S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 15:39

విజయవాడ: భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు 9 టీఎంసీలు నీరు చేరింది. మరో పది టీఎంసీల నీరు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలవరం కుడికాలువ ద్వారా నీటి సరఫరాను నిలిపివేశారు.

08/30/2016 - 15:38

హైదరాబాద్‌ : మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు నివాసంలో కాపు సంఘం నేతలు మంగళవారం భేటీ అయ్యారు. భవిష్యత్‌లో ఎటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మంజునాథ్‌ కమిటీ కాల పరిమితి మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో ఇంతవరకు కమిటీ నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు ముద్రగడ చెప్పారు.

08/30/2016 - 15:34

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ విభజన బిల్లుకు, దేవాలయాల పాలకమండళ్ల సభ్యుల సంఖ్య పెంపు బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు.

08/30/2016 - 15:32

హైదరాబాద్‌: జీఎస్‌టీ బిల్లును మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించాక, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. వర్తమాన అంశాలపై గవర్నర్‌తో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.

08/30/2016 - 14:40

హైదరాబాద్: సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు తలపెట్టిన స్వారత్రిక సమ్మెకు మద్దతునిస్తూ, సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ సిపిఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం చట్టాలను సవరించాలనుకుంటున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే తమ విధానాలను అమలు చేస్తోందన్నారు.

08/30/2016 - 14:37

హైదరాబాద్: పన్నుల ఎగవేతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును తెచ్చినట్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. జీఎస్టీ వల్ల ఏ రాష్ట్రానికైనా ఇబ్బంది కలిగితే ఐదేళ్లు ఆ నష్టాన్ని భరిస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ పై జీఎస్టీ ప్రభావం ఉందన్నారు.

08/30/2016 - 14:34

ఏలూరు : ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అగ్రి గోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషుకుమార్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు సిబ్బంది జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జైలు వర్గాలు తెలిపాయి.

08/30/2016 - 14:30

హైదరాబాద్ : సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం నేతలు హైదరాబాద్లో మంగళవారం ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసేందుకు వచ్చిన అఖిలపక్షం నేతలను పోలీసులుఅరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

08/30/2016 - 14:18

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, అమెరికా రక్షణ మంత్రి ఆష్‌ కార్టర్‌ మిలిటరీ లాజిస్టిక్స్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఇక మీదట యుద్ధవిమానాలు, యుద్ధనౌకల మరమ్మతులు, ఇంధన భర్తీ తదితరాల కోసం భారత సైనిక స్థావరాలను అమెరికా, అమెరికా సైనిక స్థావరాలను భారత్‌ వాడుకోవచ్చు.

08/30/2016 - 13:57

జలంధర్‌: పంజాబ్‌లో బంగారంపై రుణాలిచ్చే ఓ సంస్థలో రూ. 3 కోట్లు విలువ చేసే 10 కిలోల బంగారం చోరీకి గురయింది. రామమండి ప్రాంతంలోని సంస్థ కార్యాలయంలో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. దుండగుల్లో ఓ వ్యక్తి ముందుగా వచ్చి తలుపు తట్టాడు.

Pages