S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/31/2016 - 00:26

అనంతపురం, ఆగస్టు 29: వర్షాభావంతో ఎండుతున్న వేరుశెనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన రక్షక తడి ప్రక్రియను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు జిల్లాకు రానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలోనే ఉంటూ రెయిన్‌గన్స్ ద్వారా పంటకు ఇచ్చే మొదటి రక్షక నీటి తడులు సక్రమంగా అందేలా పర్యవేక్షిస్తారు.

08/31/2016 - 00:26

హిందూపురం, ఆగస్టు 29:సర్వశక్తులు ఒడ్డి అనంతపురం జిల్లాలో నెలకొన్న కరవును అధిగమించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యం ఆయా శాఖల అధికారులతో పంటల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

08/31/2016 - 00:25

కదిరి, ఆగస్టు 29:జిల్లాలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటకు సకాలంలో వర్షాలు కురవలేదని, ఎంత ఖర్చైనా పంటలు కాపాడుతామని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక రోడ్లు భవనాల అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేరుశనగ పంటను రక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు.

08/31/2016 - 00:25

రామగిరి : ఎండుతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, ఉమామహేశ్వరరావులు అన్నారు. సోమవారం మండలంలోని చెర్లోపల్లి వద్ద గల హంద్రీనీవా కాలువ ద్వారా వారు పర్యటించారు. కాలువ పక్కన ఎండుతున్న వేరుశనగ పంటకు కాలువలో వున్న నీటి నుంచి వేరుశనగ పంటకు గన్‌ల ద్వారా నీరు అందిస్తున్నారు.

08/31/2016 - 00:24

అనంతపురంటౌన్, ఆగస్టు 29: కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ సభ్యుల ఏడాది పదవీకాలం సెప్టెంబర్ నెలలో ముగియనుండటంతో ఇప్పటి నుంచే పలువురు ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలువురు కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికై పట్టుబడుతున్నారు. అంతేకాక గడచిన రెండు కమిటీలలో సభ్యులుగా ఉన్నవారు సైతం మరోమారు ఎన్నికలకు సిద్ధం అవుతున్నా రు.

08/31/2016 - 00:24

పెనుకొండ, ఆగస్టు 29:పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే బికె పార్థసారథి తెలిపారు. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వేరుశెనగ పంటను సిఎం పరిశీలించి రైతులతో ముఖాముఖి చర్చించనున్నట్లు తెలిపారు. అక్కడే జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. సిఎం పర్యటనపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.

08/31/2016 - 00:23

వజ్రకరూరు, ఆగస్టు 29: అనంతపురం కరవు పరిస్థితులను పరిష్కరించకుండ హంద్రీనీవా నీటిని చిత్తూరు జిల్లాలోని కు ప్పం నియోజకవర్గానికి తరలిస్తే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని నియోజకవర్గం ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి హె చ్చరించారు. నియోజకవర్గంలో ఆయకట్టు భూములకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాగులపాడు వద్ద గల హంద్రీనీవా లిఫ్ట్‌ను ముట్టడించారు.

08/31/2016 - 00:22

ఉరవకొండ, ఆగస్టు 29: రాజకీయ లబ్ధి కోసమే ఉరవకొండ ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి రైతులను అడ్డం పెట్టుకుని పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని రాగులపాడు వద్దనున్న 8వ పంప్ హౌస్‌ను ముట్టడించడానికి ప్రయత్నించడం చాలాబాధకరమన్నారు.

08/31/2016 - 00:22

పుట్టపర్తి, ఆగస్టు 29:కర్ణాటక రాష్ట్ర గవర్నర్ బిజూభాయ్‌వాలా నేడు పుట్టపర్తికి రానున్నట్లు తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం 8:40గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో చేరుకుంటారన్నారు. సత్యసాయి విమానాశ్రయంలో హెలీకాప్టర్‌కు ఇంధనం వేయించుకుని ఇక్కడి నుండి 9:00గంటలకు శ్రీశైలం బయలుదేరి వెళతారు.

08/31/2016 - 00:21

తాడిపత్రి, ఆగస్టు 29:2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేస్తామని బిజేపి జిల్లాఅధ్యక్షులు అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్యారడైజ్ హోటల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో 50శాతం ప్రజలు బిజేపికే మద్దతిస్తున్నారని వెల్లడైందని తెలిపారు.

Pages