S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 04:32

నార్సింగి, నవంబర్ 22: గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే మండల అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపట్టాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వారంవారం నివేదించాలనే సంకల్పంతో (ఎంటిఎం) ప్రతి మంగళవారం నిర్వహించే ప్రత్యేక సమావేశం మొదటిసారిగా గండిపేట మండల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేశారు.

11/23/2016 - 04:32

నార్సింగి, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలపోతున్నాయి. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును రద్దు చేసింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పలు వ్యాపార సంస్థలు అయితే మూతపడే అవకాశాలు వచ్చాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

11/23/2016 - 04:31

మేడ్చల్, నవంబర్ 22: మేడ్చల్ పట్టణంలోని పలు ప్రదేశాల్లో బహిరంగంగా చెత్తవేస్తే జరిమానా తప్పదని నగర పంచాయతీ కమిషనర్ కె. రామిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయా ప్రదేశాల్లో సూచికబోర్డులను ఏర్పాటు చేయించారు. పట్టణ ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహాం నుండి రైల్వేస్టేషన్ వరకు గల రోడ్డుతో పాటు తహశీల్దార్ కార్యాలయం రోడ్డుపై ఎవరైనా బహిరంగంగా చెత్తను పారబోస్తే వారికి రూ.

11/23/2016 - 04:26

హైదరాబాద్, నవంబర్ 22: ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ మరణం తెలుగు రాష్ట్రాలకే కాదు..మొత్తం దేశానికి..సంగీత ప్రపంచానికే తీరనిలోటు అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహన్ అన్నారు.

11/23/2016 - 04:24

మలికిపురం, నవంబర్ 22 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు పద్మశ్రీ, పద్మవిభూషణ్, వెనీలియార్, గానగాంధర్వ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణవార్తతో ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

11/23/2016 - 04:19

సింహాచలం, నవంబర్ 22: కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి మహాస్వాములు మంగళవారం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్ అర్చక పరివారంతో కలిసి స్వాములకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయం బేడమండపంలో ప్రదక్షిణ చేసిన స్వాములు అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. గోదాదేవి సన్నిధిలో స్వాములు హారతులు స్వీకరించారు.

11/23/2016 - 04:17

భద్రాచలం, నవంబర్ 22: భక్తరామదాసు ఆ రాముడిపై కీర్తనలు రచిస్తే వాటికి తన శ్రావ్యమైన గొంతుతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రాణం పోశారు. 2011లో వాగ్గేయకారోత్సవాల సందర్భంగా ఆయన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. రామదాసు కీర్తనలకు వ్యాప్తి, కీర్తి తీసుకువచ్చిన వారు బాలమురళే.

11/23/2016 - 04:15

హైదరాబాద్, నవంబర్ 22: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిలు, ఎన్‌ఐటిలలో అడ్మిషన్ల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటి) డైరెక్టర్ డాక్టర్ ఆర్ వై ఉదయ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

11/23/2016 - 04:15

హైదరాబాద్, నవంబర్ 22: ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడురోజుల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో దేశంలోని వివిధ రాష్ట్రాల డిజిపిల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒక వేళ ప్రధానమంత్రి రాని పక్షంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారు.

11/23/2016 - 04:14

హైదరాబాద్, నవంబర్ 22: ఓటుకు నోటు కేసులో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఏసిపి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఏసిబి కోర్టులో ఈ కేసును విచారించాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తాజా దర్యాప్తుకు ఆదేశించింది.

Pages