S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 21:35

గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళు వ్యాయామం, జాగింగ్‌లాంటివి చేయవచ్చా అని కొందరి అనుమానం. తప్పకుండా చేయవచ్చు.
గుండెపోటు వచ్చి తగ్గినవాళ్ళకి చాలా ఆసుపత్రులలో కార్డియక్ రిహాబిలిటేషన్ కార్యక్రమాల్ని బోధిస్తుంటారు. వాళ్ళ గుండెని చాలా జాగ్రత్తగా పరీక్షించి, గుండె తట్టుకోగలిగేట్టే వ్యాయామాన్ని చేయమంటారు. ఈ విధంగా వ్యాయామం చేయడంవల్ల మానసికంగా, శారీరకంగా కూడా లబ్ధిపొందుతారు.

08/30/2016 - 21:33

హెపటైటిస్‌కి, సిర్రోసిస్‌కి మధ్య చాలా తేడా వుంది. సిర్రోసిస్ మరింత ప్రమాదకరం. సిర్రోసిస్ అంటే లివర్ స్కారింగ్, ఇన్‌ఫ్లమేషన్. ఇది శాశ్వతంగా కలిగే అపాయం. పునరుత్పత్తి అయ్యే కణాలు భిన్న రూపాలలో వస్తూ లివర్‌లోపలి రక్తప్రరణకి అడ్డంపడుతుంటాయి. కొన్ని దెబ్బతిన్న కణాలు పునరుత్పత్తి కావు.

08/30/2016 - 21:32

ఊపిరితిత్తుల చుట్టూ ‘ప్లూరం’ అనే పొర ఉంటుంది. ఈ పొరలో చిల్లిపడడంతో ‘న్యూమోథొరాక్స్’ వస్తుంది. ఈ పొరకి ఊపిరితిత్తులకు మధ్య గాలి జేరి, ఊపిరితిత్తులు వ్యాకోచించడం కష్టమవుతుంది. దాంతో ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. ఛాతీలో ఏ యాక్సిడెంట్‌లోనో దెబ్బతిని, రిబ్ ఫ్రాక్చర్ అవ్వడంవల్ల ప్లూర పొర దెబ్బతిని న్యూమోధొరాక్స్ వస్తుంది.

08/30/2016 - 21:30

ఆహార నాళంలోపల మెత్తటి, నున్నటి పొర కప్పి ఉంటుంది. దీనిని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఈ పొర ఏ కారణానైనా చిరిగితే ఏర్పడే పుళ్ళని ‘అల్సర్స్’ అంటారు.
అధిక మానసిక ఒత్తిడిలో సాధారణంగా ఈ పొర దెబ్బతింటుంటుంది. అంటే మానసిక ఒత్తిడితో కడుపులో రసాయనాల ఉత్పత్తి పెరిగి, ఈ ఇబ్బంది కలుగుతుంటుంది.

08/30/2016 - 21:29

ప్ర: సైనసైటిస్ వ్యాధి చాలా నెలలుగా బాధిస్తోంది. ఎన్ని మందులు వాడినా అప్పటికప్పుడు తగ్గి మళ్లా వస్తోంది. నివారణ చెప్పగలరు?
-జె.జనార్దన్, తిరుపతి

08/30/2016 - 21:12

‘వారసత్వం అనే అంశాన్ని నేను పెద్దగా నమ్మను. అది కేవలం మన పరిచయం వరకే ఉపయోగపడుతుంది తప్ప.. మన సక్సెస్‌కు కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ నిలబడగలం’ అని అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్.

08/30/2016 - 21:05

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించిందని, ఈ విజయంతో తామెంతో పొంగిపోతున్నామని యూనిట్ సభ్యులు అన్నారు. చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో యూనిట్ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ.. టైటిల్ పెట్టిన దగ్గరనుండి అది జనంలోకి దూసుకుపోయింది.

08/30/2016 - 21:03

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘రోబో-2.0’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇలా సెట్స్‌పై ఉండగానే ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ఆసక్తికర ప్రకటన ఒకటి ఇప్పుడే వెలువడింది. రజనీ అల్లుడు, హీరో ధనుష్ ట్విట్టర్ ద్వారా ‘రోబో 2.0’ తర్వాత రజనీ చేయబోయే సినిమా తన బ్యానర్‌లోనే ఉంటుందని ప్రకటించేశాడు.

08/30/2016 - 21:00

ప్రముఖ నటుడు వెంకటేష్ చాలాకాలం తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బాబు బంగారం’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు. గతంలో వెంకీ నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్‌లాల్ హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా ‘దృశ్యం’ ఆధారంగానే తెలుగులోనూ రీమేక్ చేశారు.

08/30/2016 - 20:58

చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ భామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో ప్రత్యేకత సంతరించుకోనుంది. మిల్కీ భామ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తూండటం విశేషం. ఇప్పటికే ఆ దిశగా వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

Pages