S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 21:18

జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘కావలైవేండామ్’ చిత్రాన్ని తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈప్రేమ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తమిళంలో నిన్న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ- ‘యువతరం మెచ్చే అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది.

11/25/2016 - 21:16

చందన్‌కుమార్, సంగీత చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘లవ్ యు ఆలియా’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ,-‘అందర్నీ ఆకట్టుకునే చక్కని ప్రేమ కథా చిత్రమిది. యువజంట చందన్‌కుమార్, సంగీత చౌహాన్‌లతోపాటు ప్రముఖ నటి భూమిక, సుదీప్, సన్నీలియోన్ ప్రత్యేక పాత్రలు పోషించారు.

11/25/2016 - 21:16

ఖమ్మం క్రియేషన్స్ బ్యానర్‌పై చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మయసభ. ఈ సందర్భంగా చిత్రం శ్రీను మాట్లాడుతూ- ‘ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేయాలని సంకల్పించి ఖమ్మం, కృష్ణా జిల్లా మైలవరం, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి.

11/25/2016 - 21:15

ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చలకు తెరలేపిన వార్త ఇదే. నాచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానితో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా సినిమా చేస్తుందట. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కాదు నిర్మాతగానట. ఆ వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతూ, మరోవైపు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా అడుగులేస్తోంది.

11/25/2016 - 21:14

వికాస్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ-‘ఇదొక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ. చిన్న సినిమా అయినా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది.’అని చెప్పారు.

11/25/2016 - 21:13

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘అఖిల్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా వచ్చి ఏడాదికిపైగా అయినా ఇప్పటికీ అఖిల్ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్‌గా మనం ఫేం విక్రంకుమార్‌కు ఓకె చెప్పాడు.

11/25/2016 - 09:02

ఉయ్యూరు, నవంబర్ 24: జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న నివేశన స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. గురువారం స్థానికంగా ఇళ్లస్థలాల కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం గండిగుంట గ్రామంలో పర్యటించారు.

11/25/2016 - 09:01

విజయవాడ, నవంబర్ 24: ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వినియోగంలో ఇకపై ఇ-కెవైసీని తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇ-కెవైసీ అనుసంధానం ద్వారా ప్రజా సాధికార సర్వేను సంపూర్ణం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

11/25/2016 - 09:00

ఎ కొండూరు, నవంబర్ 24: ఆధ్యాత్మిక శిఖరం, అలుపెరుగని అన్నదాత, భారత్ సేవక్త్న్ర, సమైక్య భారత్ స్వర్ణ పురస్కార్ గ్రహీత, సూఫీ మహనీయులు మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న చీమలపాడులోని ఎఎఎంటికే దర్బార్‌లో పేదలు, వితంతువులు, వృద్ధులకు అన్నదానం, వస్తద్రానం చేస్తున్నట్లు దర్బార్ ట్రస్ట్ కార్యదర్శి ఎండి ఖాజా మొహియుద్దీన్ తెలిపారు.

11/25/2016 - 09:00

తోట్లవల్లూరు, నవంబర్ 24: నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయించేందుకు చేపట్టిన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పోలీసు కేసులకు భయపడేది లేదని పామర్రు డివిజన్ సిపిఎం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు అన్నారు. వల్లూరుపాలెం లంకలో 323 సర్వే నెంబరులోని ప్రభుత్వ భూమిలోకి గురువారం మూడు వందల మంది పేదలు ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో వచ్చి భూమిలో ముళ్లచెట్లు నరికారు.

Pages