S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 08:50

మొహాలీ, నవంబర్ 24: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు కళ్లెం వేయడానికి ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతున్నది. ప్రత్యేక వ్యూహంతో అతనిని నియంత్రిస్తామని, సాధ్యమైనంత త్వరగా అవుట్ చేస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అన్నాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాకాగా, విశాఖపట్నం టెస్టులో ఇంగ్లాండ్ 246 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.

11/25/2016 - 08:49

కౌలూన్, నవంబర్ 24: హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. రెండో రౌండ్‌లో ఈ ఇద్దరు హైదరాబాదీలు తమతమ ప్రత్యర్థుల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని నిలబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి, గత వారం చైనా ఓపెన్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో రౌండ్‌లో హు యాచింగ్‌ను 21-10, 21-14 తేడాతో ఓడించింది.

11/25/2016 - 08:42

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ‘మిషన్ మోడ్’లో శరవేగంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బ్యాంకులకు సూచించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించడమేనని ఆయన స్పష్టం చేశారు.

11/25/2016 - 08:40

న్యూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూపే డెబిట్ కార్డులపై గత వారమే ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు)ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తాజాగా మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై కూడా ఎండిఆర్‌ను మాఫీ చేసింది.

11/25/2016 - 08:40

ముంబయి, నవంబర్ 24: వరసగా రెండు రోజులు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున తరలివెళ్లిపోతుండడంతో డాలరుతో రూపాయి గతంలో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో సెనె్సక్స్ 192 పాయింట్లు నష్టపోయి 26,000 పాయింట్ల దిగువకు పడిపోయింది.

11/25/2016 - 08:39

విజయవాడ, నవంబర్ 24: పరిశ్రమలు రాకుండా మోకాలడ్డుతున్న అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులు సహా అనేక సంస్థలు ముందుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లకుబలపాలు కట్టుకుని చేస్తున్న విదేశీ పర్యటనలకు స్పందన లభిస్తోంది.

11/25/2016 - 08:38

ముంబయి, నవంబర్ 24: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభావం, సమీప భవిష్యత్తులోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు పెరిగిన నేపథ్యంలో డాలరుతో రూపాయి గురువారం దారుణంగా పడిపోయింది. ఒక దశలో డాలరుకు 68రూపాయల 86 పైసల స్థాయికి పడిపోయింది. అయితే రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో కాస్తకోలుకుని రూ. 68.73 స్థాయి వద్దముగిసింది. 39 నెలల కాలంలో డాలరుతో రూపాయి ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.

11/25/2016 - 08:38

హైదరాబాద్, నవంబర్ 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో సింగరేణి నుంచి మరో పది లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర జెన్కో తాజాగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర జెన్కో ఉన్నతాధికారి అరవింద్ కె.చంద్రగడే, సింగరేణి జనరల్ మేనేజర్ బి.కిషన్‌రావు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.

11/25/2016 - 08:37

న్యూయార్క్, నవంబర్ 24: ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులకు పోలయిన ఓట్లను తారుమారు చేసేందుకు సైబర్ దాడి జరగలేదని నిర్ధారించుకోవడానికి కీలక రాష్ట్రాలయిన విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రీకౌంట్‌ను కోరాలని ఎన్నికల న్యాయవాదులు, డేటా నిపుణులు హిల్లరీ క్లింటన్‌కు సలహా ఇచ్చారు.

11/25/2016 - 08:36

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లపై చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారంటూ ప్రతిపక్షం గురువారం రాజ్యసభను స్తంభింపజేసింది. నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే భోజన విరామం తరువాత ఆయన సభకు రాకపోవడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంత సేపూ మోదీ రాజ్యసభలో ఉండాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు.

Pages