తామని వికాస్‌కు రాసిన లేఖలో ఎఐబిఎ తెలిపింది.

11/28/2016 - 00:27

హామిల్టన్, నవంబర్ 27: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో బాబర్ ఆజమ్ ఆదుకోవడంతో పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయగలిగింది. అయితే, న్యూజిలాండ్ కంటే 55 పరుగులు వెనుకంజలో నిలిచింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

11/27/2016 - 23:55

ఈ ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడింది. ఒక దేశంలో పుట్టి పెరిగినవారంతా ఒక జాతివారు. అయినా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు చెందినవారు జాతీయ భావనచే ప్రభావితులై ఒక దేశ వాసులుగా మెలుగుతున్నారు. జాతీయ సంస్కృతికి మారుపేరయినది.

Pages