S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 04:08

భూగర్భంలో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను శాస్ర్తియ విధానంలో విచక్షణాయుతంగా వెలికితీయడం ద్వారా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర మంత్రిమండలి ఇటీవల ‘నూతన జాతీయ ఖనిజానే్వషణ విధానాని’కి ఆమోదముద్ర వేయడంతో భారతీయ గనుల రంగంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సహజ వనరుల వెలికితీతలో ఖనిజానే్వషణ, ఖనిజ విలువల మదింపులదే ప్రధాన పాత్ర.

11/26/2016 - 04:03

సమావేశాల్లో నోట్లరద్దుపై చర్చ జరిగితే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకుల అవినీతి బాగోతాలు బయటపడతాయి. వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ప్రతిపక్షాలకు ఏర్పడతాయ. పార్లమెంట్‌లో మోదీ వాదనాపటిమకు దీటుగా సమాధానం చెప్పే నాయకులు లేరు. చర్చ జరిగితే ప్రజల ముందు చులకన అయిపోతామన్న భయం విపక్షాలకు ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి అమలుచేసిన ఏకైక కార్యక్రమం- సమావేశాలు జరగకుండా చూడడం.

11/26/2016 - 04:00

పెద్ద కరెన్సీ నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం గు రించి ‘పరపతి అంచనాల సంస్థ’- మూడీస్- నిర్ధారణలను చేస్తుండడం మన అంతర్గత వ్యవహారాలలో విదేశీయుల జోక్యానికి మరో నిదర్శనం. వెయ్యి రూపాయల, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసిన తరువాత రూపాయి విలువ మరింతగా పడిపోతుంది. దానికి ప్రధాన కారణం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ అమలు చేస్తున్న ఆర్థిక బీభత్స వ్యూహం!

11/25/2016 - 23:35

‘అఘ’మనగా సంస్కృత భాషలో పాపము అని అర్థము. ‘మర్షణ’ అంటే పోగొట్టుకొనుట. మంత్రాలు పఠిస్తే చేసిన పాపాలు పోవు. కాని పాపం చేయకుండా ఉండటానికి దోహదపడతాయ. ఋగ్వేదములోని దశమ మండలములో అఘమర్షణ సూక్తం వివరించబడినది. సస్వర యుక్తంగా వేద పఠనము చేసే వేద పండితులు ‘అధ అఘమర్షణ సూక్తమ్’ అంటూ ఈ సూక్తాన్ని పఠిస్తారు. కేవలం మూడు మంత్రాలుగల అతి చిన్న సూక్తం ఇది. అయినప్పటికిని సృష్టిరచనను ఎంతో సంక్షిప్తంగా తెలుపుతుంది.

11/25/2016 - 23:33

వేణిచొళ్లెమున్ను, పట్టుదట్టీయున్ను, రక్షకై కట్టిన పసిడి తాయెతులున్ను, కంఠహారాలున్ను, కాలిమట్టెల పైడికాంతులున్ను, లీలా విలాసపు పెంపు అతిశయింపజేయగా ఆ చంద్రుడు తన విద్యాభ్యాసన కాలంలో పునః పునః తార నిడుదవాలిన కన్నులకు కన్నుల పండుగ చేస్తూ వుంటాడు.

11/25/2016 - 23:32

స్ర్తిపురుషుల మనస్తత్వాల్లో ఉన్న వౌలికమైన తేడాయే దీనికి కారణం. మగాడు ఎదుటివాళ్లు చెప్పిందాంట్లో విషయానికి ప్రాధాన్యత ఇస్తే, ఆడది దానితోపాటు విషయం చెప్పిన విధానానికీ, ఆ విషయపు పుట్టుకకూ, దాని మూలాలకూ సంబంధించిన కారణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
అందుకే నువ్వూ, సాహిత్యా కల్సుకున్న విషయాన్ని ఎవరో మూడో మనిషి ద్వారా తనకు తెల్సినప్పుడు తాను అందరి భార్యల్లా సహజంగానే స్పందించింది.

11/25/2016 - 23:30

గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణ నామంబు బ్ర
త్యహయుం బేర్కొను నుత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే
దహనుం గప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చే
సి హతక్లేశులు గారు గాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా!

11/25/2016 - 22:56

జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులకి ఇచ్చేది గర్భశోకమా? పరీక్షల్లో ఫెయల్ అయ్యామని, ప్రేమ విఫలమైందనే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడితే.. పరీక్షలు మళ్లీ వస్తాయ. ప్రేమ మళ్లీ పుడుతుంది. నీలాంటి కొడుకు లేదా కూతురును ఆ భగవంతుడైనా మళ్లీ తెచ్చిఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. మీరు వారికి ఏమీ ఇవ్వకపోయినా బాధపడరు. అల్పమిచ్చినా అనల్పంగా భావించి ఆనందిస్తారు.

11/25/2016 - 22:56

శెలవు రోజులలోనూ, ఇంకా ఇతర సందర్భాలలోనూ మనలో చాలామంది బయట రెస్టారెంట్లలో తినటానికి మక్కువ చూపిస్తారు. నిజమే, రోజూ తినేది ఇంటి భోజనమే కదా, అప్పుడప్పుడు ఇలా బయట తింటూంటే భలే మజాగా వుంటుంది అని అనుకుంటాం. కానీ అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాలలో అందరికీ అందుబాటులో శుచిగా, శుభ్రతా, ఆరోగ్యకరమైన ఆహారం దొరక్కపోవచ్చు. దానితో ఏది లభిస్తే అది తినేస్తాం. ఒక్కసారికేగా ఏమవుతుందిలే అనుకుంటాం.

11/25/2016 - 22:50

బుగ్గలోడు.. పేరుకు తగ్గట్టే ఎర్రగా, బుర్రగా, బూరెల్లాంటి బుగ్గలతో, పాల వనె్నతో మెరిసిపోతున్నాడు.. పేరూ, గీరూ లేదు వాడికి.. ఒక రోజు అర్ధరాత్రి ఎవరో పసిగుడ్డును తెచ్చి ఊరి మధ్యలో వదిలేశారు.. తెలతెలవారుతుండగా చంటిబిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుండగా అది విని ఊరు ఊరంతా మేల్కొని ఆడి చుట్టూ చేరింది.

Pages