S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 23:48

గోదావరిఖని, ఆగస్టు 30: గోదావరిఖనిలో చాప కింద నీరులా కొనసాగుతున్న వసూళ్ల దందా బయట పడింది. మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) పేరుతో బెదిరింపులకు తెగబడుతూ లక్షలాది రూపాయలు వసూళ్లు చేసిన నకిలీ ముఠా పట్టుబడింది.

08/30/2016 - 23:48

హుస్నాబాద్, ఆగస్టు 30: తెలంగాణ సాధనలో హుస్నాబాద్ ప్రాంతం కీలకమైన పాత్ర పోషించిందని, అలాంటి ఈప్రాంత ప్రజలకు నష్టం చేస్తే సహించేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించాలని కోరుతు చేపట్టిన దీక్ష మంగళవారానికి 4వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శంచి వారికి సంఘీభావం తెలిపారు.

08/30/2016 - 23:47

కరీంనగర్ టౌన్, ఆగస్టు 30: దేశ వ్యాప్తంగా ర్యాగింగ్ ఒక వైరస్‌లా వ్యాపించిందని దీన్ని వేళ్ళతో సమూలంగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. మంగళవారం నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆద్వర్యంలో స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో స్ర్తిలకు రక్షణగా షీ టీమ్- రోడ్డు సేఫ్టీ తప్పనిసరి అనే కార్యక్రమం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు.

08/30/2016 - 23:46

సుల్తానాబాద్, ఆగస్టు 30: ఆర్టీసీ బస్సు అద్దాన్ని, ఎస్సారెస్పీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన రెండు కేసుల్లో మంగళవారం టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావుతో పాటు మరో పది మందిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ బి.జీవన్ తెలిపారు.

08/30/2016 - 23:46

సుల్తానాబాద్, ఆగస్టు 30: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ టోర్నమెంటులో అండర్-14 విభాగంలో సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ విద్యార్థి అల్లెంకి సాయి శ్రీజన్, మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ చెందిన 8వ తరగతి విద్యార్థి సామల సాత్విక్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికయ్యారు.

08/30/2016 - 23:45

భీమదేవరపల్లి, ఆగస్టు 30: విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తకొండ గ్రామానికి చెందిన రైతు జుర్రు వెంకటాద్రి (50) ఈ నెల 3న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద స్తంభం ఎక్కి వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనాటి నుండి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

08/30/2016 - 23:45

మంథని, ఆగస్టు 30: సంస్కృత భాషా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా మంథని పట్టణానికి చెందిన రంగి సత్యనారయణ ఎంపికయ్యారు. మంథని పట్టణానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాదులోని ఉప్పల్ కేంద్రియ విద్యాలయంలో సంస్కృత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వచ్చేనెల 5న ఢిల్లీలో జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సత్యనారాయణ పురస్కరాన్ని అందుకోనున్నారు.

08/30/2016 - 23:43

హుజూర్‌నగర్, ఆగస్టు 30: మంగళవారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హుజూర్‌నగర్ పట్టణంలోని, మండలంలోని చెర్వులు నిండి పోయి రోడ్లపై, కల్వర్టులపై అలుగులు ప్రవహించటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పట్టణంలో పేదలకు చెందిన 11 పూరి ఇండ్లు వర్షానికి కూలిపోయాయి.

08/30/2016 - 23:42

భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 30 : మండలంలోని కనుముక్కుల గ్రామం హ్యాండ్‌లూమ్ పార్కులో చేనేత కళాకారులు ఖైరతాబాద్ గణేషునికి 75 అడుగుల చేనేత కండువాను తయారు చేస్తున్నారు. ఈ కండువాపై శివలింగం, త్రిశూలం, లడ్డూలు, తామరపుష్పం, ఓంకారం డిజైన్లను అందంగా రూపొందించారు. చేనేత కళాకారులు గత వారం రోజుల నుంచి ఈ వస్త్రం తయారీలో నిమగ్నమయ్యారు.

08/30/2016 - 23:41

మేళ్లచెర్వు, ఆగస్టు 30: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని పులిచింతల రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుండి కృష్ణానది ద్వారా వరదనీరు భారీగా రావడంతో మంగళవారం నాటికి పులిచింతల ప్రాజెక్టు వద్ద 10 టిఎంసిల మేర నీరు నిల్వఉంది. గత రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, కుంటలు పొంగిపొర్లి కృష్ణానదీలో కలుస్తున్నాయి.

Pages