S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/28/2016 - 08:15

వ్యాపారం పేరుతో వచ్చి, మన దేశాన్ని ఆక్రమించుకుని నూట యాభై ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. వారు అక్కడితో ఆగలేదు. తమదైన సంస్కృతీ ధర్మాలపై భారతీయుల్లో ఉన్న నిష్ఠను దెబ్బతీసేందుకు ‘మెకాలే’ విద్యా విధానాన్ని బలవంతంగా రుద్దేరు. ఈ దశలోనే వక్రీకరించిన మన దేశ చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు.

11/28/2016 - 08:14

రెండు వేల రూపాయల కొత్త నోటు కూడా చెలామణి కాని అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. పది, ఇరవై, ఏభై, వంద నోట్లను అధిక సంఖ్యలో ముద్రించినా చిల్లర కొరత లేకుండా పోయేది. రోజువారి కొనుగోళ్లు సజావుగా సాగేవి. పౌరజీవనం స్తంభించేది కాదు. చేతిలో డబ్బుండి కూడా వస్తువుల్ని కొనలేక, ప్రయాణాలు చేయలేక, చెల్లింపులు జరక్క జనం పడుతున్న ఇబ్బంది యుద్ధ కాలాన్ని తలపిస్తున్నాయి.

11/28/2016 - 08:12

ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్- కెఎల్‌ఎఫ్- అన్న బీభత్స ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు పంజాబ్‌లోని ‘నాభా’ జైలు నుంచి తప్పించుకోగలగడం హైదరాబాద్‌లో ముగిసిన మూడు రోజుల డిజిపిల సదస్సుకు సమాంతర పరిణామం! డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్- డిజిపిల- సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ‘ఖలిస్తాన్’ విద్రోహులు జైలు నుంచి బయటపడడానికి వ్యూహరచన చేసినట్టు వెల్లడి కావడం విచిత్రమైన వ్యవహారం.

11/28/2016 - 07:54

విశాఖపట్నం, నవంబర్ 27: విపత్తులను ఎదుర్కొనేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సన్నద్ధమైంది. ఇందులో భాగంగా పది భారీ విద్యుత్ టవర్లను సమకూర్చుకుంది. వీటిని అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకురాగా, అక్కడ నుంచి విశాఖ కలపాకలో ఉన్న 400 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తరలించారు.

11/28/2016 - 07:53

బైరెడ్డిపల్లె, నవంబర్ 27: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ సమీపంలో ఒక మలుపు వద్ద ఆదివారం ఒక కంటైనరు, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వి.కోట నుంచి రెవెన్యూ ఉద్యోగులు బొలెరో వాహనంలో మదనపల్లెలో జరిగే రెవెన్యూ సంఘం ఎన్నికల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

11/28/2016 - 07:52

రాజమహేంద్రవరం, నవంబర్ 27: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు, అటు కృష్ణా డెల్టాలకు గోదావరి జలాలను అందించడం వల్ల రూ.250 కోట్ల విలువైన పంట దక్కిందని, అటువంటి ప్రాజెక్టయిన వట్టిసీమను విమర్శించిన నాయకులు ఇపుడు ఏమంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని అన్నారు.

11/28/2016 - 07:52

హైదరాబాద్, నవంబర్ 27: నోట్ల రద్దుపై గగ్గోలు పెడుతున్న విపక్షాలకు ప్రజల మద్దతు లేకపోవడం వల్లనే బంద్‌ను విరమించుకున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకే ప్రధాని మోదీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

11/28/2016 - 07:51

విజయవాడ, నవంబర్ 27: అబద్దాల అమిత్‌షా.. మోసకారి మోదీ... మధ్య వారధిలా వెంకయ్య అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ముంచుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. పిసిసి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సభ గురించి ప్రస్తావిస్తూ అబద్ధాలు చెప్పిపోవడానికే అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని అన్నారు.

11/28/2016 - 07:49

హైదరాబాద్, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వౌన ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదని, ఇబ్బందుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

11/28/2016 - 07:35

న్యూఢిల్లీ, నవంబర్ 27: పేదల బ్యాంకు ఖాతాలను ఆసరా చేసుకుని తమ అక్రమ సొత్తును డిపాజిట్ చేసే వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేలాది కోట్ల రూపాయలు జమ అయ్యాయంటూ వచ్చిన కధనాల నేపథ్యంలో మాట్లాడిన మోదీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపారు.

Pages